2026 Maruti Suzuki Brezza Price And Features: మన మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్‌ SUVలలో ఒకటైన Maruti Suzuki Brezza ఇప్పుడు మరింత ఇంధన పొదుపుతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. 2026 Brezza ఫేస్‌లిఫ్ట్‌కు సంబంధించిన ARAI ధృవీకరించిన ఫ్యూయల్‌ ఎఫిషియెన్సీ (మైలేజ్‌) గణాంకాలను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. కొత్త Brezza పెట్రోల్‌, టర్బో పెట్రోల్‌ & CNG పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులోకి వచ్చింది. ఈ కారు, వేరియంట్‌ను బట్టి లీటరుకు 19.96 కి.మీ. నుంచి 26.90 కి.మీ. వరకు నడుస్తుంది.

Continues below advertisement

కొత్త 2026 Maruti Suzuki Brezza ప్రారంభ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.7.40 లక్షలు. ఈసారి కంపెనీ కొత్త టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను కూడా పరిచయం చేయడం విశేషం. దీంతో, పవర్‌ పెర్ఫార్మెన్స్‌ కోరుకునేవారికి ఒక కొత్త ఎంపిక అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో మైలేజ్‌ను కూడా మెరుగుపరచడం ద్వారా కుటుంబ వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

కొత్త Brezzaలో 1.0 లీటర్‌ డైరెక్ట్‌ ఇంజెక్షన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ను అందించారు. ఇది గరిష్ఠంగా 110 హెచ్‌పీ శక్తి & 170 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

Continues below advertisement

1.5 లీటర్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ 103 హెచ్‌పీ శక్తి & 139 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. 

CNG వేరియంట్‌లో, CNG మోడ్‌లో 88 హెచ్‌పీ శక్తి & 121.5 ఎన్ఎం టార్క్‌ లభిస్తుండగా, పెట్రోల్‌ మోడ్‌లో మాత్రం 103 హెచ్‌పీ శక్తి & 139 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే!

మైలేజ్‌ 2026 Maruti Brezza CNG వేరియంట్‌ ఇంధనం విషయంలో చాలా పొదుపును పాటిస్తుంది. ARAI ప్రకారం, ఈ వేరియంట్‌ ఏకంగా 26.90 కిమీ/కేజీ మైలేజ్‌ను అందిస్తుంది. పెట్రోల్‌ వేరియంట్లలో 1.5 లీటర్‌ మాన్యువల్‌ మోడల్‌ 21.09 కిమీ/లీటర్‌తో అత్యుత్తమ గణాంకాన్ని నమోదు చేసింది. కొత్త టర్బో పెట్రోల్‌ మాన్యువల్‌ వేరియంట్లు గరిష్ఠంగా 20.47 కిమీ/లీటర్‌ వరకు మైలేజ్‌ను అందిస్తున్నాయి.

వేరియంట్‌ల వారీగా చూస్తే...

వేరియంట్‌
కంపెనీ చెప్పిన మైలేజ్‌
LXi/VXi Turbo
 
20.47kpl
ZXi/ZXi+ Turbo
 
19.96kpl
LXi/VXi MT
 
21.09kpl
ZXi MT
 
20.81kpl
VXi/ZXi/ZXi+ AT
 
20.17kpl
LXi/VXi/ZXi CNG MT
 
26.90km/kg

గత Brezzaతో పోలిస్తే ఈసారి అన్ని పవర్‌ట్రెయిన్‌లలోనూ మైలేజ్‌ పెరగడం విశేషం. గత మోడల్‌లో LXi & VXi పెట్రోల్‌ మాన్యువల్‌ వేరియంట్లు 17.80 కిమీ/లీటర్‌ మైలేజ్‌ను అందించగా, ఇప్పుడు అది 21.09 కిమీ/లీటర్‌కు పెరిగింది. ZXi మాన్యువల్‌ వేరియంట్‌ 19.89 కిమీ/లీటర్‌ నుంచి 20.81 కిమీ/లీటర్‌కు చేరుకుంది. ఆటోమేటిక్‌ వేరియంట్ల మైలేజ్‌ కూడా 19.80 కిమీ/లీటర్‌ నుంచి 20.17 కిమీ/లీటర్‌కు మెరుగుపడింది.

ఇది కూడా చదవండి: కియా సైరోస్ EV లాంచ్‌ - 526 km రేంజ్‌, ADAS, వెంటిలేటెడ్ రియర్ సీట్లు, BaaS స్కీమ్‌తో తక్కువ రేటు!

అలాగే CNG వేరియంట్‌లోనూ గణనీయమైన మెరుగుదల కనిపిస్తోంది. గతంలో 25.51 కిమీ/కేజీ మైలేజ్‌ను అందించిన Brezza CNG ఇప్పుడు 26.90 కిమీ/కేజీ వరకు చేరుకుంది. అంటే ప్రతి కేజీ CNGతో మరింత దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కొత్త మోడల్‌ అందిస్తోంది.

కొత్త టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ ప్రవేశపెట్టడం, అన్ని పవర్‌ట్రెయిన్‌లలో మైలేజ్‌ను పెంచడం, CNG వేరియంట్‌ను మరింత ఇంధన పొదుపుగా మార్చడం ద్వారా 2026 Maruti Suzuki Brezza కాంపాక్ట్‌ SUV విభాగంలో తన స్థానాన్ని మరింత బలపరచుకునే ప్రయత్నం చేస్తోంది. తక్కువ ఇంధన ఖర్చుతో మంచి పనితీరు కోరుకునే వినియోగదారులకు ఈ కొత్త Brezza ఆకర్షణీయమైన ఎంపికగా నిలిచే అవకాశం ఉంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.