మారుతీ సుజుకి దేశీయ మార్కెట్ కోసం జిమ్నీ 5-డోర్‌ను ఆవిష్కరించింది. జిమ్నీ చాలా సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు భారత్ లో అడుగు పెట్టింది. నెక్సా సేల్స్ ఔట్‌ లెట్ల ద్వారా విక్రయించబడుతుంది. మహీంద్రా థార్ వాహనాలకు పోటీగా ఈ వాహనం అందుబాటులోకి రానుంది. దేశీయంగా విక్రయించబడే జిమ్నీ 5-డోర్ల రూపంలో రాబోతోంది.   






5-డోర్‌ జిమ్నీ ధర ఎంతంటే?


జిమ్నీ 5-డోర్‌ వాహనానానికి సంబంధించిన ధరపై కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. సుమారు రూ. 12 లక్షలు ఉంచవచ్చని ఆటో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మే 2023 నుంచి  జిమ్నీ అమ్మకాలు మొదలుకానున్నాయి. అప్పటి వరకు ధరపై కంపెనీ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. 


ఆకర్షణీయమైన SUVగా 5 డోర్ జిమ్నీ


డిజైన్ వారీగా, జిమ్నీ బుచ్ స్టైలింగ్‌ తో ఆకర్షణీయమైన SUVగా అందుబాటులోకి రానుంది. టెయిల్‌ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్‌ తో సహా పాత రూపాన్ని కలిగి ఉంది. జిమ్నీ 5- డోర్ కూడా హెల్తీ క్లాడింగ్‌ తో వస్తుంది. లోపల, జిమ్నీ స్టీరింగ్ వీల్ కోసం సాధారణ మారుతి డిజైన్‌ ను కలిగి ఉంటుంది. అయితే స్విచ్‌ గేర్‌ లో స్విఫ్ట్‌ మాదిరిగా గుండ్రని చంకీ నాబ్‌లు ఉన్నాయి. లేటెస్ట్ ఫ్యాక్ ఫీచర్ జాబితాను కలిగి ఉంది.


మారుతి సుజుకి 5-డోర్ జిమ్నీ ఇంజిన్ ప్రత్యేకత


జిమ్నీ 1.5l పెట్రోల్‌ ఇంజిన్ ను కలిగి ఉంది. ఎలక్ట్రిక్ బూస్ట్ కోసం తేలికపాటి హైబ్రిడ్ ఇంజిన్ తో వస్తుంది. 102 bhp మరియు 130Nm వేరియెంట్లలో అందుబాటులోకి రాబోతోంది. గేర్‌ బాక్స్ ఎంపికలలో 4-స్పీడ్ ఆటోమేటిక్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌ బాక్స్ ఉన్నాయి. జిమ్నీ ఇతర మారుతి కార్లలో ఉన్న 6-స్పీడ్ గేర్‌ బాక్స్ స్థానంలో పాత ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను పొందుతుంది.వాస్తవానికి, జిమ్నీ 5-డోర్‌ని ఇతర మారుతి కార్లతో పోల్చితే కాస్త భిన్నంగా ఉంటుంది. AllGrip Pro 4WDను కలిగి ఉంటుంది. AWD, 4WDతో  గ్రాండ్ విటారా కంటే ఎక్కువ ఆఫ్ రోడ్-ఆధారిత సిస్టమ్ ను కలిగి ఉంటుంది. 


జిమ్నీకి సంబంధించి గ్రౌండ్ క్లియరెన్స్ ను కూడా ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌ కు కీలకంగా ఉంటుంది. 5 డోర్లు ఉన్నప్పటికీ, డిజైన్, పొడవు కాంపాక్ట్‌ గా ఉంటాయి. ఇది జిమ్నీని ఆఫ్ రోడ్‌ కు  సమర్థంగా పని చేసేలా చేస్తుంది. బాక్సీ ఆఫ్ రోడ్ స్టైలింగ్, 4X4 సామర్ధ్యం జిమ్నీని ప్రత్యేకంగా నిలుపుతాయి. థార్ 5 డోర్ ఇప్పటికి  రాకపోవడంతో ఈ వాహనం మరింత ప్రజాదరణ పొందుతుందని మారుతి సుజుకి భావిస్తోంది.






Read Also: హ్యుందాయ్ నుంచి అదిరిపోయే ఎలక్ట్రిక్ కారు, ఒక్క ఛార్జ్ తో 631 కిలో మీటర్లు వెళ్లొచ్చు!