Monthly Horoscopes June 2025

వృషభ రాశి (Taurus Monthly  Horoscope)

ఈ నెలంతా మీకు చికాకుగానే ఉంటుంది. గాయాలపాలవుతారు, వాహనప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త. కుటుంబంలో అనుకోని సమస్యలు తలెత్తుతాయి. ఆదాయం బాగానే ఉన్నా ఖర్చులు పెరుగుతాయి. నెల మధ్యలో పరిస్థితులు కొంత సర్దుమణుగుతాయి. వృత్తి వ్యాపారాలు కలిసొస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిథున రాశి (Gemini Monthly Horoscope)  మిథున రాశివారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. అంతా బావున్నట్టే అనిపిస్తుంది కానీ సంతోషం ఉండదు. అప్పులు చేయాల్సి వస్తుంది. నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. సంతానం కారణంగా చికాకుగా ఉంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. మానసిక ఆందోళన ఉంటుంది. ఊహించని సంఘటనలు జరుగుతాయి. కర్కాటక రాశి (Cancer Monthly  Horoscope)  

ఈ నెల ఆరంభంలో ఈ రాశివారికి అనుకూల ఫలితాలుంటాయి కానీ ఆఖరి రెండు వారాలు చికాకులు తప్పవు. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. అనుకోని వివాదాల్లో చిక్కుకుంటారు. సంతానం కారణంగా చికాకులు ఉంటాయి. చెడు వార్తలు వినాల్సి వస్తుంది.  

వృశ్చిక రాశి (Scorpio Monthly  Horoscope)  జూన్ నెల వృశ్చిక రాశివారికి పెద్దగా అనుకూలించదు. గ్రహాల ప్రతికూల ప్రభావం వల్ల భూ సంబంధిత వ్యవహారాల్లో నష్టాలుంటాయి. ప్రయాణ సమయంలో సమస్యలుంటాయి. ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అవమానించేవారుంటారు. అధిక కోపం ప్రభావం మీరు చేపట్టే పనులపై పడుతుంది.  

ధనుస్సు రాశి  (Sagittarius Monthly Horoscope) 

ధనస్సు రాశి వారికి జూన్ నెల ఆరంభం అద్భుతంగా ఉంటుంది కానీ సెకెండాఫ్ చికాకులుంటాయి. చిన్న చిన్న విషయాలకే అధైర్య పడతారు. వృత్తి వ్యాపారాలు పెద్దగా కలసిరావు. ఏ పని ప్రారంభించినా ఆశించిన స్థాయిలో పూర్తికావు. వాహన ప్రమాద సూచనలున్నాయి జాగ్రత్త.  

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

గ్రహసంచారం సమస్యల నుంచి కొంత ఉపశమనం కోసం నిత్యం నవగ్రహ స్తోత్రం పఠించండి

శ్లోకంఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచగురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ||

సూర్యుడుజపాకుసుమ సంకాశం | కాశ్యపేయం మహాద్యుతిమ్తమో రిం సర్వపాపఘ్నం | ప్రణతోస్మి దివాకరం ||

చంద్రుడు దధి శంఖ తుషారాభం | క్షీరోదార్ణవ సంభవమ్నమామి శశినం సోమం | శంభోర్మకుట భూషణం ||

కుుజుడుధరణీగర్భ సంభూతం | విద్యుత్కాంతి సమప్రభమ్కుమారం శక్తిహస్తం | తం మంగళం ప్రణమామ్యహం ||

బుధుడు ప్రియంగు కలికాశ్యామం | రూపేణా ప్రతిమం బుధంసౌమ్యం సత్వగుణోపేతం | తం బుధం ప్రణమామ్యహం ||

గురుదేవానాంచ ఋషీణాంచ | గురుం కాంచన సన్నిభంబుద్ధిమంతం త్రిలోకేశం | తం నమామి బృహస్పతిం ||

శుక్రుడుహిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

శనినీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజంఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||

రాహు అర్ధకాయం మహావీరం | చంద్రాదిత్య విమర్దనంసింహికాగర్భ సంభూతం | తం రాహుం ప్రణమామ్యహం ||

కేతు ఫలాశ పుష్ప సంకాశం | తారకాగ్రహ మస్తకంరౌద్రం రౌద్రాత్మకం ఘోరం | తం కేతుం ప్రణమామ్యహం ||