Andhra Pradesh politics 2025: ప్రతి సంవత్సరం ఆఖరిలో జరిగిపోయిన విషయాలను మననం చేసుకోవడం అందరూ చేసే పని . ఈ మననంలో ఇన్ని విషయాలు జరిగాయా అని ఆశ్చర్యపోయే పరిణామాలు ఉంటాయి. ఏపీలోనూ అలాంటివి చాలా జరిగాయి. కీలకమైన పది విషయాలను ఇయర్ ఎండర్‌గా గుర్తు చేసుకుంది.
'వాట్సాప్ గవర్నెన్స్' ప్రయోగం ప్రారంభం ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో మొదటి రాష్ట్రంగా 'వాట్సాప్ గవర్నెన్స్'ను జనవరిలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో, పౌరులు వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు, సేవలు పొందుతున్నారు. ఈ డిజిటల్ సంస్కరణ కూటమి ప్రభుత్వం టెక్నాలజీ-ఫోకస్డ్ విధానాన్ని చాటింది. మరో 5 రాష్ట్రాలు దీనిని అనుసరించాయి.
2025-26 బడ్జెట్ రికార్డుమార్చిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అభివృద్ధి, వ్యవసాయం, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇచ్చిన రూ. 2.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 'సూపర్ 6' పథకాలు, రైజ్‌లా వంటి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులకు రూ. 50,000 కోట్ల కేటాయింపు ఉంది.
మేలో కడపలో TDP మహానాడు కడపలో జరిగిన TDP మహానాడు-2025లో కీలక రాజకీయ పరిణామం. టీడీపీ ప్రస్తానంతోపాటు రాయలసీమ అభివృద్ధి పై చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి నాయుడు ఆధ్వర్యంలో 6 ముఖ్య తీర్మానాలు ఆమోదం చేశారు. ఈ మహానాయుడు TDP క్యాడర్‌ను ఉత్సాహపూరితం చేసింది. జగన్ సొంత గడ్డపై జరిగిన ఈ మహానాడు.. కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది.
జూన్ TDP కూటమి ప్రభుత్వం మొదటి సుపరిపాలన దినోత్సవం'సూపరిపాలన' అనే థీమ్‌తో జూన్ 12న మొదటి సంవత్సర పాలన విజయాలను జరుపుకున్నారు. విజయవాడలో భారీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ విజయాలను ప్రకటించారు. ప్రజాపాలనకు మళ్లీ పునరంకితం అయ్యేలా.. అప్పటికి గాడిన పెట్టేసిన పనులను మరింత చురుకుగా సాగేలా నిర్ణయాలు తీసుకున్నారు.
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో సెప్టెంబర్ 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. . బిల్లుల చర్చలు, వ్యవసాయ రైతు సంక్షేమ బిల్లు పాసయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. కానీ ఎమ్మెల్సీలు మాత్రం సభకు హాజరయ్యారు. మండలిల చర్చలు వాడివేడిగా జరిగాయి.
అక్టోబర్ లో ప్రధాని మోదీ AP సందర్శన ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 16న APకు విచ్చేసి, తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక సభలో ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు ప్రారంభించారు. NDA కూటమి బలాన్ని ప్రదర్శించిన ఈ సందర్శనలో రూ. 10,000 కోట్ల పెట్టుబడులు ప్రకటించారు.
నవంబర్: CII పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ విశాఖపట్నంలో CII సమ్మిట్‌లో రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 'దావోస్ మోడల్'గా పెట్టుబడుల సదస్సును నిర్వహించారు. A ఈ సమ్మిట్ APను ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా మార్చే మైలురాయిగా నిలిచింది.
తిరుమల కేంద్రంగా వివాదాలుఏపీ రాజకీయాల్లో 2025 మొత్తం తిరుమల కేంద్రంగా వివాదాలు నడిచాయి. లడ్డూ కల్తీ నెయ్యి, పరకామణి చోరీ, పట్టు వస్త్రాల స్కాం వంటివి వివాదం అయ్యాయి. వాటిపై ఇంకా విచారణలు జరుగుతున్నాయి. 2025లో AP రాజకీయాలు అభివృద్ధి, సంస్కరణలు, వివాదాల మధ్య సమతుల్యంగా సాగాయి.వైసీపీ ఎక్కువగా గ్రౌండ్ లెవల్ కు రాకపోవడంతో.. ప్రభుత్వానికి పెద్దగా ఇబ్బంది లేకుండానే ఏడాది అంతా గడిచిపోయింది.