2025 Hyundai Venue Launch Date Price: హ్యుందాయ్‌ కంపెనీ ఈ ఏడాది నవంబర్‌ 4న తన కొత్త 2025 Hyundai Venue ని భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఇది పూర్తిగా కొత్త తరం సబ్‌-4 మీటర్‌ SUV. ఈసారి డిజైన్‌తో పాటు టెక్నాలజీ, ఫీచర్ల పరంగా కూడా భారీ అప్‌డేట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా Creta, Alcazar వంటి పెద్ద SUVలలో ఉన్న టాప్‌ ఫీచర్లలో చాలా ఇప్పుడు కొత్త వెన్యూలో కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

Continues below advertisement

1. లెవల్‌-2 ADAS (Confirmed!)కొత్త వెన్యూ లెవల్‌-2 ADASతో వస్తుందని హ్యుందాయ్‌ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత మోడల్‌లో లెవల్‌-1 మాత్రమే ఉండగా, కొత్త టెక్‌తో ఇది మరింత సేఫ్‌గా, స్మార్ట్‌గా మారనుంది. తద్వారా ఆటోమేటిక్‌ బ్రేకింగ్‌, లేన్‌ కీప్‌ అసిస్ట్‌, ఫార్వర్డ్‌ కొలిజన్‌ వార్నింగ్‌ వంటి ఫీచర్లు అందుతాయి.

2. పెద్ద 12.3 ఇంచ్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్‌ (Confirmed!)Creta, Alcazar రెండింట్లో 10.25 ఇంచ్‌ స్క్రీన్లు ఉన్నా, కొత్త వెన్యూ 12.3 ఇంచ్‌ టచ్‌స్క్రీన్‌తో రానుంది. ఇది ఈ సెగ్మెంట్‌లోనే అతిపెద్ద డిస్‌ప్లే అవుతుంది. యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ కూడా కొత్తగా డిజైన్‌ చేశారు.

Continues below advertisement

3. పానోరమిక్‌ సన్‌రూఫ్‌ప్రస్తుత వెన్యూ సింగిల్‌ ప్యానెల్‌ సన్‌రూఫ్‌తో మాత్రమే వచ్చింది. 2025 వెర్షన్‌లో పానోరమిక్‌ సన్‌రూఫ్‌ రానుంది - ఇది ఈ సైజ్‌ SUVల్లో అరుదుగా లభించే ఫీచర్‌. Tata Nexon, Kia Syros, XUV 3XO లాంటి కాంపిటీటర్లతో పోటీగా ఇది హ్యుందాయ్‌ వెన్యూని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.

4. డ్యూయల్‌-జోన్‌ క్లైమేట్‌ కంట్రోల్‌కొత్త వెన్యూ ఇప్పుడు డ్యూయల్‌-జోన్‌ ఆటోమేటిక్‌ ACతో వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అంటే డ్రైవర్‌, కో-డ్రైవర్‌ ఇద్దరూ తమకు కావలసిన ఉష్ణోగ్రతను వేర్వేరుగా సెట్‌ చేసుకోవచ్చు. ఇది కంఫర్ట్‌ లెవల్‌ను మరింత పెంచుతుంది.

5. వెంటిలేటెడ్‌ సీట్లుCreta, Alcazar మాదిరిగా కొత్త వెన్యూ కూడా ఫ్రంట్‌, రియర్‌ వెంటిలేటెడ్‌ సీట్లతో రావొచ్చు. వేడిగా ఉన్న వాతావరణంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.

6. కో-డ్రైవర్‌ పవర్‌ సీటుఇప్పటి వెన్యూలో డ్రైవర్‌ సీటు మాత్రమే పవర్‌ అడ్జస్టబుల్‌గా ఉంటుంది. కానీ కొత్త వెర్షన్‌లో కో-డ్రైవర్‌ పవర్‌ సీటు కూడా ఇలాగే వచ్చే అవకాశం ఉంది. ఇది ఇప్పటివరకు కేవలం ప్రీమియం SUVల్లో మాత్రమే ఉంది.

7. 8 స్పీకర్‌ బోస్‌ ఆడియో సిస్టమ్‌మ్యూజిక్‌ లవర్స్‌ కోసం పెద్ద అప్‌డేట్‌ ఇదే!. కొత్త వెన్యూ ఇప్పుడు బోస్‌ 8-స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌తో రానుంది. ఇది సౌండ్‌ క్వాలిటీని మరో లెవల్‌కి తీసుకెళ్తుంది.

8. 360-డిగ్రీ కెమెరాపార్కింగ్‌ లేదా సిటీ డ్రైవింగ్‌లో సేఫ్టీ కోసం కొత్త వెన్యూ 360-డిగ్రీ కెమెరా సపోర్ట్‌ పొందబోతోంది. టైట్‌ స్పేస్‌లలో కూడా సులభంగా మలుపులు తీసుకోవచ్చు.

9. ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌ఈ ఫీచర్‌ ఇప్పటికే XUV 3XO, Kia Syros లాంటివి అందిస్తున్నాయి. ఇప్పుడు వెన్యూ కూడా ఎలక్ట్రానిక్‌ పార్కింగ్‌ బ్రేక్‌తో రానుంది.

10. ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లుకొరియా టెస్టింగ్‌ ఫోటోల్లో ఇప్పటికే ఈ ఫీచర్‌ కనిపించింది. అంటే కొత్త వెన్యూ ఫ్రంట్‌ పార్కింగ్‌ సెన్సర్లు కూడా కలిగి ఉంటుంది.

2025 Hyundai Venue డిజైన్‌ మాత్రమే కాదు, ఫీచర్ల పరంగా కూడా పెద్ద SUVలతో సమానంగా మారబోతోంది. ఈ అప్‌డేట్స్‌ వల్ల వెన్యూ ఇప్పుడు మరింత లగ్జరీ, టెక్‌-ఫ్రెండ్లీ, యూత్‌ఫుల్‌ SUVగా మారుతుంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - ABP దేశం ఆటో సెక్షన్‌ని ఫాలో అవ్వండి.