మనదేశంలో త్వరలో లాంచ్ కానున్న ఎస్‌యూవీల్లో మోస్ట్ అవైటెడ్ ఎస్‌యూవీ కొత్త స్కార్పియో ఎన్. అంతేకాకుండా ఈ కారు సైజు కూడా చాలా పెద్దది. ప్రస్తుతం ఉన్న స్కార్పియో కంటే దీని పొడవు, వెడల్పు ఎక్కువగా ఉండనుంది. దీని వీల్‌బేస్ 2750 మిల్లీమీటర్లుగా ఉంది.


కొత్త స్కార్పియో ఎన్ పొడవు 4662 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ విభాగంలో అన్నిటికంటే పొడవైన కారు ఇదే. దీని వెడల్పు 1917 మిల్లీమీటర్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న స్కార్పియోతో పోలిస్తే ఇది 100 మిల్లీమీటర్లు ఎక్కువ. ఈ స్కార్పియో ఎన్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్లు ఉండనున్నాయి.


సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్, సిక్స్ స్పీడ్ మాన్యువల్ వేరియంట్లలో ఈ కారు లాంచ్ కానుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే... డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు, క్రూజ్ కంట్రోల్‌లు ఉన్నాయి. కొత్త ఎక్స్‌యూవీ 700 తరహాలో అడ్రెనోఎక్స్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, పెద్ద టచ్ స్క్రీన్‌లు ఈ కారులో ఉన్నాయి.


ప్రస్తుతం ఉన్న స్కార్పియోలా కాకుండా కొత్త స్కార్పియో ఎన్‌లో మూడో వరుసలో కూడా ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్లనే అందించారు. కొత్త స్కార్పియో ఎన్ మనదేశంలో 27వ తేదీన లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన డెలివరీలు వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్నాయి. దీని ధరను కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ కారుపై చాలా అంచనాలు కూడా ఉన్నాయి.


ఈ కొత్త స్కార్పియోలో ప్రీమియం క్యాబిన్‌ను కంపెనీ అందించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కార్పియో క్యాబిన్ కంటే ఇది మరింత రిచ్‌గా ఉండనుంది. దీన్ని ఎక్స్‌యూవీ700 ఆధారంగా రూపొందించారు. కొత్త తరహా స్టీరింగ్ వీల్, దాని మీద కొత్త మహీంద్రా లోగోను కూడా చూడవచ్చు.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?