2025 Mahindra Thar facelift review: భారతదేశంలో మహీంద్రా థార్ ఎప్పుడూ ఒక క్రేజీ వెహికల్‌గా నిలుస్తుంది. లైఫ్‌స్టైల్ SUVగా పేరు తెచ్చుకున్న ఈ 3 డోర్ వెర్షన్, రీసెంట్‌గా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ పొందింది. థార్ Roxx లాంచ్ తర్వాత, ఇప్పుడు 3 డోర్ థార్‌లో వచ్చిన మార్పులు దాని యూజబిలిటీని మరింత పెంచాయి.
లుక్‌లో మార్పులుముందుగా లుక్ గురించి మాట్లాడితే, కొత్త థార్ 3 డోర్‌లో గ్రిల్ కొంచెం మారింది. బాడీ కలర్ డీటైలింగ్ ఇచ్చారు, అలాగే Roxx నుంచి వచ్చిన కొత్త గ్రే షేడ్ కూడా ఇందులో లభిస్తుంది. మొత్తంగా చూస్తే, 2025 Mahindra Thar facelift లుక్ స్ట్రాంగ్, అగ్రెసివ్‌గా ఉండి, క్లాసిక్ SUV స్టైల్‌నే కొనసాగిస్తోంది. Roxx కంటే కూడా 3 డోర్ థార్ రోడ్డుపై మరింత బాగుంటుందని చాలా మంది అంటున్నారు.
ఇంటీరియర్ అప్‌డేట్స్ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో మార్పులు ఎక్కువగా ఇంటీరియర్‌లో కనిపిస్తాయి. ఎత్తులు ఎక్కడం సులభం అయ్యేలా కొత్త గ్రాబ్ హ్యాండిల్ ఇచ్చారు. పవర్ విండో స్విచ్‌లు ఇప్పుడు డోర్ ప్యాడ్ మీదే ఉన్నాయి, ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ రిమోట్‌తో పని చేస్తుంది. రియర్ వైపర్, ఆటోమేటిక్ వేరియంట్‌లో డెడ్ పెడల్, కొత్తగా అడ్జస్టయ్యే ఆర్మ్ రెస్ట్ ఇవన్నీ లాంగ్ డ్రైవ్స్‌లో కంఫర్ట్ ఇస్తాయి.
ప్రధాన హైలైట్ 10.25 అంగుళాల కొత్త టచ్ స్క్రీన్. ఇది Roxxలో ఉన్నంత షార్ప్‌గా కాకపోయినా డిస్‌ప్లే క్లియర్‌గా ఉంది. పెద్ద రియర్ కెమెరా డిస్‌ప్లే కూడా ఇందులో ఉంది. కొత్త స్టీరింగ్ వీల్ కూడా Roxx నుంచి తీసుకున్నారు. వెనుక సీటు స్పేస్ కాస్త కాంపాక్ట్‌గా ఉన్నప్పటికీ, యూజబుల్‌గా ఉంది. స్టోరేజ్ కూడా డీసెంట్‌గా ఇచ్చారు.
డ్రైవింగ్ అనుభవంఇంజిన్‌లో పెద్ద మార్పులు లేవు. 2.2 లీటర్ డీజిల్ వేరియంట్ తన టార్క్, ఫ్యూయల్ ఎఫిషియన్సీతో ఇంకా బెస్ట్ ఆప్షన్. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ మాత్రం పవర్‌ఫుల్‌గా, స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. డ్రైవ్ చేసే ఫన్ మాత్రం అసలే తగ్గలేదు. ఆఫ్‌రోడింగ్‌కి ఇది కింగ్‌లా ఉంటుంది, కిక్ ఇస్తుంది.
కానీ, ఆన్‌రోడ్‌లో బౌన్సీ రైడ్, హెవీ స్టీరింగ్ ఇంకా అలాగే ఉన్నాయి. Roxxలో ఉన్న ఎలక్ట్రిక్ స్టీరింగ్ ఇక్కడ ఇవ్వలేదు. అయితే ఆఫ్‌రోడ్‌లో మాత్రం ఈ స్టీరింగ్ మరింత ఉపయోగకరం అవుతుంది.
కొనుగోలు చేయాలా?2025 థార్ 3 డోర్ ఇప్పుడు మరింత ప్రాక్టికల్‌గా మారింది. ఇంటీరియర్‌లో కొత్త ఫీచర్లు, టచ్‌స్క్రీన్, రియర్ వైపర్, ఆర్మ్‌రెస్ట్ ఇవన్నీ డైలీ యూజింగ్‌లో హెల్ప్ చేస్తాయి. అదే సమయంలో SUV లుక్, ఆఫ్‌రోడ్ సామర్థ్యం, పెట్రోల్-డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ అన్నీ ఇంకా బలంగా ఉన్నాయి. ధర కూడా ఆకట్టుకునేలా ఉంది. రూ. 10 లక్షల లోపు ఎక్స్‌షోరూమ్ ధర నుంచి ప్రారంభమవుతుంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇలాంటి లుక్, పవర్, ఆఫ్‌రోడ్ ఫన్ ఇచ్చే SUV మరొకటి దొరకదని చెప్పొచ్చు.
మాకు నచ్చిన పాయింట్స్
అగ్రెసివ్ లుక్
కొత్త ఇంటీరియర్ అప్‌డేట్స్
మరింత ప్రాక్టికల్‌గా మారడం
ఆఫ్‌రోడ్ ఫర్ఫామెన్స్
ఇంకా మెరుగుపరచాల్సిన పాయింట్స్
బౌన్సీ రైడ్ క్వాలిటీ
హెవీ స్టీరింగ్
మొత్తంగా చూస్తే, 2025 మహీంద్రా థార్ 3 డోర్ వేరియంట్ ఇప్పుడు డైలీ యూజ్‌కి కూడా సరిపడేలా మారి, యువతకు లైఫ్‌స్టైల్ SUVని అందిస్తోంది.