2024 Hero Xtreme 160R 4V: హీరో మోటోకార్ప్ స్పోర్టీ లుక్ బైక్ ఎక్స్‌ట్రీమ్‌ను 2023లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ బైక్‌కు దేశంలో కూడా చాలా మంచి స్పందన లభించింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ కొత్త అవతార్‌ను త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది. దీని లుక్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. లాంచ్ అయ్యాక ఈ బైక్... టీవీఎస్ అపాచీకి గట్టి పోటీని ఇవ్వడం చూడవచ్చు.


మార్పులు ఎలా ఉంటాయి?
ఈ కొత్త బైక్ టీజర్‌ను హీరో తన సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. బ్లాక్, బ్రాంజ్ కలర్ కాంబినేషన్‌లో ఈ బైక్‌ను మొదటిసారిగా విడుదల చేయనున్నట్లు టీజర్ చూపిస్తుంది. దీంతో పాటు కొత్త గ్రాఫిక్స్ కూడా ఇందులో కనిపించనున్నాయి. కంపెనీ 2023 మోడల్ బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్‌ని అందించింది. కానీ ఈ బైక్ 2024 మోడల్‌లో కంపెనీ డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్‌ను అందించగలదని నమ్ముతారు.


హీరో మోటోకార్ప్ కొత్త ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీలో అనేక కొత్త ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయని భావిస్తున్నారు. ఈసారి బైక్‌కు సింగిల్ పీస్ శాడిల్ ఇవ్వనున్నట్లు టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. అలాగే ఈ కొత్త బైక్‌కు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. ఇందులో డ్రాగ్ రేస్ టైమర్ కూడా అందించనున్నారు. సేఫ్టీ ఫీచర్‌గా ఈ బైక్‌లో పానిక్ బ్రేక్ అలర్ట్ సదుపాయం కూడా ఉండనుంది. ఈ ఫీచర్‌ను ఆన్ చేసిన తర్వాత బైక్‌లోని బ్రేక్ ల్యాంప్, టర్న్ ఇండికేటర్ త్వరగా ఫ్లాషింగ్ అవుతాయి. తద్వారా ఇతర బైకర్స్ పరిస్థితిని తెలుసుకోవచ్చు.


Also Read: Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?


ఇంజిన్‌లో ఎలాంటి మార్పు లేదు...
సమాచారం ప్రకారం కొత్త హీరో ఎక్స్‌ట్రీమ్ 160ఆర్ 4వీ ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఇది మునుపటి మోడల్‌లో ఉన్న ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్ 163.2 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 14.6 ఎన్ఎం పీక్ టార్క్‌తో 16.6 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేయగలదు.


అలాగే ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయి ఉంటుంది. ఈ కొత్త బైక్ 17 అంగుళాల అల్లాయ్ వీల్స్ డిస్క్ బ్రేక్‌లతో మార్కెట్లో విడుదల కానుంది. అయితే దీని ధరలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. దీని ధర 2023 మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండనుంది. 






Also Read: టాటా నెక్సాన్ ఈవీ.. సేఫ్టీలో సూప‌ర్ - భార‌త్ NCAP ఎంత రేటింగ్ ఇచ్చిందంటే?