Honda Elevate SUV: హోండా మోటార్స్ తన ఎలివేట్ లాంచ్‌తో గత సంవత్సరం భారతదేశంలో ఎస్‌యూవీ విభాగంలోకి తిరిగి ప్రవేశించింది. ఈ ఎస్‌యూవీని దేశవ్యాప్తంగా కస్టమర్లు బాగా ఇష్టపడుతున్నారు. మిడ్ సైజ్ సెగ్మెంట్లో వస్తున్న ఈ ఎస్‌యూవీ... హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్‌వ్యాగన్ టైగన్, సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్, స్కోడా కుషాక్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లతో పోటీపడుతుంది. ఏబీపీ ఆటో లైవ్ అవార్డ్స్ (ABP Auto Awards 2024) రెండో ఎడిషన్‌లో ఎలివేట్ ‘ఎస్‌యూవీ ఆఫ్ ది ఇయర్’ (SUV of The Year) అవార్డును అందుకుంది.
ధర ఎంత? (Honda Elevate Price in India)
హోండా ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 11.58 లక్షల నుంచి రూ. 16.20 లక్షల మధ్య ఉంది. ఇది నాలుగు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. SV, V, VX, ZX వేరియంట్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఫీనిక్స్ ఆరెంజ్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, ప్లాటినం వైట్ పెర్ల్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, రేడియంట్ రెడ్ మెటాలిక్ విత్ క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ రూఫ్, ఫీనిక్స్ బ్లూ కలర్ ఆరెంజ్ పెరల్ అనే మూడు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లతో సహా 10 విభిన్న రంగుల్లో కంపెనీ దీనిని అందిస్తుంది. పెర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, ప్లాటినం వైట్ పెర్ల్, గోల్డెన్ బ్రౌన్ మెటాలిక్, లూనార్ సిల్వర్ మెటాలిక్, మెటోరాయిడ్ గ్రే మెటాలిక్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. 5 సీటర్ హోండా ఎలివేట్ ఎస్‌యూవీలో 458 లీటర్ల బూట్ స్పేస్ అందించారు. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 220 మిల్లీమీటర్లుగా ఉంది.
హోండా ఎలివేట్ ఇంజిన్, ట్రాన్స్‌మిషన్ ఇలా...
హోండా ఎలివేట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 121 పీఎస్ పవర్, 145 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 15.31 కిలోమీటర్ల మైలేజీని, సీవీటీతో 16.92 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.
హోండా ఎలివేట్ ఫీచర్లు ఇలా ఉన్నాయి? (Honda Elevate Features)
హోండా ఎలివేట్ ఫీచర్ల గురించి చెప్పాలంటే ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సన్‌రూఫ్ ఉన్నాయి. సెక్యూరిటీ ఫీచర్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, లేన్ వాచ్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్స్ (ఏడీఏఎస్), అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఆటోమేటిక్ హై స్పీడ్ బ్రేకింగ్ వంటివి ఉన్నాయి. బీమ్ అసిస్ట్ కూడా అందుబాటులో ఉంది.