Mahindra Scorpio N Waiting Period: మన దేశంలో మహీంద్రా స్కార్పియో N కు ఉన్న పాపులారిటీది వేరే లెవెల్‌. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ SUVకి డిమాండ్‌ ఎప్పుడు చూసినా పీక్‌ స్టేజ్‌లో ఉంటుంది. ఇప్పుడు, ఈ బండి కోసం వెయిటింగ్‌ పిరియడ్‌ 1.5 నెలల నుంచి 3.5 నెలల వరకు (వేరియంట్‌ను బట్టి) ఉంది.

మహీంద్రా స్కార్పియో N Z2 వేరియంట్‌ కావాలంటే 1.5 నుంచి 2 నెలలు, Z4 వేరియంట్ కోసం 2 నుంచి 2.5 నెలలు, Z6 కోసం 2.5 నుంచి 3 నెలలు & Z8 వేరియంట్ కోసం 3 నుంచి 3.5 నెలలు ఎదురు చూడాల్సి వస్తోంది.

మహీంద్రా స్కార్పియో N బడ్జెట్కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం & పెరుగుతున్న డిమాండ్ కారణంగా, ఈ వెయిటింగ్‌ పిరియడ్‌ మరింత పెరగవచ్చు. స్కార్పియో N ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 25.15 లక్షల వరకు ఉంటుంది. వేరియంట్ & ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ను బట్టి ఈ రేటు మారుతుంది. 

ఇంజిన్ & పనితీరు ఎలా ఉంది?ఈ SUV రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. 

మొదటిది 2.0-లీటర్ mStallion టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది 203 PS పవర్‌ను, 370 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది - 16.5 kmpl నుంచి 18.5 kmpl  వరకు మైలేజీ ఇస్తుంది. 

రెండోది 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్. ఇది బేస్ ట్రిమ్‌లో 132 PS పవర్‌ను, & హయ్యర్‌ ట్రిమ్‌లో 175 PS పవర్‌ను, 300 Nm నుంచి 400 Nm టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. డీజిల్ వేరియంట్ 12.12 kmpl నుంచి 15.94 kmpl మైలేజీ ఇవ్వగలదు. ఇంకా.. 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌లోనూ ఈ బండిని కొనవచ్చు. డీజిల్ మోడల్ 4x4 ఆప్షన్‌లోనూ లభిస్తుంది, ఇది ఆఫ్-రోడింగ్‌ రైడ్‌కు సదా సిద్ధంగా ఉంటుంది.

లక్షణాలు & సాంకేతికతమహీంద్రా స్కార్పియో N ను మోడర్న్‌ టెక్నాలజీ & కంఫర్టబుల్‌ ఫీచర్లకు నిలయంగా చూడాలి. ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్‌ప్లేకు మద్దతు ఇచ్చే 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ క్యాబిన్‌లో ఉంది. సోనీ 12-స్పీకర్ సౌండ్ సిస్టమ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ & 6-వే పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి ప్రీమియం ఫీచర్లను ఈ SUVలో యాడ్‌ చేశారు.

భద్రత విషయంలో నో టెన్షన్‌స్కార్పియో N భద్రత పరంగానూ బలంగా ఉంది. దీనికి గ్లోబల్ NCAP ద్వారా "5-స్టార్ క్రాష్ టెస్ట్ రేటింగ్" లభించింది. ప్రయాణీకుల భద్రత కోసం ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ఫోర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ (EBD), యాంటీ-లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ (ABS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ & హిల్ డీసెంట్ కంట్రోల్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్‌ & టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి అడ్వాన్స్‌డ్‌ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

సైజ్‌ & స్పేస్‌స్కార్పియో N పొడవు 4662 mm, కర్బ్ వెయిట్‌ 1885 కిలోలు. గరిష్ట వేగం గంటకు 240 km. ఇది 6 & 7-సీట్ల కాన్ఫిగరేషన్స్‌లో అందుబాటులో ఉంది కాబట్టి ఒక పెద్ద కుటుంబానికి సరిపోయే SUV అవుతుంది. స్పేస్‌, రైడ్ క్వాలిటీ & స్ట్రాంగ్‌ లుక్స్‌తో ఇది Tata Harrier & Safari వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.