Top Cheapest Cars With Sunroof Under Rs 10 Lakhs: ఇప్పుడు కారు కొంటే సన్‌రూఫ్‌ ఉండాలి అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. ఇంతకు ముందు ఈ ఫీచర్‌ కేవలం లగ్జరీ కార్లలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ₹10 లక్షల లోపలే సన్‌రూఫ్‌ ఆప్షన్‌ ఇచ్చే చవకైన కార్లు మార్కెట్‌లో దూసుకుపోతున్నాయి. Tata, Hyundai, Kia, Mahindra లాంటి కంపెనీలు ఈ ఫీచర్‌ను యువతను, ఫ్యామిలీని ఆకట్టుకునేలా అందిస్తున్నాయి. 

Continues below advertisement

1. Hyundai Exter - ₹7.02 లక్షల నుంచే

హ్యుందాయ్‌ చిన్న SUV ఎక్స్‌టర్‌లో S Smart ట్రిమ్‌ నుంచే సన్‌రూఫ్‌ ఆప్షన్‌ వస్తుంది. ₹8.98 లక్షల SX(O) కనెక్ట్‌ నైట్‌ ఎడిషన్‌ వరకు వాయిస్‌ కమాండ్‌ సపోర్ట్‌ ఉంటుంది. పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు CNG వెర్షన్‌ కూడా అందుబాటులో ఉంది.

Continues below advertisement

2. Tata Punch - ₹7.06 లక్షల నుంచే

భారత్‌లో సన్‌రూఫ్‌ ఇచ్చే అత్యంత చవక కార్లలో ఇదొకటి. Adventure S ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ లభిస్తుంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌, 73.5HP CNG ఆప్షన్లు ఉన్నాయి. ₹7.93 లక్షల్లో CNG సన్‌రూఫ్‌ కారు కావాలంటే పంచ్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

3. Hyundai i20 - ₹8.27 లక్షల నుంచే

i20లో మాగ్నా ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ లభిస్తుంది. టాప్‌-స్పెక్‌ Asta (O) ట్రిమ్‌లో వాయిస్‌ కమాండ్‌ కూడా ఉంటుంది. 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌, మాన్యువల్‌ లేదా CVT గేర్‌బాక్స్‌ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

4. Tata Altroz - ₹7.36 లక్షల నుంచే

Pure S ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ అందిస్తుంది. పెట్రోల్‌, CNG రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. కొత్త డిజైన్‌, కంఫర్ట్‌తో ఆల్ట్రోజ్‌ ఇప్పుడు యువతలో ట్రెండ్‌ అవుతోంది.

5. Kia Sonet - ₹7.70 లక్షల నుంచే

HTE(O) ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ వస్తుంది. 116HP డీజిల్‌ ఇంజిన్‌తో ఇది భారత్‌లో సన్‌రూఫ్‌ కలిగిన చవక డీజిల్‌ SUV. అదే ఇంజిన్‌ వేరియంట్‌ వెన్యూ కంటే కాస్త ప్రీమియంగా ఉంటుంది.

6. Tata Nexon - ₹8.29 లక్షల నుంచే

Smart+ S ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ వస్తుంది. పెట్రోల్‌, డీజిల్‌, CNG - మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. GST తగ్గడంతో ఇప్పుడు ₹10 లక్షల్లోనే సన్‌రూఫ్‌ నెక్సాన్‌ లభిస్తోంది.

7. Mahindra XUV 3XO - ₹8.60 లక్షల నుంచే

RevX M(O) ట్రిమ్‌ నుంచి సన్‌రూఫ్‌ వస్తుంది. 111HP టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తున్న ఈ SUV, హయ్యర్‌ వెర్షన్‌లో పనోరమిక్‌ సన్‌రూఫ్‌ కూడా కలిగి ఉంది.

8. Maruti Suzuki Dzire - ₹8.86 లక్షల నుంచే

ఈ లిస్టులో ఉన్న ఏకైక సెడాన్‌ ఇది. ZXI+ ట్రిమ్‌లోనే సన్‌రూఫ్‌ ఆప్షన్‌ ఉంది. 82HP పెట్రోల్‌ ఇంజిన్‌తో 5-స్పీడ్‌ మాన్యువల్‌ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

9. Hyundai i20 N Line - ₹9.14 లక్షల నుంచే

N6 ట్రిమ్‌లో సన్‌రూఫ్‌ వస్తుంది. 120HP టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, మాన్యువల్‌ లేదా DCT ఆప్షన్‌. స్టైలిష్‌గా, స్పోర్టీగా కనిపించే ఈ కారు యువతకు ఫేవరెట్‌.

10. Hyundai Venue - ₹9.15 లక్షల నుంచే

HX5 ట్రిమ్‌లో సన్‌రూఫ్‌ లభిస్తుంది. 1.2 పెట్రోల్‌, 1.0 టర్బో పెట్రోల్‌, 1.5 డీజిల్‌ ఇంజిన్‌లు అందుబాటులో ఉన్నాయి. వేరియంట్‌ ఆధారంగా 7-స్పీడ్‌ DCT వరకు ఆప్షన్లు ఉన్నాయి.

(ధరలన్నీ ఎక్స్‌-షోరూమ్‌)

ఇప్పుడు సన్‌రూఫ్‌ కారు కోసం పెద్ద బడ్జెట్‌ అవసరం లేదని ఈ లిస్ట్‌ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ₹7 లక్షల నుంచే ఈ స్టైలిష్‌ ఫీచర్‌ను అందిస్తున్న టాటా, హ్యుందాయ్‌ లాంటి బ్రాండ్లు యువత మనసు దోచేస్తున్నాయి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.