Upcoming Electric Scooters 2025: దీపావళి పండుగ సీజన్ సమీపిస్తున్న తరుణంలో, పాపులర్‌ టూవీలర్‌ కంపెనీలు భారతీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. ఏథర్, కైనెటిక్‌, యమహా, సుజుకి & TVS వంటి మెయిన్‌ స్ట్రీమ్‌ ICE ప్లేయర్లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో ఇ-స్కూటర్ విభాగంలో ఇవి కొత్త మోడళ్లను ప్రవేశపెడతాయి. 

1. సుజుకి ఇ-యాక్సెస్జనవరిలో జరిగిన 2025 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ-యాక్సెస్‌ను ఆవిష్కరించారు. 2025 మే చివరి నుంచి గురుగావ్‌లోని ఫ్యాక్టరీలో ఈ సిరీస్ ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. 3.07 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో నడిచే సుజుకి ఈ-యాక్సెస్ సింగిల్‌ ఛార్జ్‌పై 95 కి.మీ. రేంజ్‌ కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫాస్ట్-ఛార్జింగ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 12-అంగుళాల చక్రాలు, ఆల్‌-LED లైటింగ్, బ్లూటూత్ కనెక్టివిటీతో ఫుల్లీ-కలర్డ్‌ TFT LCD డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం 2A USB పోర్ట్ & సైడ్ స్టాండ్ ఇంటర్‌లాక్ సిస్టమ్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని కొన్ని ముఖ్యమైన ఫీచర్లు.

2. టీవీఎస్ ఆర్బిటర్టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచింగ్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. రూ.లక్ష లోపు ధరతో బడ్జెట్-ఫ్రెండ్లీ మోడల్‌ అయ్యే అవకాశం ఉంది. కంపెనీ పోర్ట్‌ఫోలియోలో, ఐక్యూబ్ కంటే కాస్త దిగువ స్థాయిలో దీనిని లిస్ట్ చేస్తారు,  టీవీఎస్ ఆర్బిటర్ అని పిలుస్తున్నారు. అప్‌కమింగ్‌ టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.2 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ వస్తుంది. ఎంట్రీ లెవల్ ఐక్యూబ్ ఇ-స్కూటర్‌లోని బాష్-సోర్డ్స్‌ హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారుతో దీనిని డిజైన్‌ చేస్తున్నారు. టీవీఎస్ ఆర్బిటర్ గంటకు 75-80 కి.మీ.ల రేంజ్‌ను అందించగలదు, గరిష్ట వేగం గంటకు 70 కి.మీ.ల వరకు ఉంటుందని తెలుస్తోంది.

3. కైనెటిక్ DXకైనెటిక్ గ్రీన్, భారత మార్కెట్లోకి మూడు హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయనున్నట్లు ఇటీవల వెల్లడించింది. రాబోయే 18 నెలల్లో ఇవి జనం మధ్యకు రానున్నాయి. వీటిలో మొదటిది, 80-90ల కాలంలో స్కూటర్ల రాజ్యాన్ని ఏలిన ఐకానిక్ DX స్కూటర్‌కు ఎలక్ట్రానిక్‌ రూపం. కైనెటిక్ DX ఇ-స్కూటర్ 2025 దీపావళి పండుగ సీజన్‌కు ముందు లాంచ్‌ అవుతుంది. TFT డిస్‌ప్లే, అధునాతన IoT ఫంక్షన్స్‌ & జియో థింగ్స్‌తో కలిసి అభివృద్ధి చేసిన ఇంటెలిజెంట్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌తో ఇది వస్తుంది. రాబోయే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ బ్యాటరీ ఆప్షన్స్‌తో పాటు ఫాస్ట్-ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేయగలదు.

4. యమహా RY01RY01 అనే కోడ్‌నేమ్‌తో, భారతదేశపు మొట్టమొదటి యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ 2025 చివరి నాటికి లేదా 2026 ప్రారంభంలో విడుదల అవుతుంది. దీనిని River Indie ఆధారంగా డిజైన్‌ చేశారు. జపనీస్ టూవీలర్‌ బ్రాండ్ కోసం బెంగళూరుకు చెందిన River కంపెనీ దీనిని అభివృద్ధి చేసింది. ఇటీవల, యమహా ఇ-స్కూటర్ మొదటిసారిగా టెస్ట్‌ రైడ్‌లో కనిపించింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4 kWh బ్యాటరీ ఉంటుంది & దాదాపు 100 కి.మీ. రేంజ్ ఇస్తుంది. దీని ధర రూ. 1.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.

5. ఏథర్ EL ఇ-స్కూటర్ఏథర్ ఎనర్జీ, లక్ష రూపాయల లోపు విభాగంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ ఈవీ స్టార్టప్, ఈ ఏడాది ఆగస్టు 30న జరగనున్న తన వార్షిక కమ్యూనిటీ డే సందర్భంగా మల్టీ కాన్సెప్ట్ మోడళ్లతో పాటు కొత్త EL ఎలక్ట్రిక్ స్కూటర్ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరిస్తుంది. లాంచ్ తేదీకి దగ్గర పడేకొద్దీ ఈ స్కూటర్‌ గురించి మరిన్ని అప్‌డేట్స్‌  తెలుస్తాయి.