New vs Old Tata Sierra Comparison: టాటా మోటార్స్ తిరిగి తీసుకొచ్చిన కొత్త 2025 సియెరా ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేస్తోంది. 1991లో భారతీయ మార్కెట్లోకి వచ్చిన పాత సియెరా అప్పట్లోనే ప్రత్యేకమైన డిజైన్‌తో మనలో చాలా మందికి గుర్తుండిపోయింది. మధ్యలో అమ్మకాలు ఆగిపోయినా, ఆ SUVకి ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు, 22 ఏళ్ల తర్వాత, కొత్త సియెరా పాత SUV స్పూర్తితో, పూర్తిగా ఆధునిక ఫీచర్లతో తిరిగి రావడం మరింత ఆసక్తిని రేపుతోంది.
డిజైన్‌లో వచ్చిన పెద్ద మార్పులుపాత సియెరాలో ఉన్న కర్వ్‌లాంటి రియర్ గ్లాస్ సెక్షన్ అప్పట్లోనే ఐకానిక్. ఇప్పుడు ఆ డిజైన్‌ను నేరుగా రిపీట్ చేయడం సేఫ్టీ నిబంధనల వల్ల సాధ్యం కాదు గానీ, టాటా దీనిని కలర్ కాంట్రాస్ట్ ట్రీట్‌మెంట్‌తో స్మార్ట్‌గా రీక్రియేట్ చేసింది. రియర్ విండో పైన ఉన్న బ్లాక్ ప్యానెల్ పాత సియెరా లుక్‌ను గుర్తు చేస్తుంది.
అలాగే పాత SUVలో ఉన్న స్క్వేర్ వీల్ ఆర్చెస్, హై బోనెట్ స్టాన్స్ కూడా కొత్త సియెరాలో కనిపిస్తాయి. కానీ, మోడ్రన్ టచ్‌గా 19-అంగుళాల పెద్ద వీల్స్, ఎయిరో డిజైన్, ఫుల్-విడ్త్ LED లైట్ బార్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్స్ వంటి కొత్త లుక్ ఎలిమెంట్స్ జోడించారు.
మొత్తానికి పాత SUVకి గౌరవం ఇస్తూనే, ఆధునిక SUV మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కొత్త సియెరా రూపుదిద్దుకుంది.
ఇంటీరియర్‌లో పూర్తి మార్పుపాత సియెరాలో చాలా వరకు యుటిలిటేరియన్ లుక్ ఉండేది. ఎయిర్ కండిషనింగ్, పవర్ విండోస్, టాకోమీటర్‌ను అప్పట్లో ప్రీమియం ఫీచర్లుగా భావించేవారు.
ఇక కొత్త సియెరాలో మాత్రం ఇంటీరియర్ పూర్తిగా నెక్ట్స్ లెవెల్‌లో ఉంది. డ్యాష్‌బోర్డ్ అంతా ఒక భారీ ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌తో ఉంటుంది. డ్రైవర్‌కు డిజిటల్ క్లస్టర్, మధ్యలో పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, కోడ్రైవర్‌కు కూడా అదనపు స్క్రీన్ అమర్చారు. JBL Dolby Atmos సౌండ్ సిస్టమ్, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, పెద్ద స్టోరేజ్, మెరుగైన ఎర్గోనామిక్స్ వంటివి కొత్త SUVకు ప్రీమియం ఫీల్ ఇస్తాయి.
పాత మోడల్‌లో సాధారణమైన ఫోర్-స్పోక్ స్టీరింగ్ ఉండేది. ఇప్పుడు అదే స్టైల్‌ను ఆధునిక రూపంలో మళ్లీ డిజైన్ చేసి, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఇచ్చారు.
ఇంజిన్ ఆప్షన్లలో భారీ మార్పులుపాత సియెరా మొదట నేచురల్ డీజిల్ ఇంజిన్‌తో వచ్చింది. తర్వాత 91hp టర్బో డీజిల్, 4x4 ఆప్షన్ కూడా అందించారు.
2025 సియెరా అయితే చాలా వెరైటీలు ఇస్తోంది. కంపెనీ అధికారికంగా ప్రకటించకపోయినా, కొత్త సియెరాలో ఇవి ఉండొచ్చని భావిస్తున్నారు:
1.5L నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ - 120hp
1.5L టర్బో పెట్రోల్ - 170hp
1.5L డీజిల్ - 116hp (కర్వ్ నుంచి తీసుకునే అవకాశం)
ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ ఆప్షన్లు ఇస్తారు. సియెరా ఎలక్ట్రిక్ వెర్షన్ తర్వాత లాంచ్ అవుతుంది. అయితే 4x4 ఆప్షన్ ప్రస్తుతం ఉండకపోవచ్చు. కుటుంబ వినియోగం దృష్ట్యా FWD తోనే చాలామంది సరిపెట్టుకుంటారు.
పాత సియెరా నోస్టాల్జియా, కొత్త సియెరా ఫీచర్లు రెండిటినీ కలిపిన SUV ఇది. హ్యుందాయ్ క్రెటా, గ్రాండ్ విటారా వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య టాటా ఈసారి గట్టిగానే పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. సియెరా నేమ్‌ప్లేట్‌తో తిరిగి రావడంతో మార్కెట్లో ఆసక్తికరమైన పోటీ నెలకొనబోతోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.