Ather Rizta Price, Range And Features In Telugu: ఏథర్ రిజ్టా లుక్స్‌ చాలా ఆధునికంగా, స్టైలిష్‌గా కనిపిస్తూ రోడ్డు మీద ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ముందు భాగంలో ఉన్న షార్ప్‌ LED హెడ్‌ల్యాంప్స్‌ దానికి అగ్రెసివ్‌ లుక్‌ ఇస్తాయి. స్కూటర్‌లోని స్లీక్‌ బాడీ లైన్స్‌ & పెద్దగా ఉండే సీటు డిజైన్‌ రైడర్‌కి ప్రీమియం స్కూటర్‌ను నడుపుతున్న అనుభూతిని ఇస్తాయి. కలర్‌ ఆప్షన్లు & ఫినిషింగ్‌ క్వాలిటీ చూస్తే ఇది నిజంగా ఒక గల్జరీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అనిపిస్తుంది. మీరు స్టైలిష్, అందుబాటు ధర & ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, ఏథర్ రిజ్టా మీ ఆలోచనలకు చక్కగా సరిపోవచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో, Ather Rizta ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.15 లక్షల (Ather Rizta ex-showroom price, Hyderabad Vijayawada) నుంచి ప్రారంభం అవుతుంది. మీరు కేవలం రూ. 10,000 డౌన్ పేమెంట్ చెల్లించి ఈ బండిని ఫైనాన్స్‌లో తీసుకోవచ్చు.

ఆన్-రోడ్ ధర & ఫైనాన్స్‌ ప్లాన్‌హైదరాబాద్‌లో, ఏథర్ రిజ్టా బేస్ వేరియంట్ ఆన్-రోడ్ ధర దాదాపు 1.25 లక్షలు. విజయవాడలో ఆన్-రోడ్ ధర దాదాపు 1.24 లక్షలు. ఆన్-రోడ్ ధరలో RTO ఛార్జీలు & బీమా, ఇతర ఖర్చులు కలిసి ఉంటాయి. మీరు, విజయవాడలో డౌన్ పేమెంట్ గా 10,000 చెల్లిస్తే, మిగిలిన 1.14 లక్షలను బ్యాంకు నుంచి లోన్‌ తీసుకోవచ్చు. రుణం పొందడానికి, వడ్డీ రేటు నిర్ణయించడానికి మీ క్రెడిట్ స్కోరు బాగా ఉండాలి. ఉదాహరణకు, బ్యాంక్ మీకు 9% వడ్డీ రేటుతో లోన్‌ మంజూరు చేసిందనుకుందాం. 

4 సంవత్సరాల కోసం లోన్‌ తీసుకుంటే, మీ EMI నెలకు రూ. 3,186 అవుతుంది. ఈ 48 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 40,494 చెల్లించాలి.

3 సంవత్సరాల కోసం రుణం మంజూరైతే, మీ EMI నెలకు రూ. 3,966 అవుతుంది. ఈ 36 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ.  30,342 చెల్లించాలి.

2 సంవత్సరాల టెన్యూర్‌ ఎంచుకుంటే, మీ EMI నెలకు రూ. 5,528 అవుతుంది. ఈ 24 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 20,238 చెల్లించాలి.

1 సంవత్సరంలో లోన్‌ తీర్చాలంటే, మీ EMI నెలకు రూ. 10,213 అవుతుంది. ఈ 12 నెలల్లో మీరు మొత్తం వడ్డీగా రూ. 10,122 చెల్లించాలి.

బ్యాటరీ & పరిధిఏథర్ రిజ్టా రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది, అవి - 2.9 kWh & 3.7 kWh. 2.9 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తే 123 కి.మీ. & 3.7 kWh బ్యాటరీని పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 160 కి.మీ. రేంజ్‌ అందిస్తుంది. ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కి.మీ. వేగంతో దూసుకుపోతుంది & కేవలం 4.7 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని గ్రేడబిలిటీ 15 డిగ్రీలు, ఏటవాలుగా ఉన్న రోడ్డును సులభంగా ఎక్కగలదు. & ఇది 400 మి.మీ. వరకు నీటిలో కూడా ప్రయాణించగలదు.

భద్రత & ఫీచర్లుఏథర్ రిజ్టా ఒక మోడ్రన్‌ స్కూటర్‌, దీనిలో చాలా అధునాతన ఫీచర్లు లభిస్తాయి. వేరియంట్‌ను బట్టి ఇది 7-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేతో వస్తుంది, ఇది బ్లూటూత్, నావిగేషన్ & స్మార్ట్ కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది. ఈ డిస్‌ప్లే వాట్సాప్ నోటిఫికేషన్‌లు & లైవ్ లొకేషన్ ట్రాకింగ్‌ను కూడా చూపిస్తుంది. ఇతర ఫీచర్లలో... మ్యాజిక్ ట్విస్ట్, మల్టీ-డివైస్ ఛార్జర్ & మొత్తం 56 లీటర్ల నిల్వ స్థలం (సీటు కింద 34 లీటర్లు & ముందు ట్రంక్ 22 లీటర్లు) ఉన్నాయి. ఇది కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS)ను కలిగి ఉంది, ఇది రైడర్‌ భద్రతను పెంచుతుంది. 

రిజ్టా ఆన్-రోడ్ ధర, లోన్ మొత్తం & EMI వంటివి మీ నగరం, వేరియంట్ & బ్యాంక్ పాలసీపై ఆధారపడి ఉంటాయి. ఈ స్కూటర్‌ను కొనుగోలు చేసే ముందు ఖచ్చితంగా మీ సమీప డీలర్ & బ్యాంకు నుంచి సమాచారం పొందండి.