2022 మారుతి సుజుకి వాగన్ఆర్ టూర్ హెచ్3 మనదేశంలో లాంచ్ అయింది. ఈ కొత్త మోడల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి పెట్రోల్ వేరియంట్ కాగా... మరోటి సీఎన్‌జీ వేరియంట్. మారుతి వాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వేరియంట్ ధరను రూ.5.39 లక్షలుగా నిర్ణయించారు. ఇక సీఎన్‌జీ వెర్షన్ ధర రూ.6.34 లక్షలుగా ఉంది. ఇవి రెండూ ఢిల్లీ ఎక్స్-షోరూం ధరలే.


ఈ కారు రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్ రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. మారుతి సుజుకి ఈ కారును స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ఇందులో బాడీ కలర్డ్ బంపర్లు, బ్లాక్డ్ ఔట్ ఓఆర్వీఎమ్‌లు, వీల్ సెంటర్ క్యాప్ వంటివి ఉన్నాయి.


కారు లోపల కంపెనీ పూర్తిగా కొత్త ఇంటీరియర్‌ను అందించింది. డ్యూయల్ కోర్ ఇంటీరియర్లు, ఫ్రంట్ క్యాబిన్ ల్యాంప్స్, డ్రైవర్ వైపు సన్ విజర్, టికెట్ హోల్డర్, రెండు వరుసల్లోనూ హెడ్‌రెస్ట్‌లు ఉన్నాయి. దీంతోపాటు ముందువైపు పవర్ విండోస్, సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, మాన్యువల్ ఏసీ, రిక్లైనింగ్, ఫ్రంట్ స్లైడింగ్ సీట్లు, వెనకవైపు పార్సిల్ ట్రే కూడా అందించారు.


ఇక సేఫ్టీ విషయానికి వస్తే... 2022 మారుతి సుజుకి టూర్ హెచ్3లో సెంట్రల్ డోర్ లాకింగ్, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, స్పీడ్ లిమిటింగ్ ఫంక్షన్, వెనకవైపు పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. ఈ కారులో 1.0 లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్ అందించారు. ఇది 5,500 ఆర్‌పీఎం వద్ద 64 బీహెచ్‌పీని, 3,500 ఆర్‌పీఎం వద్ద 89 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది.


దీని సీఎన్‌జీ వెర్షన్‌లో కూడా ఇదే ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 5,300 ఆర్‌పీఎం వద్ద 56 బీహెచ్‌పీని, 3,400 ఆర్‌పీఎం వద్ద 82 ఎన్ఎం పీక్ టార్క్‌ను అందించనుంది. ఇందులో ఫైవ్-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉండనుంది. ఈ మారుతి సుజుకి వాగన్ఆర్ టూర్ హెచ్3 పెట్రోల్ వేరియంట్ 25.4 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది. ఇక సీఎన్‌జీ మోడల్ కేజీకి 34.73 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించనుంది.


Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!


Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!


Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?