Maruti e Vitara EV Review: మారుతి సుజుకి నుంచి రాబోతున్న తొలి ఎలక్ట్రిక్‌ SUV ఇ విటారాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. 2026 ప్రారంభంలో మన మార్కెట్‌లోకి రానున్న ఈ కారుతో... మారుతి తొలిసారి మిడ్‌ సైజ్‌ ఎలక్ట్రిక్‌ SUV సెగ్మెంట్‌లో అడుగు పెట్టబోతోంది. Hyundai Creta Electric, Tata Curvv EV, MG Windsor, Mahindra BE 6 & Vinfast VF6 వంటి మోడళ్లకు ఇది నేరుగా పోటీ ఇవ్వనుంది.

Continues below advertisement

ఇప్పటివరకు మారుతి అధికారికంగా పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడించకపోయినా, యూకేలో జరిగిన డ్రైవ్‌ అనుభవం ఆధారంగా ఇ విటారా బలాలు, లోపాలపై ఓ స్పష్టమైన అంచనా వస్తోంది.

పవర్‌ డెలివరీ: స్మూత్‌, కంట్రోల్‌లో ఉండే అనుభవం

Continues below advertisement

టెస్ట్‌ డ్రైవ్‌లో ఉపయోగించిన వేరియంట్‌... 61kWh బ్యాటరీతో, 174hp పవర్‌ ఇచ్చే ఫ్రంట్‌ వీల్‌ డ్రైవ్‌ మోటార్‌ను కలిగి ఉంది. సాధారణంగా ఎలక్ట్రిక్‌ కార్లు ఇచ్చే ఆకస్మిక వేగం ఇందులో కనిపించదు. అదే దీనికి ప్లస్‌ పాయింట్‌. పవర్‌ డెలివరీ చాలా స్మూత్‌గా, లీనియర్‌గా ఉంటుంది. నగర ట్రాఫిక్‌లో డ్రైవ్‌ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని సుమారు 9.25 సెకన్లలో చేరుకోవడం గమనార్హం. ఇది టాటా కర్వ్‌ EV స్థాయిలోనే ఉంది. మారుతి ప్రకటించిన ప్రకారం, ఈ బ్యాటరీతో ARAI రేంజ్‌ 543 కిలోమీటర్లు ఉండొచ్చు.

స్టీరింగ్‌, డ్రైవింగ్‌ పొజిషన్‌

లైట్‌ స్టీరింగ్‌ నగరాల్లో బాగా ఉపయోగపడుతుంది. ట్రాఫిక్‌లో యూ-టర్న్స్‌, పార్కింగ్‌ లాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. టిల్ట్‌, టెలిస్కోపిక్‌ అడ్జస్ట్‌మెంట్‌ ఉండటంతో డ్రైవింగ్‌ పొజిషన్‌ను మనకు నచ్చినట్టుగా సెట్‌ చేసుకోవచ్చు.

ఇంటీరియర్‌ డిజైన్‌, క్వాలిటీ

ఇంటీరియర్‌ విషయంలో, ఇప్పటి వరకు వచ్చిన మారుతి కార్లలో ఇదే బెస్ట్‌ అనిపిస్తుంది. అసిమెట్రిక్‌ డాష్‌బోర్డ్‌, ట్విన్‌ స్క్రీన్‌ సెటప్‌, సాఫ్ట్‌ టచ్‌ మెటీరియల్స్‌, ఫిజికల్‌ బటన్స్‌ ఇవన్నీ ప్రీమియం ఫీల్‌ ఇస్తాయి. స్టోరేజ్‌ స్పేస్‌ కూడా సరిపడా ఉంది.

లోపాలు కూడా ఉన్నాయి

రియర్‌ సీట్‌లో కూర్చునేవారికి లెగ్‌రూమ్‌ ఓకే అయినా, ఆరు అడుగుల ఎత్తు ఉన్నవారికి హెడ్‌రూమ్‌ కాస్త తక్కువగా అనిపిస్తుంది. గ్లాస్‌ రూఫ్‌ సింగిల్‌ పేన్‌ కావడం, డార్క్‌ ఇంటీరియర్‌ వల్ల క్యాబిన్‌ అంత విస్తృతంగా అనిపించదు. బూట్‌ స్పేస్‌ కూడా ఈ సెగ్మెంట్‌ స్థాయిలో కొంచెం తక్కువే.

హైవే రైడ్‌, నాయిస్‌ లెవల్స్‌

సస్పెన్షన్‌ సెటప్‌ కొంచెం గట్టిగా ఉండటంతో హైవేల్లో, బంప్స్‌పై కారు కాస్త అస్థిరంగా అనిపిస్తుంది. ఎక్స్‌పాన్షన్ జాయింట్స్‌ దగ్గర సైడ్‌ మూవ్‌మెంట్‌ స్పష్టంగా కనిపిస్తుంది. టైర్‌ నాయిస్‌, విండ్‌ నాయిస్‌ ఎక్కువగా వినిపించడం మరో మైనస్‌.

మొత్తంగా ఎలా ఉంది?

మారుతి ఇ విటారా ఒక స్మూత్‌, ఈజీ టు డ్రైవ్‌ ఎలక్ట్రిక్‌ SUV. నగర వినియోగానికి ఇది బాగా సరిపోతుంది. అయితే, హైవే కంఫర్ట్‌, స్పేస్‌ విషయంలో కొంత మెరుగుదల అవసరం. ధర ప్రకటించిన తర్వాతే, ఇది నిజంగా ప్రత్యర్థులపై ఎంత బలంగా నిలుస్తుందో తెలుస్తుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.