ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ పియాజియో గ్రూప్, తన ఐకానిక్ బ్రాండ్ వెస్పాలో 2026 మోడల్ ప్రిమావెరా, స్ప్రింట్ ఎస్ స్కూటర్లను అంతర్జాతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. క్లాసిక్ అర్బన్ లుక్‌ను కాపాడుకుంటూనే బ్రేకింగ్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్స్, డిజైన్ పరంగా కంపెనీ కీలక మార్పులు చేసింది. రోజువారీ ప్రయాణాలను మరింత సులభతరం చేసేలా ప్రాక్టికల్ అప్‌డేట్స్ ఇందులో ఉన్నాయి. ఇంజిన్ పవర్‌లో ఎటువంటి మార్పులు చేయకుండానే కేవలం భద్రత, సౌకర్యాలపై కంపెనీ దృష్టి సారించింది.

Continues below advertisement

కీలక మెకానికల్ మార్పులు125 సీసీ, 150 సీసీ వేరియంట్లలో ఈసారి బ్రేకింగ్ వ్యవస్థను మెరుగుపరిచారు. పాత డ్రమ్ బ్రేక్‌కు బదులుగా వెనుక చక్రానికి 220 మిమీ స్టీల్ డిస్క్ బ్రేక్, ట్విన్-పిస్టన్ కాలిపర్‌ను అమర్చారు. ముందు వైపు డిస్క్ బ్రేక్, ఏబీఎస్ (ABS) తో కలిసి ఇది సిటీ రోడ్లపై మెరుగైన బ్రేకింగ్ సామర్థ్యాన్ని అందిస్తుంది. 50 సీసీ పైన ఉన్న అన్ని మోడళ్లలో కీ-లెస్ ఇగ్నిషన్ (Keyless Ignition) సదుపాయం కల్పించారు. ఎలక్ట్రానిక్ ఫోబ్ (Fob) ద్వారా ఇంజిన్ స్టార్ట్ చేయడం, సీటు అన్‌లాక్ చేయడం, బైక్ ఫైండర్ ఫంక్షన్‌ను వాడుకోవచ్చు. కొత్త 12-అంగుళాల ఐదు-స్పోక్ అలాయ్ వీల్స్ స్కూటర్ హ్యాండ్లింగ్‌ను మరింత స్టేబుల్ గా మారుస్తాయి.

డిజైన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ స్ప్రింట్ ఎస్ మోడల్ ఐదు-స్లాట్ల ఫ్రంట్ గ్రిల్‌తో స్పోర్టీ లుక్‌లో కనిపిస్తుంది. ప్రిమావెరా మోడల్ లో మడ్‌గార్డ్ క్రెస్ట్, ఫ్రంట్ షీల్డ్ పై స్లిమ్ 'టై' ఎలిమెంట్ వంటి మార్పులు దీనికి క్లాసిక్ ఎలిగాన్స్‌ను ఇస్తాయి. హ్యాండిల్ బార్ కింద బ్యాగ్ హుక్ వంటి ప్రాక్టికల్ ఫీచర్లు అలాగే ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్ లో కొత్త ఫుల్ ఎల్‌సీడీ (LCD) ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అమర్చారు. ప్రిమావెరాలో వైట్-ఆన్-బ్లాక్ థీమ్, స్ప్రింట్ ఎస్ లో స్పోర్టీ రెడ్ యాక్సెంట్స్ ఆకట్టుకుంటాయి. కొన్ని టాప్ ట్రిమ్స్ లో 5-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) డిస్‌ప్లేతో పాటు వెస్పా ఎంఐఏ (Vespa MIA) యాప్ కనెక్టివిటీ లభిస్తుంది.

Continues below advertisement

ఇంజిన్ ఆప్షన్లుపెట్రోల్ వెర్షన్లలో ఎయిర్-కూల్డ్ 50 సీసీ, 125 సీసీ, 150 సీసీ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు  ఎలక్ట్రిక్ మోపెడ్ వేరియంట్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ వెర్షన్లలో రిమూవబుల్ బ్యాటరీ సౌకర్యం ఉండటం విశేషం. ప్రిమావెరా టెక్ ఎలక్ట్రిక్ మోడల్ జీరో-ఎమిషన్ కోరుకునే వారికి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఈ కొత్త మోడల్స్ త్వరలోనే షోరూమ్‌లలో సందడి చేయనున్నాయి. ఇండియాలో లాంచ్ గురించి కంపెనీ నుండి త్వ‌ర‌లోనే అధికారిక ప్రకటన రానున్న‌ట్లు తెలుస్తోంది.