Bolero Neo Facelift 2025 Variants: Mahindra & Mahindra, తన పాపులర్‌ SUV అయిన Bolero Neo ను 2025 కోసం కొత్తగా అప్‌డేట్‌ చేసింది. Bolero Neo Facelift 2025 వెర్షన్‌లో రెండు శుభవార్తలు చెప్పింది, 1 - ధర తగ్గించడం, 2 - ఫీచర్లు పెంచడం. కొత్త డిజైన్‌ టచెస్‌, మెరుగైన కంఫర్ట్‌ సెటప్‌, కొత్త టాప్‌ వేరియంట్‌ కలిపి ఈ SUV మరింత ఆకర్షణీయంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ధరల వివరాలుఆంధ్రప్రదేశ్‌ & తెలంగాణలో కొత్త Bolero Neo ధరలు ₹8.49 లక్షల నుంచి ₹10.49 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) వరకు ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మహీంద్రా ఈసారి ధరలను ₹25,000 నుంచి ₹50,000 వరకు తగ్గించింది. టాప్‌ వేరియంట్‌ N11, పాత N10(O) కంటే ₹50,000 తక్కువకే వస్తుంది, కొత్తగా కొనేవాళ్లకు ఇది మంచి సేవింగ్‌. అయితే N10(O) మాత్రమే MTT (Multi Terrain Technology) & లాకింగ్‌ డిఫరెన్షియల్‌తో వస్తుంది, ఇది SUV తరహా డ్రైవింగ్‌కి చాలా ఉపయోగకరం.

ఇంజిన్‌ & గేర్‌బాక్స్‌ఇంజిన్‌ విషయానికి వస్తే, Bolero Neo లో 1.5 లీటర్‌ mHawk100 టర్బో డీజిల్‌ ఇంజిన్‌ ఉంది. ఇది 100 hp పవర్‌, 260 Nm టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ బాక్స్‌ మాత్రమే అందుబాటులో ఉంది, ఈ గేర్‌ బాక్స్‌ ద్వారా వెనుక చక్రాలకు పవర్‌ ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇది రియర్‌ వీల్‌ డ్రైవ్‌ SUV కాబట్టి ఎక్కువ లోడింగ్‌ లేదా కష్టమైన రోడ్లపై కూడా బలంగా నడుస్తుంది. పెట్రోల్‌ ఆప్షన్‌ ఈ SUVలో లేదు.

వేరియంట్‌ వారీగా ఫీచర్లు

N4 (₹8.49 లక్షలు): డ్యూయల్‌ ఎయిర్‌ బ్యాగ్స్‌, ABS + EBD, పవర్‌ స్టీరింగ్‌, పవర్‌ విండోస్‌, ఫోల్డబుల్‌ థర్డ్‌ రో సీట్స్‌, ఆటో స్టార్ట్‌/స్టాప్‌, ఈకో మోడ్‌.

N8 (₹9.29 లక్షలు): రిమోట్‌ కీ, ఫ్యాబ్రిక్‌ సీట్స్‌, ఆడియో కంట్రోల్స్‌, బ్లూటూత్‌ మ్యూజిక్‌ సిస్టమ్‌, సెకండ్‌ రో ఫోల్డబుల్‌ సీట్స్‌.

N10 (₹9.79 లక్షలు): LED DRLs, ఫాగ్‌ల్యాంప్స్‌, రియర్‌ కెమెరా, క్రూయిజ్‌ కంట్రోల్‌, 9-అంగుళాల టచ్‌ స్క్రీన్‌, టైప్‌-C చార్జింగ్‌ పోర్ట్‌, డ్రైవర్‌ హైట్‌ అడ్జస్టబుల్‌ సీటు.

N10(O) (₹10.49 లక్షలు): MTT లాకింగ్‌ డిఫరెన్షియల్‌ టెక్నాలజీతో ప్రత్యేక ఆకర్షణ - ఆఫ్‌రోడింగ్‌ లేదా కఠినమైన రోడ్లపై డ్రైవ్‌ చేయేవారికి అద్భుతమైన ఎంపిక.

N11 (₹9.99 లక్షలు): 16-అంగుళాల గ్రే అలాయ్‌ వీల్స్‌, లూనార్‌ గ్రే లెదరేట్‌ సీట్స్‌, ప్రీమియం ఫినిష్‌ - SUVకి రగ్డ్‌ లుక్‌ ఇస్తాయి.

డ్రైవింగ్‌ అనుభవంబొలెరో నియో, రోడ్డుపై గట్టి పట్టు ఉండే SUVగా పేరొందింది. ఈసారి ఫ్రీక్వెన్సీ డిపెండెంట్‌ డ్యాంపింగ్‌ టెక్నాలజీతో రఫ్‌ రోడ్లపై కూడా కంఫర్ట్‌గా నడుస్తుంది. ప్రత్యేకంగా N10(O) వేరియంట్‌లో లాకింగ్‌ డిఫరెన్షియల్‌ ఉండటం వల్ల, కఠినమైన రోడ్లపై కూడా ఈ SUV సులభంగా కదులుతుంది.

ఏ వేరియంట్‌ బెటర్‌?

మీరు తరచూ గుట్టలు, కఠినమైన రోడ్లు లేదా గ్రామీణ ప్రాంతాల్లో డ్రైవ్‌ చేస్తుంటే N10(O) వేరియంట్‌ మీకు బెస్ట్‌. లాకింగ్‌ డిఫరెన్షియల్‌ వల్ల ఇది కష్టమైన పరిస్థితుల్లో కూడా సులభంగా ముందుకు సాగుతుంది. 

మీరు సిటీ డ్రైవ్‌లకు, మోడ్రన్‌ ఫీచర్లతో నిండిన 7 సీటర్‌ SUV కోసం చూస్తున్నట్లయితే, N10 వేరియంట్‌ చాలా అందుబాటు ఎంపిక. ఇది అన్ని ముఖ్యమైన ఫీచర్లను బ్యాలెన్స్‌డ్‌గా అందిస్తుంది.

2025 Bolero Neo రూపంలో మహీంద్రా మళ్లీ బలమైన, ఫీచర్‌-ప్యాక్డ్‌ SUVని అందిస్తోంది. ధరలు తగ్గి, ఫీచర్లు పెరగడం వల్ల ఇది ఇప్పుడు ఫ్యామిలీ SUV మార్కెట్లో బలమైన పోటీదారుగా మారింది.