Your June 2025 Monthly Horoscope

మేష రాశి (Aries Monthly Horoscope) 

జూన్ నెలలో ఆర్థికంగా లాభపడతారు. నెలంతా సంతోషంగా ఉంటారు. ఈ నెలలో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధులను, స్నేహితులను కలుస్తారు. ఉన్నతాధికారుల వల్ల లాభపడతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం బావుంటుంది. నూతన గృహనిర్మాణాలు కలిసొస్తాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.

సింహ రాశి (Leo Monthly  Horoscope)

జూన్ నెలంతా సింహ రాశివారికి మంచి ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో మంచి ఫలితాలు వస్తాయి. మీరు చేపట్టిన పనులకు కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది. శత్రువులే స్నేహితులవుతారు. నూతన కార్యాలు చేపట్టి పూర్తిచేస్తాు.  

కన్యా రాశి  (Virgo Monthly  Horoscope)  కన్యా రాశివారికి జూన్ నెలలో గ్రహాల అనుకూల సంచారం వల్ల వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంట్లో వాతావరణం సంతోషంగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనం కొనుగోలు చేస్తారు. 

తులా రాశి (Libra Monthly  Horoscope) 

తులా రాశివారికి జూన్ నెల నుంచి మంచి రోజులు మొదలవుతాయి. ఇప్పటివరకూ వెంటాడిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగలో వృద్ధి, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ఆరోగ్యం బావుంటుంది. స్నేహితుల సహకారంలో పనులన్నీ పూర్తవుతాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు.

మకర రాశి (Capricorn Monthly  Horoscope)

మకర రాశివారికి జూన్ నెల అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో మంచి ఫలితాలున్నాయి. ఆర్థికలావాదేవీలు కలిసొస్తాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయం వరిస్తుంది.

కుంభ రాశి  (Aquarius Monthly Horoscope) 

కుంభ రాశివారికి జూన్ నెలలో అనుకూల ఫలితాలుంటాయి. ఏ పని ఆరంభించినా విజయం మీ సొంతం. నూతన కార్యక్రమాలు మొదలు పెడతారు. బంధువుల నుంచి సహాయ సహకారాలుంటాయి. వాహనం మార్చేందుకు ప్లాన్ చేసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు.  

మీన రాశి (Pisces Monthly Horoscope) 

జూన్ నెల మీన రాశివారికి తిరుగులేదు. ఈ రాశికి చెందినవారు ఏ రంగంలో ఉన్నా మీదే పైచేయి. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టొచ్చు. ఉద్యోగులు గౌరవం, ఆదాయం పొందుతారు. రానిబాకీలు వసూలవుతాయి. మీ పనుల కన్నా ఇతరుల వ్యవహారాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. 

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.

విభూది రేఖలు, ధోతీ, మెడలో రుద్రాక్ష మాల,చెప్పుల్లేని పాదాలు.. పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎవరీ ఆచార్య విశ్వనాథ్.. ఈ వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

తిరుమలలో ఉన్నది రాతి విగ్రహం కాదు.. సజీవంగా నిల్చున్న శ్రీ వేంకటేశ్వరుడు -  తిరుమలలో జరిగే సేవలేంటి? ఏ సేవలో ఏం చేస్తారు? ఏ సేవకు వెళితే మంచిది? ఈ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి