2026 TVS Jupiter 125 Colors: మధ్యతరగతి ఫ్యామిలీ వినియోగదారులను ఆకట్టుకుంటున్న టీవీఎస్ జూపిటర్ 125 ఎప్పటికప్పుడు వివిధ విభాగాల్లో అప్‌డేట్ అవుతూ వస్తోంది. ఇప్పుడు మరో కీలకమైన అప్‌డేట్‌తో మరింత మంది వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికి అందుబాటులో ఉన్న కలర్స్‌తోపాటు మరిన్ని కలర్స్‌తో మార్కెట్‌లో మరింత కలర్‌ఫుల్‌గా ముస్తాబైంది. కేవలం రంగులను మార్చడమే కాకుండా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగానే వేరియంట్స్‌లో, ధరల్లో స్వల్ప మార్పులు చేసింది. వాటి గురించి ఇక్కడ చూద్దాం. 

Continues below advertisement

టీవీఎస్‌ మోటార్స్‌ తన పాపులర్‌ స్కూటర్‌ జూపిటర్‌ 125లో రెండు సరికొత్త రంగులను ప్రవేశ పెట్టింది. ఐవరీ మ్యాట్‌ కాపర్ బ్రాంజ్‌, ఐవరీ ఎలైట్ గ్రీన్ అనే రెండు రంగులను ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో ఇప్పుడు మొత్తంగా టీవీఎస్ జూపిటర్‌ 125 11 రంగుల్లో లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రెండు రంగులు కూడా డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్స్‌లో అమ్మకానికి ఉంచింది. 

Continues below advertisement

125 సీసీ ఫ్యామిలీ స్కూటర్స్‌కు మార్కెట్‌లో గట్టి పోటీ ఉంది. వినియోగదారులను ఆకట్టుకునే క్రమంలో ఏ చిన్న అవకాశాన్ని కూడా సంస్థలు వదులుకోవడం లేదు. అందుకే తమ ప్రొడక్ట్ ట్రెండీగా ఉండాలని, వినియోగదారులను ఆకర్షించాలని కోరుకునే వారంతా ఏదో మార్పుతో మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే చిన్న చిన్న మార్పులతో మార్కెట్ లీడర్‌గా ఎదగాలని టీవీఎస్ జూపిటర్ 125 చూస్తోంది. అందుకే కలర్‌ కాంబినేషన్‌లో మార్పులు చేసింది. 

ఫ్యామిలీ రైడర్స్‌ను టీవీఎస్‌ జూపిటర్‌ టార్గెట్ చేసింది. డీసెంట్‌గా ఉండే రంగులను కొత్తగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగులు చూడటానికి కేవలం డ్యూయల్ టోన్ లాగా కాకుండా, ట్రై టోన్‌ ఎఫెక్ట్‌ను ఇస్తున్నాయి. డీటీ ఎస్‌ఎక్స్‌సీ వేరియంట్‌లో బ్రౌన్ కలర్ సీటు, ఫ్లోర్‌ బోర్డ్‌ చుట్టూ లేత బ్రౌన్ షేడ్ ఉండటం వల్ల స్కూటర్‌కు ఒక లగ్జరీ లుక్ వస్తుంది. ఫ్రంట్‌ ఏప్రాన్, సైడ్ ప్యానెల్‌పై ప్రధాన రంగు ఉండగా మిగిలిన చోట్ల ఐవరీ ఫినిషింగ్ ఇచ్చారు. 

స్మార్ట్ ఎక్సోనెక్ట్ వేరియంట్‌ సింపుల్‌గా ఉంటోంది. ఈ వేరియంట్‌లో మ్యాట్ కాపర్ బ్రాంజ్‌, ఎలైట్‌ గ్రీన్‌ను సింగిల్‌ టోన్ ఫినిషింగ్‌తో ఇచ్చారు. దీనికి బ్లాక్ సీట్‌, బ్లాక్ ఇన్నర్‌ ప్యానెల్స్ ఉండటం వల్ల కొంచెం స్పోర్టీగా కనిపిస్తుంది. 

రంగుల్లోనే కాదు ధరల్లోనూ మార్పులు 

కొత్త రంగులతోపాటు ధరల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసింది పాత ధరలతో పోలిస్తే 600 నుంచి 1000 రూపాయల వరకు పెరిగాయి. 

వేరియంట్‌ కొత్త ధర పాతధరతేడా 
డ్రమ్‌ అలోయ్‌  రూ. 80,550 రూ. 81,150రూ. 600 
డిస్క్‌ రూ. 85,750రూ. 86,350రూ. 600
డీటీఎస్‌ఎక్స్‌సీ   రూ. 86,750  రూ.89,700   మార్పు లేదు.
స్మార్ట్ఎక్సోనెక్ట్‌   రూ. 89,760 రూ. 90,760రూ. 1000

 జూపిటర్ 150 కేవలం రంగుల వల్ల మాత్రమే కాకుండా, దాని ప్రాక్టికాలిటీ వల్ల అగ్రస్థానంలో ఉంది. యూజర్‌ల రివ్యూల ప్రకారం సీటు కింద ఇద్దరు వ్యక్తుల హెల్మెట్లు పట్టేంత స్థలం ఉంది. ఇది బాగా నచ్చుతోంది. సీటు దిగకుండా పెట్రోల్ కొట్టించుకునే సదుపాయం కూడా సౌకర్యవంతంగా ఉంది. స్మార్టోనెక్ట్‌ ఫీచర్ ద్వారా నావిగేషన్, కాల్ అలర్ట్స్‌ వంటివి స్కూటర్‌ స్క్రీన్‌పైనే చూసుకోవచ్చు. అడ్జస్టబుల్‌ షాక్ అబ్జర్వర్స్‌ వల్ల గుంతల రోడ్లలో కూడా సాఫీగా వెళ్లిపోవచ్చని చెబుతున్నారు.