హ్యుందాయ్ కంపెనీ మరో లేటెస్ట్ కారును అందుబాటులోకి తీసుకురాబోతుంది. Venue N Line పేరుతో ఈ కారును మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. తాజాగా ఈ కారు స్పెసిఫికేషన్లను రివీల్ చేసింది. వెన్యూ N లైన్ శ్రేణిలో తొలి SUVగా కంపెనీ వెల్లడించింది. ఈ లేటెస్ట్ కారు i20 N లైన్ మాదిరిగానే స్పోర్టియర్ వెర్షన్ గా తెలిపింది. ఈ కారుకు అదనపు హంగులు అద్దినట్లు చెప్పింది. కారుకు సంబంధించి బయట, లోపల పలు మార్పులు చేసినట్లు వెల్లడించింది.
తాజా కారులో కంపెనీ ఏ మార్పులు చేసిందో ఓసారి పరిశీలిద్దాం. N లైన్ ఆల్ రౌండ్ డిస్క్ బ్రేక్ లు, డ్యుయల్ కెమెరాతో కూడిన డాష్ క్యామ్, కొత్త డార్క్ క్రోమ్ గ్రిల్, టెయిల్ గేట్ స్పాయిలర్, N లైన్ లోగోలు, రెడ్ ఎక్స్ టీరియర్, ఫ్రంట్ రెడ్ బ్రేక్ కాలిపర్ లు, బ్లాక్ ఇంటీరియర్, N లైన్ ఎక్స్ క్లూసివ్ 16-అంగుళాల డైమండ్ కట్స్ సహా పలు మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఆసక్తికరంగా Venue N Line కేవలం 88.3 kW (120 PS) గరిష్ట శక్తి, 172 Nm టార్క్‌తో 1.0l టర్బో పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. DCT డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ను కలిగి ఉంటుంది. i20 N లైన్ మాదిరిగా, ఇంజిన్ స్పోర్టియర్ ఎగ్జాస్ట్ నోట్ కలిగి ఉంటుంది. DCT స్టాండర్డ్ వెన్యూలో కూడా అందుబాటులో ఉండే Venue N Line డ్రైవ్ మోడ్‌లను అందిస్తుంది.
Venue N Line వచ్చే నెల 6న ప్రస్తుత వెన్యూ కంటే కొంచెం ప్రీమియంతో లాంచ్ చేయబడుతుంది. ప్రస్తుతం SUVల యొక్క నిర్దిష్ట పనితీరు-ఆధారిత వెర్షన్లు ఏవీ లేని కారణంగా.. ఈ కారుకు పోటీగా మరే కారు అందుబాటులోకి రావడం లేదు. ఇప్పటికే N లైన్ శ్రేణిలో i20 N లైన్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. అదే విభాగంలో ఇండియాలో రిలీజ్ కాబోతున్న హ్యాచ్ బ్యాక్ అయినందున కార్ల ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది. ఈ కారుతో భారత మార్కెట్లో మరోసారి సత్తా చాటుకునేందుకు హ్యుందాయ్ ప్రయత్నిస్తోంది.
అటు సెప్టెంబర్ 6న Venue N Line ధరలను విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. రోబ్లాక్స్ లో అందుబాటులో ఉన్న హ్యుందాయ్ మొబిలిటీ అడ్వెంచర్ అనుభవంతో మెటావర్స్ లో కొత్త N లైన్ మోడల్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. మొబైల్ ఫోన్ లు, ల్యాప్ టాప్ లలో ప్లే స్టోర్ ద్వారా రోబ్లాక్స్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా కస్టమర్లు కొత్త Venue N Line లాంచ్ ను చూడగలుగుతారని వెల్లడించింది.
Also Read: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఉండాలంటే ఈ 10 టిప్స్ ఫాలో అవ్వండి!
వర్చువల్ లాంచ్ అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపింది. Metaverse లాంచ్ ఈవెంట్ ఇండియా జోన్, టెస్ట్ డ్రైవ్ ట్రాక్, VENUE N లైన్ జోన్, వర్చువల్ షోరూమ్, సర్వీస్ సెంటర్, మినీ గేమ్, N లైన్ మర్చండైజ్ సహా అనేక వినూత్న అనుభవాలను కలిగి ఉంటుంది. వినియోగదారులు ఓవల్ రోడ్ ట్రాక్ చుట్టూ Venue N Line టెస్ట్ డ్రైవ్‌ను వర్చువల్ గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకు మీరు కాస్త టెక్నాలజీ మీద అవగాహన ఉంటే చాలు. మీరు ఇంటి నుంచే ఆ అనుభూతిని పొందవచ్చు. ఈ కారుకు సంబంధించిన మరిన్ని వివరాలు మరో వారంలోనే కస్టమర్లకు కంపెనీ వెల్లడించనుంది.
Also Read: మీ ఆండ్రాయిడ్ ఫోన్ మళ్లీ కొత్తదానిలా పని చేయాలా? ఈ 5 టిప్స్ పాటించండి