Cheapest Car in India: భారతదేశంలో కార్లకు డిమాండ్ నిత్యం పెరుగుతోంది. ప్రతి నెలా కొత్త మోడల్ కార్లు భారత మార్కెట్లోకి వచ్చి, పాత మోడల్స్‌కు పోటీ ఇస్తున్నాయి. ఈ కార్ల ధరలు లక్షల నుండి కోట్ల రూపాయలకు వెళుతున్నాయి. అయితే భారతదేశంలో కార్లు కొనుగోలు చేసే అతిపెద్ద వర్గం మధ్యతరగతి కుటుంబాలే అవుతున్నాయి. కరోనా తరువాత ఈఎంఐ రూపంలో కార్లు తీసుకుంటున్నారు. 5 సీటర్ విభాగంలో మంచి కారును కొనాలనుకుంటున్నారా... అయితే భారతదేశంలో అమ్ముడవుతున్న చౌకైన 5-సీటర్ కార్ల గురించి తెలుసుకుందాం.
భారత్‌లో అత్యంత చౌకైన కారు
భారతదేశంలో అత్యంత చౌకైన 5 సీటర్ కారు మారుతి S-ప్రెస్సో. ఈ 5 సీటర్ కారులో 998 cc ఇంజిన్ ఇచ్చారు. ఇది 5,500 rpm వద్ద 49 kW శక్తిని అందిస్తుంది. ఎస్ ప్రెస్సో కారులో ఇంజిన్‌తో పాటు 5 స్పీడ్ మాన్యువల్, AGS ట్రాన్స్‌మిషన్ ఎంపిక ఇచ్చారు. మారుతి S-ప్రెస్సో భద్రత కోసం డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను ప్రొవైడ్ చేసింది. ఈ కారులో హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ సైతం ఉంది. మారుతి S-ప్రెస్సో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో పాటు ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ కలిగి ఉంది. మారుతి సుజుకి ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 3,49,900 (దాదాపు రూ.3.5 లక్షలు) నుంచి ప్రారంభమవుతుంది.
5 లక్షల కంటే తక్కువ ధర కలిగిన కార్లు
మారుతి S-ప్రెస్సో తరహాలోనే ఇంకా అనేక 5 సీటర్ కార్లు ఉన్నాయి. వీటి ధర 5 లక్షల రూపాయల కంటే తక్కువ. మారుతి సుజుకి ఆల్టో K10 ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.70 లక్షల నుంచి రూ. 5.45 లక్షల వరకు ఉంది. రెనాల్ట్ క్విడ్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.30 లక్షలకు ప్రారంభమై రూ. 5.99 లక్షల వరకు ఉంటుంది. టాటా టియాగో రూ.5 లక్షల రూపాయల రేంజ్ లోని మరో కారు. టాటా ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.57 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
రూ. 30,000 జీతం ఉన్నా కూడా కారు కొనుగోలు చేయవచ్చు
భారతదేశంలో అమ్ముడవుతున్న ఈ 5-సీటర్ కార్లను నెలకు రూ. 30,000 జీతం ఉన్నవారు కూడా ప్లాన్ చేస్తే కొనుగోలు చేయవచ్చు. ఈ కార్లను లోన్ మీద కొనుగోలు చేయడానికి కనీసం రూ. 40,000 నుండి రూ. 50,000 మధ్య డౌన్ పేమెంట్ చేయాలి. బ్యాంకులు ఇచ్చే కారు లోన్‌తో దాదాపు 9 శాతం వడ్డీతో ప్రతి నెలా దాదాపు రూ. 10,000 EMI చెల్లించాల్సి ఉంటుంది.