Tata Punch Price, Down Payment, Loan and EMI Details: భారతీయ మార్కెట్లో, టాటా పంచ్ కారుకు కుర్రకారుతో పాటు ఫ్యామిలీ కస్టమర్లు కూడా ఫిదా అవుతున్నారు. మన దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. దీనికి 4 కారణాలు ఉన్నాయి. కారణం 1 - ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కార్, దీని ధర రూ. 7 లక్షల పరిధిలోనే ఉంది. కారణం 2 - ఇది టాటా బ్రాండ్, భద్రతకు హామీ లభిస్తుంది. కారణం 3 - దీని స్టైలిష్ లుక్ ఇటు యూత్‌కు, అటు ఫ్యామిలీకి సూటవుతుంది. కారణం 4 - కంపెనీ అందిస్తున్న అదిరిపోయే ఇంటీరియర్ ఫీచర్లు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న కారును కేవలం రూ. 40,000 నుంచి 45,000 జీతం ఉన్న వ్యక్తులు కూడా సులభంగా కొనవచ్చు. దీనికోసం ఎలా ప్లాన్ చేయాలో తెలుసుకుందాం.
టాటా పంచ్ ధరతెలుగు రాష్ట్రాల్లో టాటా పంచ్ ప్యూర్ పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర (Tata Punch ex-showroom price) 6 లక్షల 20 వేల రూపాయలు. ఆన్-రోడ్ ధర (Tata Punch on-road price) దాదాపు రూ. 7 లక్షల 45 వేల రూపాయలు.
బ్యాంక్ లోన్‌రూ. 45,000 జీతంతో దాదాపు 7.50 లక్షల బండిని ఎలా కొనగలమని బెంగ పడొద్దు. ఈ కారు కొనడానికి ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు లోన్ ఇవ్వడానికి బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ సిద్ధంగా ఉంటుంది. మీరు కేవలం రూ.1.50 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే చాలు. మిగిలిన రూ.6 లక్షల రూపాయలు లోన్ లభిస్తుంది. ఆ డబ్బును మీరు ప్రతి నెలా సులభంగా EMI రూపంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. మీ క్రెడిట్ స్కోరు ఎంత బాగుందనే దానిపై కారు రుణ మొత్తం ఆధారపడి ఉంటుంది.
ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి? మీరు టాటా పంచ్ కొనుగోలు చేయడానికి బ్యాంక్ 9 శాతం వార్షిక వడ్డీ రేటుతో రూ.6 లక్షల రుణ మంజూరు చేసిందని భావిద్దాం.
* ఏడు సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 9,653 EMI డిపాజిట్ చేయాలి. అంటే, నెలకు రూ.10 వేల కంటే తక్కువ మొత్తాన్ని కేటాయిస్తే చాలు.
* ఆరు సంవత్సరాల టెన్యూర్‌లో లోన్ మంజూరైతే, నెలకు బ్యాంక్‌కు కట్టాల్సిన EMI రూ. 10,815 అవుతుంది.
* ఐదు సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, నెలకు రూ. 12,455 వాయిదాగా చెల్లించాలి.
* నాలుగు సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, ప్రతి నెలా రూ. 14,931 EMI డిపాజిట్ చేయాలి.
బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ వార్షిక వడ్డీ రేటు కూడా మీ క్రెడిట్ స్కోరు, బ్యాంక్ విధానాలపై ఆధారపడి ఉంటుంది.
మీరు నెలకు రూ. 40,000 నుంచి రూ. 45,000 సంపాదిస్తుంటే, నిపుణుల సలహా ప్రకారం, మీరు EMIపై మాత్రమే ఈ కారును కొనండి, బ్యాంక్ రుణం తీర్చడానికి 7 లేదా 6 సంవత్సరాల కాల పరిమితి పెట్టుకోండి. మీకు ఇతర ఆదాయాలు ఉన్నప్పుడు మాత్రమే మిగిలి EMI ఆప్షన్లను పరిశీలించండి.
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో టాటా పంచ్ ధరలో కొద్దిపాటి తేడా ఉండవచ్చు. మీకు లభించే రుణ మొత్తం, వడ్డీ రేటు, మీరు ఎంచుకునే టెన్యూర్‌ను బట్టి EMI గణాంకాలు మారతాయి.