2025 Kia K4 Unveiled: ప్రముఖ కార్ల బ్రాండ్ కియా దాని స్టైలింగ్ ఫిలాసఫీకి అనుగుణంగా పూర్తిగా కొత్త డిజైన్‌తో కే4 సెడాన్ రెండో తరం మోడల్‌ను పరిచయం చేసింది. దీని టెక్నికల్ స్పెసిఫికేషన్లను, ఫీచర్లను ఇంకా ప్రకటించబడనప్పటికీ న్యూయార్క్ ఆటో షోలో పబ్లిక్ ఎంట్రీ ఇచ్చే కంటే ముందు దీని ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్ డిజైన్లు బయటకు వచ్చాయి.


2025 కియా K4 ఎక్స్‌టీరియర్ ఎలా ఉంది?
సరిగ్గా ఉన్న స్క్వేర్ తరహా కారు బాడీ డిజైన్‌ను లాజిక్ లేకుండా అడ్వాన్స్‌డ్‌గా ప్రత్యేకంగా డిజైన్ చేయాలనే లక్ష్యాన్ని కే4 డిజైనర్లు పెట్టుకున్నారని కియా తెలిపింది. ఈ ప్రక్రియను 'ట్విస్ట్ లాజిక్' అని పిలుస్తున్నట్లు కియా తెలిపింది. ఈ డిజైన్ కియా కొత్త కార్లు కార్నివాల్, ఈవీ5, ఈవీ9, ఇతర మోడళ్లకు అనుగుణంగా ఉంటుంది.




కే4 ముందు భాగంలో షార్ప్ ఎల్-షేప్డ్ వర్టికల్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది. మధ్యలో చిన్న టైగర్ నోస్ గ్రిల్ కూడా ఉంటుంది. సెడాన్ మెల్లగా వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ను కలిగి ఉంది. వెనుక పెద్ద విండ్‌స్క్రీన్ దీనికి లిఫ్ట్‌బ్యాక్ కూపే లాంటి రూపాన్ని ఇస్తుంది. ఎల్ ఆకారపు లైటింగ్ థీమ్ కూడా టెయిల్‌లైట్‌లలో అందించారు. డైమండ్ కట్ మిశ్రమాలు దాని ఆధునిక ఆకర్షణను మరింత పెంచుతాయి. అదనంగా వెనుక డోర్ హ్యాండిల్‌ను సి పిల్లర్‌లో చేర్చారు.


2025 కియా కే4 ఇంటీరియర్
క్యాబిన్ లోపల కే4 స్లేట్ గ్రీన్ థీమ్‌ను పొందుతుంది. అయితే సెడాన్ ఇంటీరియర్స్ కోసం కాన్యన్ బ్రౌన్, ఓనిక్స్ బ్లాక్, మీడియం గ్రే కలర్ ఆప్షన్‌లను కూడా అందించనున్నారని కియా తెలిపింది. డ్రైవర్ సైడ్ డోర్, ప్యాసింజర్ సైడ్ డోర్‌లో వేర్వేరు కలర్ కాంబినేషన్లు ఉన్నాయి.




కారు లోపల కింద భాగంలో రోటరీ కంట్రోలర్‌తో పాటు కొన్ని ఫిజికల్ బటన్‌లతో కూడిన డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లే సెంటర్ స్టేజ్ టేకింగ్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ పైన కియా లోగోను కలిగి ఉంది. ఇది కాకుండా ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లను లాంచ్ సమయంలో మాత్రమే రివీల్ చేయనున్నారు.


2025 కియా కే4 లాంచ్ ఎప్పుడు?
2025 కియా కే4ను మార్చి 27వ తేదీన న్యూయార్క్ ఆటో షోలో తొలిసారిగా ప్రదర్శించనున్నారు. ఈ ఏడాది చివర్లో అమెరికాలో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఇది ఎక్కడ హోండా సివిక్, టయోటా కరోలా, హ్యుందాయ్ ఎలంట్రాతో పోటీపడుతుంది. ఈ కారు భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం లేదు. దీనికి బదులుగా కియా కొత్త సబ్ 4 మీటర్ లైఫ్ స్టైల్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో క్లావిస్ అనే పేరుతో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో సోనెట్, సెల్టోస్ మధ్య ఉండనుంది.


కియా ఇటీవలే 2025 కార్నివాల్ హైబ్రిడ్ వెర్షన్‌ను పరిచయం చేసింది. ఈ కారులో కంపెనీ లేటెస్ట్ టెక్నాలజీని అందించనుంది. ఇందులో పవర్ ఫుల్ 1.6 లీటర్ టర్బో హైబ్రిడ్ ఇంజిన్‌ ఉంది.


Also Read: రూ.8 లక్షల్లోపు ధరలో టాప్-5 కార్లు ఇవే - బడ్జెట్‌లో కార్లు కావాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్ - ఈవీ కూడా!