Kawasaki Ninja 300 Review Telugu: భారత మార్కెట్‌లో Kawasaki Ninja 300కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. 2013లో తొలిసారి వచ్చిన ఈ స్పోర్ట్స్ బైక్, ఇప్పటికీ అమ్మకాలలో కొనసాగుతోంది అంటే దాని మీద ఉన్న క్రేజ్‌ను అర్థం చేసుకోవచ్చు. 2025 అప్‌డేట్‌తో Ninja 300కు కొత్త పెయింట్ స్కీమ్‌, తాజా గ్రాఫిక్స్‌, రివైజ్డ్ హెడ్‌ల్యాంప్ సెటప్ వచ్చాయి. పెద్ద మార్పులు లేకపోయినా, ఇది ఇంకా దేశంలో లభిస్తున్న అత్యంత అందుబాటులో ఉన్న ట్విన్ సిలిండర్ స్పోర్ట్స్ బైక్‌లలో ఒకటిగా నిలుస్తోంది.

Continues below advertisement

అయితే, ఈ బైక్ మీకు సరిపోతుందా? కొనాలా లేదా స్కిప్ చేయాలా? అనే ప్రశ్నలకు సమాధానంగా దాని ప్లస్‌లు, మైనస్‌లు తెలుసుకుందాం.

2025 Kawasaki Ninja 300 కొనడానికి 3 ముఖ్య కారణాలు

Continues below advertisement

1. హై రేవ్ అయ్యే శక్తిమంతమైన ట్విన్ సిలిండర్ ఇంజిన్‌Ninja 300లో ఉన్న 296cc, లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ 11,000rpm వద్ద 39hp పవర్‌, 10,000rpm వద్ద 26Nm టార్క్ ఇస్తుంది. 13,000rpm రెడ్‌లైన్‌ వరకు స్మూత్‌గా రేవ్ అవుతుంది. ఫుల్ థ్రాటిల్‌లో బైక్ నడిపే వారికి ఇది ఒక ప్రత్యేక అనుభూతి. థ్రాటిల్ కాలిబ్రేషన్ చక్కగా ఉండటంతో, సిటీ రైడింగ్‌లోనూ ఇబ్బంది ఉండదు. స్లిప్పర్ క్లచ్‌తో కూడిన 6 స్పీడ్ గేర్‌బాక్స్ చాలా స్మూత్‌గా పని చేస్తుంది.

2. బ్యాలెన్స్‌డ్ ఛాసిస్‌, నమ్మకమైన హ్యాండ్లింగ్Ninja 300 బలమైన అంశాల్లో ఇది ఒకటి. ఈ బైక్ హ్యాండ్లింగ్ చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. పూర్తి సూపర్‌స్పోర్ట్స్ బైక్‌లా అగ్రెసివ్ కాకపోయినా, కొత్తగా స్పోర్ట్స్ బైక్‌లకు అప్‌గ్రేడ్ అవుతున్న రైడర్లకు ఇది సరైన ఎంపిక. రైడింగ్ పొజిషన్ స్పోర్టీగా ఉన్నప్పటికీ, ఎక్కువ దూరాలు ప్రయాణించినా అలసట తక్కువగా ఉంటుంది. సీట్ కంఫర్ట్ కూడా బాగుంటుంది.

3. టైమ్‌లెస్ ఫుల్ ఫెయిర్డ్ డిజైన్పదేళ్లకు పైగా గడిచినా, Ninja 300 డిజైన్ ఇప్పటికీ ఆకర్షణీయంగానే ఉంది. ముఖ్యంగా లైమ్ గ్రీన్ కలర్లో ఈ బైక్ రోడ్డుపై ప్రత్యేకంగా కనిపిస్తుంది. కొత్తగా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ఇచ్చారు కానీ ఇది ఇంకా హాలోజన్‌నే. TFT స్క్రీన్, బ్లూటూత్ లాంటి ఫీచర్లు లేకపోయినా, అనలాగ్ టాకోమీటర్‌ నీడిల్‌ రేవ్ అవుతూ వెళ్లడం చాలా మందికి ఇప్పటికీ ఇష్టమైన విషయం.

2025 Kawasaki Ninja 300 ఎందుకు స్కిప్ చేయాలి?

1. కొత్త బైక్‌లతో పోలిస్తే నెమ్మదిగా అనిపించడంNinja 300 ఇంజిన్ అసలు శక్తిని చూపించేది 10,000rpm దాటిన తర్వాతే. దాని కంటే తక్కువ రేవ్స్‌లో యాక్సిలరేషన్ అంతగా ఆకట్టుకోదు. సిటీ ట్రాఫిక్‌లో లేదా ఓవర్‌టేక్ అవసరమైనప్పుడు, గేర్‌లతో ఎక్కువగా ఆడుకోవాల్సి వస్తుంది. ఇది కొందరికి అలసటగా అనిపించవచ్చు.

2. పాత తరహా ఫీచర్లు, హార్డ్‌వేర్ఈ ధరలో ఇప్పుడు మార్కెట్‌లో లభిస్తున్న బైక్‌లతో పోలిస్తే, Ninja 300లో ఫీచర్లు తక్కువ. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, రైడ్ మోడ్‌లు, అడ్వాన్స్‌డ్ డిస్‌ప్లే వంటి అంశాలు లేవు. సస్పెన్షన్, బ్రేకింగ్ సెటప్ కూడా కొత్త బైక్‌లతో పోలిస్తే అంతగా ఆకట్టుకోదు.

ముగింపు

ఒక క్లాసిక్ ట్విన్ సిలిండర్ స్పోర్ట్స్ బైక్ అనుభూతిని కోరుకునే వారికి ఇప్పటికీ 2025 Kawasaki Ninja 300 ఒక మంచి ఎంపిక. అయితే ఆధునిక ఫీచర్లు, లో-ఎండ్ పంచ్ కోరుకునే వారు ఇతర ప్రత్యామ్నాయాలను పరిశీలించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.