Kia Seltos Top Variant Features: ఇండియాలో, మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడు ఈ సెగ్మెంట్‌లో రెండు హాట్ సెల్లింగ్ మోడళ్లు ఉన్నాయి - 2026 కియా సెల్టోస్ కొత్త జనరేషన్ & కొత్త టాటా సియెరా. ఈ రెండూ టాప్ ట్రిమ్‌లలో ఫీచర్లు గట్టిగానే ఇస్తున్నాయి. అయితే, యూజర్ల దృష్టిలో చూసుకుంటే ఏ కారు టాప్ వేరియంట్ ఎక్కువ విలువను ఇస్తుంది?.
ఎక్స్‌టీరియర్ డిజైన్ & లైటింగ్ ఫీచర్లు
రెండు SUVలు పూర్తిగా LED లైటింగ్ సెటప్‌తో వస్తాయి. అయితే టాటా సియెరాలో రియర్ ఫాగ్ లాంప్స్, అన్ని డోర్లలో పుడ్ల్ లైట్స్ ఉంటాయి, ఇవి సెల్టోస్ 2026 మోడల్‌లో లేవు.
వీల్స్ విషయానికి వస్తే... సియెరాలో 19-అంగుళాల అల్లాయ్స్ ఉన్నాయి, సెల్టోస్‌కు 18-అంగుళాల అల్లాయ్స్ ఇచ్చారు. అంటే రోడ్ ప్రెజెన్స్‌లో సియెరాకే ఒక పాయింట్ ఎక్కువ.
కానీ, సెల్టోస్‌లో ఉన్న ప్రత్యేక ఫీచర్ ఏమిటంటే - ORVM (బయటి అద్దం) అడ్జస్ట్‌మెంట్ డ్రైవర్ సీట్ మెమరీ ఫంక్షన్‌తో సింక్ అవుతుంది. సియెరాలో సీట్ మెమరీ ఉన్నా, అది ORVMలకు కనెక్ట్ కాదు.
ఇంటీరియర్, స్క్రీన్‌లు & టెక్నాలజీ
రెండు SUVలు ట్రిపుల్-స్క్రీన్ లేఅవుట్‌తో వస్తాయి.
సియెరా: 12.3-అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్, 12.3-అంగుళాల ప్యాసింజర్ డిస్‌ప్లే, 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.
సెల్టోస్: 12.3-అంగుళాల ఇన్‌ఫోటైన్‌మెంట్, 12.3-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, మధ్యలో 5-అంగుళాల క్లైమేట్ కంట్రోల్ స్క్రీన్.
స్క్రీన్‌ల పరంగా చూస్తే ప్యాసింజర్ డిస్‌ప్లే ఉన్న సియెరా మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.
సెల్టోస్‌లో HUD (Head-Up Display) టాప్ మోడల్‌లో స్టాండర్డ్‌గా ఇస్తున్నారు. అయితే, సియెరాలో HUD కేవలం లోయర్ ట్రిమ్‌లలో మాత్రమే ఉంటుంది, ఇది ఆశ్చర్యం కలిగించే విషయమే.
డ్రైవర్ సీట్ అడ్జస్ట్‌మెంట్ విషయానికి వచ్చేసరికి, సెల్టోస్ ఆప్షన్లు కొంచెం ఎక్కువ. సియెరాలో కూడా మంచి రేంజ్ ఉన్నందున రోజువారీ వాడకానికి ఇది పెద్ద లోటు అనిపించదు.
సియెరా ఆడియో సిస్టమ్‌లో స్పీకర్లు ఎక్కువ, ఇది మ్యూజిక్ లవర్స్ కోసం పెద్ద హైలైట్. అదనంగా ఎయిర్ ప్యూరిఫియర్, కూల్డ్ గ్లౌవ్ బాక్స్ కూడా సియెరాలో స్టాండర్డ్. ఇవి రెండూ సెల్టోస్ టాప్ ట్రిమ్‌లో లేవు.
డ్రైవ్ మోడ్స్, కంఫర్ట్
రెండు టాప్ ట్రిమ్‌లూ డ్రైవ్ & టెరైన్ మోడ్‌లతో వస్తాయి. అయితే సెల్టోస్‌లో డ్రైవ్ మోడ్స్ ఆప్షన్లు ఎక్కువ.
ప్యాడిల్ షిఫ్టర్లు, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఐడిల్ స్టార్ట్/స్టాప్ - ఇవి రెండు SUVల్లో స్టాండర్డ్‌గానే ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో రెండింటికీ:
6 ఎయిర్‌బ్యాగ్స్
360-డిగ్రీ కెమెరా
ఫ్రంట్, రియర్ పార్కింగ్ సెన్సర్లు
ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
అంటే సేఫ్టీ లెవల్లో రెండూ దాదాపు సమానమే.
ఏ ట్రిమ్ ఎంచుకోవాలి?ధరలు ఇంకా ప్రకటించలేదు కాబట్టి తుది నిర్ణయం చెప్పడం ఇప్పుడే కష్టం. కానీ కాగితాల మీద చూసుకుంటే... ప్యాసింజర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లౌవ్ బాక్స్, ఎయిర్ ప్యూరిఫియర్, ఎక్కువ స్పీకర్లు వల్ల సియెరా టాప్ ట్రిమ్ కొంచెం అడ్వాంటేజ్‌లో ఉంది. సెల్టోస్ పూర్తిగా వెనుకబడలేదు - HUD, అధిక సీట్ అడ్జస్ట్‌మెంట్, అగ్రెసివ్ డిజైన్ వంటివి దీనికి ప్లస్. ఫీచర్ల పరంగా మాత్రమే చూస్తే సియెరా కొంచెం ముందంజలోనే ఉంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.