Cars Under 10 Lakh With Automatic Transmission: భారత మార్కెట్‌లో కార్లు మాన్యువల్ మోడ్‌తో పాటు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడా అందుబాటులోకి వచ్చాయి. కార్ కొనేటప్పుడు నగరాలలో నివసించే చాలా మంది ఆటోమేటిక్ వేరియంట్‌లకే మొగ్గు చూపుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ సమయంలో కార్లు డ్రైవింగ్ చేయడం కొన్ని సిటీలలో నరకంలా అనిపిస్తుంది. దాంతో ఆటోమేటెడ్ కార్ల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. మాన్యువల్ కార్లతో పోలిస్తే ఆటోమేటిక్ కార్లు కాస్త ఖరీదైనవని తెలిసిందే. కానీ భారతదేశంలో రూ. 10 లక్షల లోపు లభించే ఆటోమేటిక్ కార్లు కూడా ఉన్నాయి. టాటా మోటార్స్, మారుతి, మహీంద్రా వంటి ఉత్తమ మోడల్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.
టాటా నెక్సాన్ (Tata Nexon)
టాటా నెక్సాన్ ఒక అద్భుతమైన 5 సీటర్ కారుగా విక్రయాల్లో దూసుకెళ్తోంది. ఈ టాటా కారులో 60 వేరియంట్‌లు భారత మార్కెట్‌లో ఉన్నాయి. వీటిలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో లభించే వేరియంట్‌లు సైతం ఉన్నాయి. ఈ కారు 6 రంగుల ఎంపికలతో మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చింది. నెక్సాన్ గ్లోబల్ NCAP నుండి క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ భద్రతా రేటింగ్‌ను కూడా పొందింది. ఈ కారులో సన్‌రూఫ్ ఫీచర్ కూడా ఉంది. టాటా నెక్సాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7.32 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
మహీంద్రా XUV 3XO (Mahindra XUV 3XO)
మహీంద్రా XUV 3XO మూడు ఇంజిన్ మోడల్స్ ఉన్నాయి. ఇందులో రెండు పెట్రోల్, ఒక డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ కారు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో మార్కెట్‌లో ఉంది. మహీంద్రా ఈ కారులో 16 రంగుల ఎంపికలు ఉన్నాయి. ఈ కారులో ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ సైతం ఇచ్చారు. మహీంద్రా XUV 3XO ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.28 లక్షల నుండి ప్రారంభమై రూ. 14.40 లక్షల వరకు ఉంటుంది.
మారుతి బాలెనో (Maruti Baleno)
మారుతి బాలెనో సైతం బడ్జెట్ ఫ్రెండ్లీ ఆటోమేటిక్ కారుగా ఫేమస్ అయింది. మారుతి కంపెనీ ఈ కారులో హెడ్-అప్ డిస్‌ప్లే, 360-డిగ్రీ వ్యూ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్ సహా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఉన్నాయి. బాలెనోలో ప్రయాణీకుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు (Airbags In Car) కూడా ఉన్నాయి. ఈ కారులో రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఇచ్చారు. మారుతి బాలెనో ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై టాప్ ఎండ్ రూ. 9.10 లక్షల వరకు ఉంటుంది.
Also Read: హ్యుందాయ్ క్రెటాను ఢీకొట్టనున్న MG Hector Facelift.. త్వరలో మార్కెట్లోకి, ఫీచర్లు చూశారా