Maruti Dzire Long Term Review 2025: మారుతి డిజైర్ గురించి ఈ స్టోరీని పూర్తిగా చదివితే, ఈ సెడాన్‌ ఎందుకు సంవత్సరాలుగా బెస్ట్‌ సెల్లర్‌గా నిలుస్తోందో మరోసారి స్పష్టమవుతుంది. లాంగ్ టర్మ్ టెస్ట్‌లో 8,500 కిలోమీటర్లు పూర్తయిన తర్వాత, డిజైర్‌ రోజువారీ సిటీ డ్రైవింగ్‌లో ఎలాంటి అనుభవం ఇచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.

Continues below advertisement

వర్షాల్లోనూ డ్రైవింగ్ అనుభవం సూపర్‌హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని రోడ్ల పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. ఒక్కసారి భారీ వర్షాలు పడితే రోడ్లు గుంతలతో నిండిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా డిజైర్‌ ఇచ్చిన డ్రైవింగ్ అనుభవం చాలా సూపర్‌. గ్రౌండ్ క్లియరెన్స్, రైడ్ క్వాలిటీ - ఈ రెండూ రోజువారీ డ్రైవ్‌ను చాలా ఈజీగా మార్చేస్తాయి. స్పీడ్ బంప్స్‌, ప్యాచ్ చేసిన రోడ్లు, నీళ్లతో నిండిన లేన్లు... ఏదైనా సరే, కారులో ఉండే వాళ్లకు పెద్దగా షాక్‌ అనిపించదు. నలుగురితో ఫుల్ లోడ్ ఉన్నప్పటికీ ఈ కారు బ్యాలెన్స్‌ కోల్పోవడం దాదాపు జరగదు.

అద్భుతమైన మైలేజ్‌డిజైర్‌లో ఉన్న Z12E ఇంజిన్‌ మరో ముఖ్యమైన ఆకర్షణ. ఇది, గత 4-సిలిండర్‌ K15C లాంటి పవర్‌ను ఇవ్వకపోయినా, మైలేజ్‌ విషయంలో మాత్రం టాప్ క్లాస్‌. ఎంత హేవీ ట్రాఫిక్‌ ఉన్నా 14 నుంచి 14.8 kmpl కన్నా తక్కువ చూపించడం అరుదు. హైదరాబాద్‌ లేదా విజయవాడ వంటి సిటీ ట్రాఫిక్‌ పరిస్థితుల్లో ఇంత మైలేజ్‌ రావడం నిజంగా ప్రశంసనీయం. నెల మొదట ఫుల్‌ ట్యాంక్‌ చేశాక దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణించే వరకు మళ్లీ ఫ్యూయల్ స్టేషన్‌కు వెళ్లాల్సిన పని లేకపోయింది.

Continues below advertisement

టాప్‌ క్లాస్‌ AC మన తెలుగువాళ్లకు AC పనితీరు చాలా ముఖ్యం. సాధారణంగా, మారుతి కార్లలో AC పవర్‌ఫుల్‌గా & క్విక్‌గా ఉంటుందని అందరికీ తెలుసు. డిజైర్‌ కూడా అదే రీతిలో పనితీరు చూపిస్తుంది. సిటీలో స్లో ట్రాఫిక్‌ డ్రైవ్ చేస్తున్నా, హైవేపై వేగంగా నడిపినా AC పనితీరు ఎప్పుడూ సేమ్‌గా కనిపించింది.

సిటీ కమ్యూట్‌లో డ్రైవర్‌కు లైట్ స్టీరింగ్‌ & సాఫ్ట్ క్లచ్‌ చాలా వరకూ రిలాక్స్‌డ్‌ డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయి. 360-డిగ్రీ కెమెరా కూడా పార్కింగ్‌ సమయంలో చాలా హెల్ప్‌ చేస్తుంది, ప్రత్యేకంగా హైదరాబాద్‌ పాతబస్తీ లాంటి టైట్ లేన్లలో.

కొన్ని చిన్న ఇబ్బందులు అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మాత్రం ఉన్నాయి. ఉదాహరణకు, బ్రైట్ ఇంటీరియర్‌ అప్‌హోల్స్టరీ. వర్షాకాలంలో కారులోకి ఎక్కేటప్పుడు జాగ్రత్తగా లేకపోతే సీట్లు త్వరగా మరకలు పడతాయి. అలాగే ముందు భాగంలో టైప్‌-C USB పోర్టులు లేకపోవడం కొంత అసౌకర్యం కలిగిస్తుంది. కొత్త ఫోన్లు ఎక్కువగా Type-C వాడుతున్నాయి కాబట్టి అదనంగా USB-A కేబుల్‌ వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది.

మరొక ఇబ్బందికర విషయం.. మారుతి ఆటో స్టార్ట్/స్టాప్ సిస్టమ్‌. ఇది చాలా సెన్సిటివ్‌గా పని చేస్తుంది. ట్రాఫిక్‌లో చిన్నగా బ్రేక్ వేసినా ఇంజిన్ ఆఫ్‌ అయిపోతుంది. వేగం పెంచాల్సిన టైంలో కారు అకస్మాత్తుగా ఆగిపోతే బాగా ఇబ్బంది. అందుకే డిజైర్‌ డ్రైవ్‌ చేసే వాళ్లు మొదట చేసే పని - ఆటో స్టార్ట్/స్టాప్‌ను ఆఫ్‌ చేయడం.

ఈ చిన్న ఇబ్బందులు తప్పిస్తే, డిజైర్‌కు పెద్ద లోపం అంటూ ఏమీ లేదు. ఇది నిజంగా రోజువారీ సిటీ డ్రైవ్‌కు సూటయ్యే కారు. కంఫర్ట్‌ సూపర్‌, మైలేజ్‌ టాప్‌, AC బెస్ట్‌, డ్రైవ్ అనుభవం స్మూత్‌. అందుకే, ఈ మాన్యువల్‌ కారుకు ఇంకా పెద్ద డిమాండ్‌ ఉంది.

సిటీ హడావిడి నుంచి బయటకు వెళ్లి, ఇదే ప్రదర్శన హైవేపై ఎలా ఉంటుందో పరీక్షించే సమయం వచ్చింది, ఆ వివరాలు కూడా త్వరలోనే వెల్లడిస్తాం. కానీ, ఇప్పటివరకు డిజైర్‌ ఇచ్చిన ఫలితాలు మాత్రం నిజంగా ఇంప్రెస్‌ చేస్తాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.