5 Upcoming Flex Fuel Cars | పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదల ఖర్చుల పరంగా వాహనదారులకు ఇబ్బందులకు గురిచేస్తోంది. దాంతో భారత మార్కెట్లోకి కొత్త అవకాశాలు వస్తున్నాయి. ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఒక కొత్త, పెద్ద విప్లవాత్మక మార్పునకు ప్లాట్ ఫాం రెడీ అవుతోంది. భారత రోడ్లపై త్వరలోనే పెట్రోల్‌కు బదులుగా పూర్తిగా చెరకు, మొక్కజొన్నతో తయారు చేసిన ఇథనాల్‌ (Ethanol)తో నడిచే వాహనాలు పరుగులు తీయనున్నాయి. 

Continues below advertisement

మారుతి సుజుకి ఇప్పటికే తన వ్యాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (WagonR Flex Fuel) ను రూ.7.24 లక్షల ధరతో లాంచ్ చేసి ఈ విభాగంలో ఈ రేసును ప్రారంభించింది. అయితే మిగతా ప్రముఖ కంపెనీలు సైతం రేసులోకి వస్తున్నాయి. చాలా మందికి ఎంతో ఇష్టమైన ఎస్‌యూవీలు (SUVs) అయిన క్రెటా,  టాటా పంచ్ కూడా త్వరలోనే తమ కొత్త ఫ్లెక్స్-ఫ్యూయల్ అవతారంలో మార్కెట్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి.

త్వరలో హ్యుందాయ్ క్రెటా లాంచ్దేశంలో అత్యంత పాపులర్, అద్భుతమైన ఎస్‌యూవీ అయిన హ్యుందాయ్ క్రెటా ఇప్పుడు సరికొత్త అవతారంలో రాబోతోంది. కంపెనీ ఇటీవల దీని ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్ ప్రదర్శించింది. ఇది E100 అంటే 100 శాతం స్వచ్ఛమైన ఇథనాల్‌పై వెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ మోడల్‌లో రెగ్యులర్ క్రెటాలో ఉండే 1.5 లీటర్ ఇంజిన్‌కు బదులుగా 1.0 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఇచ్చే ఛాన్స్ ఉంది. 

Continues below advertisement

Also Read: Flex Fuel Bike: ఫ్లెక్స్‌ ఫ్యూయల్ బైక్స్‌తో ఇంధన కొరత లేకుండా కేంద్రం చర్యలు! దేశవ్యాప్తంగా 5200 ఇథనాల్‌ బంకులు!

ఇది 118 bhp పవర్‌ క్రియేట్ చేస్తుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ చిన్న, పవర్‌ఫుల్ ఇంజిన్‌ను 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ చేస్తున్నారు. ఇది మీకు స్మూత్ డ్రైవింగ్‌తో పాటు, పెట్రోల్ కోసం అధిక ఖర్చుల నుండి ఊరట కలిగిస్తుంది. 

ఇథనాల్‌పై నడవనున్న టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కింగ్‌గా పేరుగాంచిన టాటా పంచ్ (Tata Punch) కూడా ఇప్పుడు ఈ రేసులో దూసుకెళ్లేందుకు రెడీ అవుతోంది. భారత్ మొబిలిటీ షోలో టాటా కంపెనీ తన 'టాటా పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్' కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది. ఈ వాహనంలో పాత, నమ్మకమైన 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ లభిస్తుంది. దీనిని పూర్తిగా అప్‌గ్రేడ్ చేశారు.

టాటా కంపెనీ దీని ఫ్యూయల్ ఇంజెక్టర్, ఫ్యూయల్ పంప్, ఈసీయూ (ECU) సాఫ్ట్‌వేర్‌ను ఎంతగా మార్చిందంటే, ఈ ఇంజిన్ పెట్రోల్‌లో 85 శాతం వరకు ఇథనాల్ మిశ్రమం ఉన్న ఇంధనాన్ని (E85) సులభంగా ఉపయోగిస్తుంది. పెట్రోల్, సీఎన్‌జీ (CNG), ఈవీ తర్వాత పంచ్ మోడల్‌లో రాబోతున్న నాల్గవ, అత్యంత పొదుపైన వేరియంట్  కానుంది.

మారుతి ఫ్రాంక్స్, టొయోటా కార్లు ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్ల ఈ జాబితాలో కేవలం హ్యుందాయ్ క్రెటా, టాటా పంచ్ మాత్రమే కాకుండా, మారుతి సుజుకికి చెందిన స్టైలిష్ క్రాస్‌ఓవర్ ఫ్రాంక్స్ (Maruti Fronx) కూడా చేరబోతోంది. మారుతి ఫ్రాంక్స్ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌ను కూడా చాలా త్వరలోనే ప్రొడక్షన్ రెడీ చేసి మార్కెట్లోకి తీసుకురానుంది. 

Also Read: Monsoon Bike Care: వర్షాలు పడకముందే మీ బైకులో ఈ 5 విషయాలను తప్పకుండా చెక్ చేయండి

టొయోటా కూడా ఈ రేసులో వెనుకబడి లేదు. టొయోటా తన కోరల్లా హైబ్రిడ్, దేశంలో ఎంతో ఆదరణ పొందిన ఎంపీవీ (MPV) ఇన్నోవా హైక్రాస్‌ల ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్స్ రానున్నాయి.  ఇవి 100 శాతం ఇథనాల్‌ (E100)పై నడవగలవు. ఈ కార్లన్నీ మార్కెట్లోకి వస్తే ఫ్లెక్స్ ఫ్యూయల్ పోటీ పెరగడమే కాకుండా, మధ్యతరగతి వారికి ఇంధన ఖర్చు కొంతమేర తగ్గనున్నాయి.