లగ్జరీ ఎస్‌యూవీల్లో ఆడీ క్యూ7కి మంచి పాపులారిటీ ఉంది. ఫేమస్ యాంకర్ అనసూయ ఈ కారును ఎప్పుడో కొనుగోలు చేసింది. ఇందులో లేటెస్ట్ వెర్షన్ ఈ సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ అయింది. దీన్ని కూడా సెలబ్రిటీలో ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ శెట్టి కూతురు, కేఎల్ రాహుల్ గర్ల్ ఫ్రెండ్ అతియా శెట్టి ఇప్పటికే ఈ కారును కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ జాబితాలో ప్రముఖ హీరోయిన్ అదితి రావు హైదరి కూడా చేరింది.


మణిరత్నం సినిమా ‘చెలియా’తో పేరు తెచ్చుకున్న ఈ భామ... సమ్మోహనం, అంతరిక్షం, వి, మహా సముద్రం సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. నవర్రా మెటాలిక్ బ్లూ కలర్ వేరియంట్‌లో ఈ ఎస్‌యూవీ కొనుగోలు చేయవచ్చు. రెండు వేరియంట్లలో ఈ ఆడి క్యూ7 అందుబాటులో ఉంది. వీటిలో ప్రీమియం ప్లస్ ధర రూ.79.99 లక్షలు కాగా... టెక్నాలజీ ట్రిమ్ వేరియంట్ ధర రూ.88.33 లక్షలుగా ఉంది.


ఆడీ క్యూ7లో 3.0 లీటర్ వీ6 టీఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ అందించారు. 340 హెచ్‌పీ, 500 ఎన్ఎం టార్క్ కూడా ఉన్నాయి. ఆడీ డ్రైవ్ సెలెక్ట్, క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్, అడాప్టివ్ ఎయిర్ సస్పెన్షన్ వంటి ఫీచర్లు కూడా దీని ఎక్విప్‌మెంట్ లిస్ట్‌లో ఉన్నాయి. దీని ముందువెర్షన్ క్యూ7లో డీజిల్ ఇంజిన్ అందించారు. అయితే ఇప్పుడు లాంచ్ కానున్న క్యూ7లో వీ6 పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంది. దీంతో ఇది మరింత శక్తివంతమైన లగ్జరీ ఎస్‌యూవీ కానుంది.


ఇందులో మ్యాట్రిక్స్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ అందించారు. లేన్ డిపార్చర్ వార్నింగ్, పార్క్ అసిస్ట్ ప్లస్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది లగ్జరీ ఎస్‌యూవీ కావడంతో ఇందులో ఆడీ వర్చువల్ కాక్‌పిట్, బీఅండ్ఓ ప్రీమియం 3డీ సౌండ్ సిస్టం, 4-జోన్ ఎయిర్ కండిషనింగ్, కాంటూర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ఐజోనర్, అరోమటిజేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో ఈ కారు అందుబాటులోకి రానుంది.


ఆడీ క్యూ7 మనదేశంలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కారు. ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ విభాగంలో ఉన్న బెస్ట్ కార్లలో ఇది కూడా ఒకటి. మనదేశంలో ఆడీ బ్రాండ్ సక్సెస్ అవ్వడంలో ముఖ్య కారణం క్యూ సిరీసే. కాబట్టి ఈ సిరీస్‌లో కంపెనీ లాంచ్ చేసే కార్లపై మంచి అంచనాలు ఉంటాయి.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?