Mahindra XUV700 Facelift Features: భారత మార్కెట్‌లో SUV విభాగం గత దశాబ్దంలోనే అద్భుతమైన వృద్ధిని నమోదు చేసింది. చిన్న సబ్-కాంపాక్ట్ SUVల నుంచి అగ్రెసివ్ స్టైలింగ్‌తో ఉన్న ఫ్లాగ్‌షిప్ మోడల్స్ వరకు, ట్రెండ్స్ ఎలా మారుతున్నాయో ఆటోమొబైల్ బ్రాండ్లు బాగా గ్రహించాయి. ఈ మార్పుల్లో అత్యంత విజయవంతమైన SUV మోడళ్లలో మహీంద్రా XUV700 ఒకటి. 2021లో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ మోడల్ అప్పటి నుంచే శక్తిమంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు, ADAS లెవల్ 2 వంటి టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంది.
ప్రస్తుతం పోటీ మరింత గట్టిగా మారడంతో, మహీంద్రా XUV700కి మిడ్-లైఫ్ అప్‌డేట్ అవసరం వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈ కంపెనీ, XUV700కి ఫేస్‌లిఫ్ట్‌ని ‘7XO’ పేరుతో తీసుకురాబోతున్నట్లు సమాచారం. నవంబర్ 26-27 తేదీల్లో బెంగళూరులో జరుగనున్న Scream Electric ఈవెంట్‌లో ఈ కొత్త మోడల్‌పై కొన్ని సంకేతాలు వచ్చే అవకాశం ఉంది.
7XOలో ఉండవచ్చని ఆశిస్తున్న టాప్ 5 ఫీచర్లను ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం.
1. ట్రిపుల్ స్క్రీన్ సెటప్ – మూడు భారీ డిస్‌ప్లేలు ఒకే గ్లాస్‌లో
ఇప్పటి వరకు మహీంద్రా Born Electric (BE) XEV 9e మోడల్లో మాత్రమే కనిపించిన ట్రిపుల్ స్క్రీన్ సెటప్ ఇప్పుడు XUV700 7XOలో రాబోతుందని అంచనా. ఈ మూడు 12.3-ఇంచుల డిస్‌ప్లేలు ఇలా పని చేస్తాయి:
- డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే
- ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్
- ఫ్రంట్ ప్యాసింజర్ కోసం ప్రత్యేక ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్
ఒకే గ్లాస్ హౌసింగ్‌లో ఇవన్నీ వచ్చే అవకాశం ఉండటంతో క్యాబిన్‌లో మొత్తం ప్రీమియం ఫీల్ మరింత పెరుగుతుంది.
2. ఎలక్ట్రిక్ బాస్ మోడ్ – రియర్ ప్యాసింజర్లకు బిజినెస్ క్లాస్ కంఫర్ట్
ప్రస్తుతం ఉన్న మోడల్‌లో ‘బాస్ మోడ్’ మెకానికల్‌గా పని చేస్తుంది. కానీ 7XOలో ఇది పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మారనుంది. దీనివల్ల, రియర్ సీట్లో కూర్చున్న వారికి ఫ్రంట్ ప్యాసింజర్ సీటుకి రీచింగ్, రిక్లైన్ వంటి ఫెసిలిటీలు ఉంటాయి. ఇవన్నీ బటన్‌తోనే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. లాంగ్ డ్రైవ్స్ చేసేటప్పుడు ఇది పెద్ద ప్రయోజనం.
3. రియర్ కెప్టెన్ సీట్స్ – మొదటిసారి XUV700లో
సెవెన్-సీటర్ SUV సెగ్మెంట్‌లో కెప్టెన్ సీట్స్‌కు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. MG Hector Plus నుంచి Innova Hycross వరకు చాలా రైవల్స్ ఇప్పటికే వీటిని అందిస్తున్నాయి. ప్రస్తు XUV700లో ఇప్పటి వరకు ఇవి లేవు. 7XO ఫేస్‌లిఫ్ట్‌లో, మిడిల్ రోలో కెప్టెన్ సీట్స్ వచ్చే అవకాశం పక్కా అని ఆటో ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం.
4. సెకండ్ రో అడ్జస్ట్‌బుల్ సీట్స్ – రిక్లైన్ + రీచ్
ఇప్పటి వరకు XUV700లో రెండో వరుస సీట్లలో రిక్లైన్ మాత్రమే ఉంది. కానీ 7XOలో రీచ్ అడ్జస్ట్‌మెంట్ కూడా రావొచ్చు. దీంతో మధ్య వరుసలో కూర్చునేవారికి మరింత లెగ్‌రూమ్, మంచి కంఫర్ట్ అందే అవకాశం ఉంది. ఫ్యామిలీ యూజర్లను దృష్టిలో పెట్టుకుంటే ఈ అప్‌డేట్ చాలా ముఖ్యమైనది.
5. కొత్త డిజైన్ ఎలిమెంట్స్ – ఫ్రంట్ ఎండ్‌లో పెద్ద మార్పులు
ఫేస్‌లిఫ్ట్ కాబట్టి డిజైన్‌లో పెద్ద మార్పులు ఉండడం ఖాయం. స్పై ఫోటోల ప్రకారం XUV700 7XOలో ఇవి కనిపించవచ్చు:
- పూర్తిగా కొత్త ఫ్రంట్ బంపర్
- అప్‌డేట్ చేసిన గ్రిల్
- కొత్త షార్ప్ LED హెడ్‌ల్యాంప్స్ & DRLs
- కొత్త స్టైల్ 18-ఇంచుల అలాయ్ వీల్స్
- మరింత అగ్రెసివ్ ఉండన్ను ఫ్రంట్ ఫేస్
7XO ఎప్పుడు వస్తుంది?
మహీంద్రా ఇప్పటివరకు అధికారిక లాంచ్ టైమ్‌లైన్ ప్రకటించలేదు. కానీ Scream Electric ఈవెంట్‌లో XEV 9S, BE6 స్పెషల్ ఎడిషన్‌తో పాటు 7XOపై కూడా కొన్ని హింట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.