Chapati Recipe : నార్త్ ఇండియన్సే కాదు.. సౌత్​లో కూడా చపాతీలను చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు అయితే డైట్​లో భాగంగా, రైస్​ని మానేయాలని తింటారు. మరికొందరు వీటితోనే బరువు తగ్గిపోవాలని చూస్తారు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ చపాతీలు ఓ సింపుల్​ టిప్​తో పొరలు వచ్చే విధంగా తయారు చేయవచ్చని తెలుసా? అలాగే ఎంతసేపు ఆగినా.. మెత్తగానే ఉండేలా వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

చపాతీ గుండ్రంగా రాలేదని.. లేదా మాడిపోయిందనే కంప్లైంట్సే కాదు.. చపాతీ గట్టిగా ఉందని, పొరలుగా రావట్లేదనే కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తాయి. అయితే చపాతీ పిండి కలిపేప్పుడు, చపాతీలను వత్తే సమయంలో చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఈ కంప్లైంట్స్ దూరమైపోతాయి. అవేంటో.. చపాతీ పిండి కలిపేప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

అస్సలు చేయకూడని పనులు

ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి వేయాలి. దానిలో ఉప్పు వేసి కలిపి.. పిండిని కలిపేందుకు సరిపడా నీటిని పోయాలి. అయితే చాలామంది పిండిని కలిపేప్పుడు పాలు వేస్తారు. అలా వేస్తే చపాతీలు ఎక్కువ కాలం నిల్వ ఉండవట. అంతేకాకుండా పిండిని చేతికి అంటకుండా ఉండేలా మాత్రమే నీటిని పోసి కలుపుతారు. ఈ రెండూ అస్సలు చేయకుండా.. పిండిని కాస్త చేతికి అంటే మాదిరిగానే కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. 

పొరల చపాతీ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్

చపాతీ పిండిని తీసుకుని.. చిన్న చిన్న ముద్దలుగా.. చపాతీకి సరిపడా స్టైల్​లో తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రపై పిండిని చల్లి.. చపాతీలను వత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా చపాతీగా చేసుకున్న తర్వాత దానిపై నూనెను చల్లి చపాతీ మొత్తం అంటుకునేలా రాయాలి. ఇలా రాసిన చపాతీని రోల్ చేయడం లేదా రెండుసార్లు మడవడం చేసి.. మళ్లీ పిండిని చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో చపాతీలు చేసుకోవాలి. 

ఎక్కువసేపు నిల్వ ఉంటాయి..

స్టౌవ్ వెలిగించి దానిపై అట్ల పెనం పెట్టి.. తయారు చేసుకున్న చపాతీలను వేసుకోవాలి. ఇప్పుడు చపాతీకి మరోవైపు ఆయిల్​ పూసి.. ఫ్లిప్ చేయాలి. ఇలా రెండూ వైపులా మంచిగా కాల్చుకుంటే టేస్టీ, మెత్తని చపాతీలు రెడీ. ఇవి పొరలుగా రావడం వల్ల అందరూ వీటిని మంచిగా తింటారు. లంచ్​కోసం బాక్స్​లో దీనిని తీసుకెళ్లినా.. ఎక్కువసేపు తర్వాత తిన్నా కూడా ఈ చపాతీలు మెత్తగానే, రుచిగానే ఉంటాయి. మరి ఇంకెందుకు మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోయి టేస్టీ, మెత్తని చపాతీలు తయారు చేసేయండి.