Ather 3.7 kWh Variant Price, Range And Features In Telugu: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో టాప్‌ కంపెనీల్లో నిలిచిన Ather Energy, తాజాగా, తన ఎంట్రీ-లెవల్‌ స్కూటర్‌ అయిన 450Sకు కొత్త 3.7 kWh బ్యాటరీ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో దీని ధర రూ. 1.45 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌). ఈ మోడల్‌ ద్వారా Ather లాంగ్‌ రేంజ్‌ను అందించడమే కాకుండా, 2.9 kWh బ్యాటరీ వేరియంట్‌కి, 450X వేరియంట్‌కి మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూరించింది.

మెరుగైన బ్యాటరీ – మెరుగైన రేంజ్‌ఈ కొత్త వేరియంట్‌ 3.7 kWh లిథియం అయాన్‌ బ్యాటరీతో వచ్చింది. దీనివల్ల, Ather 450S ఇప్పటికీ అదే 5.4 kW మోటర్‌తో పనిచేస్తున్నా, బ్యాటరీ సామర్థ్యం పెరగడంతో IDC సర్టిఫైడ్‌ రేంజ్‌ 115 కి.మీ. నుంచి 161 కి.మీ.కి పెరిగింది. అంటే ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే అటు సిటీలో, ఇటు గ్రామీణ రోడ్లపైన కూడా పూర్తి సంతృప్తికరమైన ప్రయాణం అందిస్తుంది. 

ఆన్-రోడ్ ధరలు ఎలా ఉన్నాయి?

ఆన్-రోడ్‌ ధర: ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.45 లక్షలు నుంచి EMPS 2024 రాయితీ రూ. 5000 తగ్గుతుంది, బండి ధర రూ. 1.40 లక్షలు అవుతుంది. దీనికి, RTO రుసుములు దాదాపు రూ. 20,000, బీమా దాదాపు రూ. 7.000, ఇతర అవసరమైన ఛార్జీలు కలుస్తాయి. ఫైనల్‌గా, విజయవాడలో, Ather 450S 3.7 kWh వేరియంట్‌ ఆన్‌-రోడ్‌ ధర సుమారుగా రూ. 1.49 లక్షలు అవుతుంది. 

హైదరాబాద్‌లో RTO రుసుము చాలా తగ్గుతుంది, అక్కడ ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను దాదాపు రూ. 1.49 లక్షలకు కొనవచ్చు. మీరు ఎంచుకునే వేరియంట్‌ ఆధారంగా ఈ ధర మారవచ్చు.

పెర్ఫార్మెన్స్‌ అదే, కానీ సదుపాయాలు ఎక్కువపెర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి మార్పుల్లేకుండా, ఈ స్కూటర్‌ 5.4 kW ఎలక్ట్రిక్ మోటర్‌తో 22 Nm పీక్‌ టార్క్‌ను ఇస్తుంది. ఈ బండి గరిష్టంగా గంటకు 90 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. 0-40 కి.మీ. వేగాన్ని 3.9 సెకన్లలో చేరుతుంది. రైడర్‌కు నాలుగు రైడ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి, అవి - Smart Eco, Eco, Ride, Sport.

8 సంవత్సరాల బ్యాటరీ వారంటీAther 450S 3.7 kWh వేరియంట్‌తో Ather Eight70 వారంటీ ప్యాకేజీ వస్తుంది. ఇది బ్యాటరీ ఆరోగ్యంపై 8 సంవత్సరాలు లేదా 80,000 కిలోమీటర్ల వరకూ మినిమమ్‌ 70 శాతం హెల్త్‌ హామీ ఇస్తుంది. ఫలితంగా, వినియోగదారులకు నమ్మకం పెరుగుతుంది.

డిజైన్‌, ఫీచర్లు మారలేదుకొత్త బ్యాటరీ ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ, బాడీ డిజైన్‌–డైమెన్షన్స్‌ మారలేదు. ముందు, వెనుక 12 అంగుళాల చక్రాలు, మోడరన్‌ లుక్స్‌ అలాగే ఉన్నాయి. 7-అంగుళాల LCD డిస్‌ప్లే, టర్న్-బై-టర్న్‌ నావిగేషన్‌, AtherStack OTA సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ సపోర్ట్‌ లభిస్తుంది.

భద్రతా ఫీచర్లు – ఆధునిక కాలపు వాడకానికి అనుగుణంగా

  • ఆటోహోల్డ్‌
  • ఫాల్‌ సేఫ్‌
  • ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌
  • అలెక్సా ఇంటిగ్రేషన్
  • OTA ద్వారా ఫీచర్ల అప్‌డేషన్‌

చార్జింగ్‌ సమయంహోమ్‌ ఛార్జర్‌ ద్వారా ఈ స్కూటర్‌ను 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్‌ చేయడానికి సుమారు 4.5 గంటలు పడుతుంది.

డెలివరీలు ఎప్పుడు?ఈ కొత్త వేరియంట్‌ ఆగస్టు 2025 నుంచి డెలివరీకి సిద్ధంగా ఉంటుంది. ప్రీ-బుకింగ్స్‌ ఇప్పటికే ఆన్‌లైన్‌, అలాగే Ather షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి.