New Kia Seltos 2026: కొత్త కియా సెల్టోస్ అధికారికంగా బయటకు రావడంతో, ఈసారి మిడ్‌సైజ్ SUV సెగ్మెంట్‌లో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. New Seltos ను K3 ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి రూపొందించారు. కొత్త బేస్ వల్ల ఈ SUV పొడవు, వెడల్పు, వీల్‌బేస్ పెరిగింది. AP, Telangana మార్కెట్లలో ఇప్పటికే Seltosకు మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఈ కొత్త వెర్షన్ మరింత ప్రాముఖ్యత సంతరించుకుంది. కొత్త Kia Seltos ను మొత్తం 10 రైవల్స్‌తో - Creta, Sierra, Victoris, Grand Vitara, Hyryder, Elevate, Kushaq, Taigun, Aircross X, Astor - తో పోలిస్తే ఎలా ఉందో అర్ధం చేసుకుందాం.
సైజ్ పోలిక: ఏ కారు పెద్దది?2026 Kia Seltos ఈ సెగ్మెంట్‌లో పొడవు పరంగా ముందుంది. రోడ్లపై అది మరింత ప్రీమియంగా & షార్ప్‌గా కనిపించడానికి ఇది ఒక పెద్ద కారణం. కానీ వెడల్పు, ఎత్తు & వీల్‌బేస్ విషయానికి వస్తే, Tata Sierra స్పష్టంగా ముందంజలో ఉంది. Sierra ప్రాక్టికాలిటీని పెంచే అంశాలు - పెద్ద బూట్ స్పేస్, పెద్ద వీల్ సైజ్ ఎంపిక.
Honda Elevate మాత్రం గ్రౌండ్ క్లియరెన్స్‌లో నెంబర్1 స్థానంలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గ్రామీణ రోడ్లలో ఇది మంచి ప్రయోజనం. Citroen C3 Aircross X ఈ జాబితాలో 7-సీటర్ ఆప్షన్ ఉన్న ఏకైక SUV.
అయితే Kia Seltos గ్రౌండ్ క్లియరెన్స్‌ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇంజిన్, పవర్ పోలిక: శక్తిమంతమైన SUV ఏది?ఈ సెగ్మెంట్‌లో N/A (నేచురల్లీ ఆస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజిన్లలో Honda Elevate పవర్, టార్క్ పరంగా ముందుంది. Tata Sierra కూడా అదే టార్క్‌ను ఇస్తుంది. Skoda Kushaq, VW Taigun చిన్న 1.0-లీటర్ టర్బో పెట్రోల్‌తో ఉన్నా, వాటి పెర్ఫార్మెన్స్ మంచి స్పోర్టీ నేచర్‌ను ఇస్తుంది.
Citroen C3 Aircross X మాత్రం ప్రత్యేకంగా 1.2-లీటర్ టర్బో & 1.2-లీటర్ N/A రెండింటినీ అందిస్తోంది, వాడుక ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు.
1.5-లీటర్ టర్బో పెట్రోల్‌లో Kia Seltos 2026, Hyundai Creta, Tata Sierra ఈ మూడు SUVలు పవర్ విషయంలో సమానంగా ఉంటాయి. కానీ టార్క్ విషయంలో Sierra కొంచెం ముందంజలో ఉంటుంది. ఈ సెగ్మెంట్‌లో డీజిల్ ఆప్షన్ ఉన్న మూడు SUVలు కూడా ఇవే. వీటిలో డీజిల్ పవర్, టార్క్ రెండింటిలోనూ Sierra అగ్రస్థానంలో ఉంటుంది.
హైబ్రిడ్ సెగ్మెంట్Maruti Grand Vitara, Victoris & Toyota Hyryder - ఈ మూడు SUVల ప్రత్యేకత... స్ట్రాంగ్ హైబ్రిడ్ వ్యవస్థ. ఈ మూడు మాత్రమే ఫ్యాక్టరీ CNG ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కోసం హైబ్రిడ్ SUVలను చూసే కస్టమర్లకు ఇవి బెస్ట్.
ప్రతి ఇంజిన్‌కు రెండు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు ఇస్తూ Kia Seltos తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. ఈ 10 కార్ల పోలికలో ఇది ప్రత్యేకమైన అంశం.
మొత్తంగా చూస్తే... కొత్త Kia Seltos సైజ్, స్టైలింగ్, పవర్‌ట్రెయిన్ ఎంపికల పరంగా మరింత శక్తిమంతంగా మారింది. అయితే Tata Sierra డైమెన్షన్‌లలో, Honda Elevate గ్రౌండ్ క్లియరెన్స్‌లో, Maruti & Toyota హైబ్రిడ్లు మైలేజీలో తమదైన బలం చూపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బయ్యర్లు తమ అవసరాన్ని బట్టి ఇప్పుడు మరింత స్పష్టమైన ఆలోచనతో SUVని ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.