2025 Royal Enfield Meteor 350 Fireball Price Features: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూసిన 2025 మీటియర్‌ 350 ఇప్పుడు అధికారికంగా లాంచ్‌ అయింది. తెలుగు రాష్ట్రాల్లో, ఎక్స్‌-షోరూమ్‌ ధర రూ. 1.96 లక్షలతో ఈ కొత్త మోడల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈసారి రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కేవలం చిన్న మార్పులతో సరిపెట్టకుండా, యువతను దృష్టిలో పెట్టుకుని పెద్ద మార్పులు చేసింది. ఫీచర్లలో, స్టైల్‌లో మంచి అప్‌డేట్స్‌ ఇచ్చింది.

Continues below advertisement

నాలుగు వేరియంట్లు - కొత్త కలర్స్‌కొత్త మీటియర్‌ 350 నాలుగు వేరియంట్లలో వచ్చింది, అవి - ఫైర్‌బాల్‌, స్టెల్లార్‌, అరోరా, సూపర్‌నోవా (Fireball, Stellar, Aurora, Supernova). వీటికి అదనంగా ఏడు కలర్‌ ఆప్షన్లు ఇచ్చారు. ఫైర్‌బాల్‌ ఆరెంజ్‌, గ్రే, స్టెల్లర్‌ మ్యాట్‌ గ్రే, మెరైన్‌ బ్లూ, ఔరోరా రెట్రో గ్రీన్‌, రెడ్‌, సూపర్నోవా బ్లాక్‌ కొత్తగా జోడించారు. ఈ కలర్స్‌ ప్రత్యేకంగా రోడ్డుపై మీ బైక్‌ని ఆకట్టుకునేలా చేస్తాయి.

కీలక స్పెసిఫికేషన్లు 

Continues below advertisement

ఇంజిన్‌ -- 349.34 ccపవర్‌ -- 20.21 PSటార్క్‌ -- 27 Nmమైలేజ్‌ -- 41.88 kmplబరువు -- 191 kgబ్రేకులు -- డబుల్‌ డిస్క్‌

టాప్‌ ఫీచర్లు

ABS డ్యూయల్ ఛానల్DRLలుమొబైల్ కనెక్టివిటీ బ్లూటూత్నావిగేషన్సర్వీస్ డ్యూ ఇండికేటర్LED టెయిల్ లైట్స్పీడోమీటర్ డిజిటల్ఓడోమీటర్ డిజిటల్ట్రిప్మీటర్ డిజిటల్ఇంధన గేజ్

కొత్త ఫీచర్లు – LED టచ్‌ఈసారి మీటియర్‌ 350లో LED హెడ్‌ల్యాంప్‌, LED టర్న్‌ ఇండికేటర్లు స్టాండర్డ్‌గా వచ్చాయి. అంతేకాదు, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ప్రత్యేకత అయిన ట్రిప్పర్‌ నావిగేషన్‌ పోడ్‌ కూడా ఈ బండిలో ఉంది. అదనంగా USB టైప్‌-C ఫాస్ట్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌, అసిస్ట్‌ & స్లిప్పర్‌ క్లచ్‌, అడ్జస్టబుల్‌ బ్రేక్‌ - క్లచ్‌ లీవర్స్‌ కూడా అందించారు. ఫైర్‌బాల్‌, స్టెల్లర్‌ వేరియంట్లలో LED హెడ్‌ల్యాంప్‌ & ట్రిప్పర్‌ పోడ్‌ స్టాండర్డ్‌గా ఉండగా, సూపర్‌నోవా & అరోరాలో అడ్జస్టబుల్‌ లీవర్స్‌ కూడా ఇచ్చారు.

ఇంజిన్‌ & పనితీరుఇంజిన్‌ సైడ్‌లో పెద్ద మార్పులు లేవు. 349cc సింగిల్‌-సిలిండర్‌, ఎయిర్‌/ఆయిల్‌ కూల్డ్‌ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 20.2 bhp పవర్‌, 27 Nm టార్క్‌ ఇస్తుంది. దీనిని 5-స్పీడ్‌ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అయితే కొత్తగా ఇచ్చిన స్లిప్పర్‌ క్లచ్‌ రైడింగ్‌ అనుభవాన్ని మరింత స్మూత్‌గా చేస్తుంది.

బుకింగ్స్‌ & డెలివరీస్‌కొత్త మీటియర్‌ 350 బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. మీరు కావాలనుకుంటే, మీ దగ్గరలోని షోరూమ్‌కు వెళ్లి టెస్ట్‌ రైడ్‌ కూడా చేయవచ్చు. డెలివరీలు మాత్రం మరో వారంలో, సెప్టెంబర్‌ 22, 2025 నుంచి అధికారికంగా మొదలవుతాయి. అదనంగా రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ అధికారిక "Make It Yours" చానెల్‌ ద్వారా బైక్‌ను మీకు నచ్చిన విధంగా కస్టమైజ్‌ చేసుకోవచ్చు.

యూత్‌ కోసం పర్ఫెక్ట్‌ క్రూయిజర్‌ఈ కొత్త అప్‌డేట్స్‌తో 2025 మీటియర్‌ 350 రోడ్డుపై కేవలం ఒక బైక్‌లా కాకుండా ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌లా కనిపిస్తుంది. క్రూయిజర్‌ బైక్‌ కావాలనుకునే యువతకు ఇది పర్ఫెక్ట్‌ ఆప్షన్‌. ధర, కలర్స్‌, ఫీచర్లు అన్నీ కలిపి ఈ బైక్‌ని మార్కెట్లో మరోసారి హాట్‌ టాపిక్‌ చేశాయి.