ABP Auto Awards Live: ఏబీపీ ఆటో లైవ్ అవార్డ్స్ విజయవంతంగా రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. 2023 క్యాలెండర్ ఇయర్‌లో లాంచ్ అయిన అత్యుత్తమ కార్లు, బైక్‌లను గౌరవించాలనే మా లక్ష్యాన్ని ఈ అవార్డుల ద్వారా ముందుకు తీసుకువెళుతున్నాం. వినియోగదారుని ప్రాధాన్యతల్లో భారతీయ ఆటో పరిశ్రమ ప్రస్తుతం పెద్ద మార్పులను ఎదుర్కొంటోంది. త్వరలో ఈ మరిన్ని మార్పులను కూడా ఎదుర్కోనుంది. సేఫ్టీ, స్టెబిలిటీ, టెక్నాలజీ ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. కొత్తగా లాంచ్ అయిన కార్లు సురక్షితమైనవి మాత్రమే కాకుండా మరింత స్మార్ట్ కూడా. అయితే పెరుగుతున్న ఈవీ ట్రెండ్ కూడా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ఆసక్తిని పెంచింది.


ఏబీపీ లైవ్ అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్. మా ఆటో అవార్డుల రెండో ఎడిషన్ కోసం గత సంవత్సరంలో మమ్మల్ని ఆకట్టుకున్న ఉత్తమ కార్లను మాత్రమే మేము ఎంచుకున్నాం. మా ఆటో నిపుణుల బృందం గత సంవత్సరంలో లాంచ్ అయిన అన్ని కార్లను విశ్లేషించింది. వీటిలో మా కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న కొన్నింటిని మాత్రమే మేం ఎంపిక చేస్తాం.


అర్హత ఏంటి?
గత సంవత్సరంలో విడుదల చేసిన కొత్త కార్లు మాత్రమే అవార్డుకు అర్హత సాధిస్తాయి. ఈ కొత్త మోడల్స్ అన్నీ ప్రైవేట్ కారు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండాలి. అయితే 2023కు ముందు లాంచ్ అయిన కార్లకు సంబంధించి కొత్త వేరియంట్లు గత సంవత్సరం వచ్చి ఉంటే... వాటిలో ముఖ్యమైన, మెకానికల్ మార్పులను కూడా చేసి ఉన్నప్పుడు మాత్రమే ఈ అవార్డులకు పరిగణిస్తాం. 2023లో లాంచ్ అయిన సీబీయూ పూర్తిగా దిగుమతి అయిన కార్లు కూడా ఈ అవార్డులకు అర్హత సాధిస్తాయి.


డెసిషన్ ప్రాసెస్ ఇలా...
జ్యూరీలో ప్రఖ్యాత ఆటోమొబైల్ నిపుణులు సోమనాథ్ ఛటర్జీ (ఆటోమొబైల్ జర్నలిస్ట్, కన్సల్టెంట్ ఎడిటర్, ఏబీపీ నెట్‌వర్క్), జతిన్ ఛిబ్బర్ (ఆటోమొబైల్ జర్నలిస్ట్, యాంకర్/ప్రొడ్యూసర్ - ఆటో లైవ్), అచింత్య మెహ్రోత్రా (ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్, మోటోస్పోర్ట్స్ విజేత) ఉన్నారు. అలాగే ఆర్ఎస్ఎం ఇండియా సంస్థ నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉంది.


పరీక్షించింది ఇక్కడే...
'కార్ ఆఫ్ ది ఇయర్' అవార్డు, ఇతర సెగ్మెంట్ అవార్డు విజేతల కోసం అన్ని వాహనాలనూ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీలో (ICAT) పరీక్షించారు. ఇక్కడ అన్ని కార్లను, వాటి వ్యక్తిగత లక్షణాలను అంచనా వేయడానికి పరీక్షించారు. ఆటోమోటివ్ టెస్టింగ్ సదుపాయం కావడంతో ఇది అవార్డు విజేతలను ప్రదర్శించడానికి గొప్ప కాన్వాస్‌గా నిలిచింది. మొత్తం పనితీరుతో పాటు ఇంధన సామర్థ్యం, రైడ్ నాణ్యత, మెయింటెయిన్స్ వంటి కీలక రంగాలను అంచనా వేయడానికి రియల్ వరల్డ్ కండీషన్లలో జ్యూరీ బృందం కార్లను పరీక్షించింది.


