Ather 450 Apex Specs Review: ఏథర్ బ్రాండ్ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న వేళ, కంపెనీ మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్రత్యేక ఆఫరింగ్ ఏథర్ 450 అపెక్స్. ఇప్పటికే పాపులర్ అయిన 450X ప్లాట్‌ఫామ్‌ను ఎంత వరకు ఎక్స్‌పాండ్ చేయగలమో చూపించడానికి Ather దీనిని డిజైన్ చేసింది. పూర్తిగా కొత్త టెక్ అప్‌డేడ్స్, మెరుగైన పనితీరు, అగ్రెసివ్ లుక్ కలిపి Apex ఈ సెగ్మెంట్‌లోని ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకుంది.
స్టైలింగ్ & డిజైన్Apex డిజైన్ చూస్తే మొదట కనిపించేది ఇండియం బ్లూ బాడీ కలర్ & ఆరెంజ్ వీల్స్. సైడ్‌లో ఉన్న ట్రాన్స్‌పరెంట్ ప్యానల్స్ లోపలున్న ఆరెంజ్ ట్రెలిస్ ఫ్రేమ్‌ను చూపిస్తూ స్కూటర్‌కు కాన్సెప్ట్-మోడల్ లాంటి ఫీల్ ఇస్తాయి. వీటన్నింటి వలన రోడ్డు మీద ఈ స్కూటర్ చాలామందిని ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ఏథర్‌కు పదేళ్లు కావడంతో, కంపెనీ ప్రత్యేకంగా 10th Anniversary Edition స్టిక్కర్లు కూడా ఇచ్చింది. మొత్తం మీద ప్రీమియం, ప్రత్యేకమైన లుక్ వంటివి Apex పేరుకు సరిపోయేలా ఉంటాయి.
పెర్ఫార్మెన్స్ – Warp+ మోడ్‌తో అసలు మ్యాజిక్450X ఎప్పటినుంచో జిప్-జాప్ యాక్సిలరేషన్‌కు పేరుగాంచింది. కానీ Apexలో వచ్చిన Warp+ మోడ్ ఆ అనుభూతిని మరింత పెంచింది. ఈ మోడ్‌లో స్కూటర్ స్ట్రాంగ్, స్పీడ్‌గా స్పందిస్తుంది. టెస్టుల్లో 0–40 కి.మీ. వేగాన్ని కేవలం 2.9 సెకన్లలో అందుకుంది. 80 కి.మీ.కి చేరడానికి 11.59 సెకన్లు మాత్రమే పట్టింది. ఇది Gen3 450X కంటే దాదాపు 4.5 సెకన్లు వేగంగా ఉంది. టాప్-ఎండ్ కూడా మంచి షార్ప్‌గా ఉంది. ఓవర్‌టేకింగ్ సమయంలో ఈ స్కూటర్ తక్షణమే స్పందిస్తూ డ్రైవ్‌ను ఎనర్జిటిక్‌గా మార్చుతుంది.
కానీ Warp+ మోడ్‌ను ఎక్కువసేపు వాడితే రేంజ్ కాస్త తగ్గుతుంది. నార్మల్ రైడింగ్ మోడ్‌ల్లో అయితే పెర్ఫార్మెన్స్ 450Xతో దాదాపు సమానమే.
ఫీచర్లు – Ather Stack 7.0 తో కొత్త అనుభవంApexలో వచ్చిన పెద్ద అప్‌డేట్ Ather Stack 7.0. ఇందులో ముఖ్యంగా వచ్చిన ఫీచర్ ఇన్‌ఫినిట్ క్రూయిజ్ (Infinite Cruise). ఇది మన నగరాల్లో కనిపించే స్టాప్-అండ్-గో ట్రాఫిక్‌కు సరిపోయేలా రూపొందించిన క్రూయిజ్ టెక్నాలజీ. ఒకే బటన్‌తో మూడు రకాల క్రూయిజ్ ఫంక్షన్లు పని చేస్తాయి:
City Cruise – ట్రాఫిక్‌లో స్థిరమైన వేగాన్ని కొనసాగిస్తుంది. బ్రేక్ కొట్టగానే ఆగిపోతుంది, మళ్లీ యాక్సిలరేట్ చేస్తే కొత్త స్పీడ్‌ను హోల్డ్ చేస్తుంది.
Hill Control – పైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు స్థిరమైన వేగాన్ని ఇస్తుంది.
Crawl Control – 10 కి.మీ. వేగంతోనూ స్మూత్‌గా కదిలేలా చేస్తుంది.
అదే బటన్ రివర్స్‌తోనూ కలిసి పని చేస్తుంది. 10 నుంచి 90 కి.మీ. వేగం మధ్య ఇది యాక్టివ్ అవుతుంది. మన ట్రాఫిక్‌లో ఈ సిస్టమ్ అద్భుతంగా పని చేస్తుంది.
అదనంగా మ్యాజిక్ ట్విస్ట్ (Magic Twist) అనే రీజెన్ టెక్నాలజీ కూడా ఉంది. యాక్సిలరేటర్‌ను రివర్స్‌గా తిప్పితే స్కూటర్ సాఫ్ట్‌గా తగ్గుతుంది. అయితే ఒక లోపం - ABS లేకపోవడం. దీనివల్ల, హార్డ్ బ్రేకింగ్‌లో రియర్ వీల్ లాక్ అయ్యే అవకాశం ఉంది.
Ather 450 Apex ప్రీమియం ధర (₹1.90 లక్షలు ఎక్స్ షోరూమ్) ఉన్నప్పటికీ, పనితీరు, టెక్, స్టైలింగ్ అన్నింటినీ కలిసి చూసినప్పుడు ఈ స్కూటర్ EV అభిమానులకు "వాల్యూ ఫర్ మనీ" ఫీల్ ఇస్తుంది. సాధారణ వాడకానికి ఇది ఖరీదుగా అనిపించవచ్చు కానీ పెర్ఫార్మెన్స్-ఓరియెంటెడ్ రైడర్స్‌కు Apex నిజంగా ప్రత్యేకమైన రైడ్ ఆప్షన్.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.