కార్ల విభాగాల్లో విజేతలు ఇవే
  1. వాల్యూ ఫర్ మనీ కార్ ఆఫ్ ది ఇయర్ - ఎంజీ కామెట్
  2. సెడాన్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా
  3. ఆఫ్ రోడర్ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి జిమ్నీ
  4. ఎంపీ ఆఫ్ ది ఇయర్ - టయోటా ఇన్నోవా హైక్రాస్
  5. సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ ఎక్స్‌టర్
  6. ప్రీమియం ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ – బీఎండబ్ల్యూ ఎక్స్1
  7. లగ్జరీ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ - రేంజ్ రోవర్ వెలార్
  8. లగ్జరీ ఆఫ్ రోడర్ ఆఫ్ ది ఇయర్ - లెక్సస్ ఎల్ఎక్స్
  9. లగ్జరీ కార్ ఆఫ్ ది ఇయర్ - బీఎండబ్ల్యూ 7 సిరీస్
  10. లగ్జరీ ఈవీ ఆఫ్ ది ఇయర్ – మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఈ
  11. ఈవీ ఆఫ్ ది ఇయర్ – హ్యుందాయ్ ఐయోనిక్ 5
  12. పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ - లంబోర్ఘిని ఉరస్ పెర్ఫార్మంటే
  13. సూపర్‌కార్ ఆఫ్ ది ఇయర్ - ఆస్టన్ మార్టిన్ డీబీ12
  14. వేరియంట్ ఆఫ్ ది ఇయర్ - మహీంద్రా థార్ 4x2
  15. ఫేస్ లిఫ్ట్ ఆఫ్ ది ఇయర్ - టాటా నెక్సాన్
  16. పెర్ఫార్మెన్స్ కార్ ఆఫ్ ది ఇయర్ - మెర్సిడెస్ ఏఎంజీ సీ43
  17. ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్ - హోండా ఎలివేట్
  18. డిజైన్ ఆఫ్ ది ఇయర్ - మారుతి సుజుకి ఫ్రాంక్స్
  19. ఫన్ టు డ్రైవ్ కార్ ఆఫ్ ది ఇయర్ – మారుతి సుజుకి జిమ్నీ
  20. కార్ ఆఫ్ ది ఇయర్ - హ్యుందాయ్ వెర్నా


బైక్ సెగ్మెంట్‌లో వీటికే అవార్డులు
  1. డిజైన్ ఆఫ్ ది ఇయర్ – టీవీఎస్ అపాచీ ఆర్‌టీఆర్ 310
  2. వ్యాల్యూ ఫర్ మనీ బైక్ ఆఫ్ ది ఇయర్ – హోండా షైన్ 100
  3. ఆఫ్ రోడర్ బైక్ ఆఫ్ ది ఇయర్ - రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్
  4. ప్రీమియం బైక్ ఆఫ్ ది ఇయర్ - ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765 ఆర్ఎస్
  5. గ్రీన్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ - బజాజ్ చేతక్
  6. పెర్ఫార్మెన్స్ గ్రీన్ టూ వీలర్ ఆఫ్ ది ఇయర్ - అల్ట్రావయొలెట్ ఎఫ్77
  7. స్కూటర్ ఆఫ్ ది ఇయర్ - హీరో జూమ్
  8. బైక్ ఆఫ్ ది ఇయర్ - ట్రయంఫ్ స్పీడ్ 400