Your August 2024 Horoscope - 2024 ఆగష్టు మాస రాశి ఫలాలు
మేష రాశి (Aries August Monthly Horoscope 2024)
ఆగష్టు నెలలో మేషరాశివారికి గ్రహ సంచారం బావుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం..అన్ని రంగాల్లో ఉండేవారు శుభఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోరిక ఫలిస్తుంది. ఆగష్టు నెల ఆరంభం కన్నా చివర్లో కొంత గందరగోళ పరిస్థితి ఉంటుంది..
వృషభ రాశి (Taurus August Monthly Horoscope 2024)
వృషభ రాశివారికి ఆగష్టు మంచి యోగకాలం అనే చెప్పాలి. ఎప్పటి నుంచో వెంటాడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు అనుకున్నదానికన్నా ఎక్కువ లాభాలు ఆర్జిస్తారు. ఆరోగ్యం బావుంటుంది. కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు. నూతన పరిచయాలు కలిసొస్తాయి
మిథున రాశి (GeminiAugust Monthly Horoscope 2024)
మిథున రాశివారకి ఆగష్టు నెల మంచి ఫలితాలను అందిస్తుంది. అప్పుల బాధల నుంచి ఉపశమనం పొందుతారు. నూతన ప్రణాళికలు అమలుచేస్తారు. వృత్తి , వ్యాపారం, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది. ఇతరుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది
కర్కాటక రాశి (Cancer August Monthly Horoscope 2024)
కర్కాట రాశివారికి ఆగష్టు నెల అన్నివిధాలుగా బావుంటుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుకుంటారు. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. దైవ సంబంధిత కార్యక్రమాలు చేపడతారు. ఉత్సాహంగా ఉంటారు. స్త్రీ మూలక ధనలాభం ఉంటుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి..
సింహ రాశి (Leo August Monthly Horoscope 2024)
సింహ రాశివారికి ఆగష్టు లో అనుకూల ఫలితాలు లేవు. అనుకున్న పనులన్నీ వ్యతిరేకంగా సాగుతాయి. దేనిపైనా శ్రద్ధ ఉండదు. మనశ్శాంతి తగ్గుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులుంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు జరిగే సూచనలున్నాయి. ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి
కన్యా రాశి (Virgo August Monthly Horoscope 2024)
ఆగష్టు నెల కన్యారాశివారికి ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. ఏ పని చేపట్టినా కలసిరాదు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. పరామర్శలకు వెళ్లాల్సి ఉంటుంది. అపనిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఉద్యోగులకు బదిలీలుంటాయి. నమ్మినవారివలన మోసపోతారు.ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి..
తులా రాశి (Libra August Monthly Horoscope 2024)
ఈ నెలలో మీ మాటకు తిరుగుండదు. అన్ని రంగాల వారూ చేయాల్సిన వృత్తి వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారు. రాని బాకీలు వసూలు అవుతాయి.భూ సంబంధిత విషయాలు అనుకూల ఫలితాలనిస్తాయి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటారు. ఆరోగ్యం బావుంటుంది. దీర్ఘకాలిన రోగాల నుంచి ఉపశమనం పొందుతారు.
Also Read: ఆగష్టులో పుట్టినవారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం, విధేయత అన్నీ ఎక్కువే..ఆ ఒక్క విషయంలో దురదృష్టవంతులు!
వృశ్చిక రాశి (Scorpio August Monthly Horoscope 2024)
వృశ్చిక రాశివారికి ఆగష్టు నెలలో అన్నీ అనుకూల ఫలితాలే ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు బదిలీలు లేదంటే ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వాహనం కొనుగోలు చేయాలన్న మీ కోర్కె నెరవేరుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius August Monthly Horoscope 2024)
ఆగష్టు నెల ధనస్సు రాశివారికి బాగా కలిసొస్తుంది. ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ధైర్యంగా దూసుకెళతారు. ప్రయాణాలు కలిసొస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. నెల ఆరంభంలో కన్నా నెలాఖరులో ఊహించని ఖర్చులుంటాయి.
మకర రాశి (Capricorn August Monthly Horoscope 2024)
మకర రాశివారికి ఆగష్టులో అష్టమంలో గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవ్. అనవసర వివాదాల్లో చిక్కుకుంటారు. ఉద్యోగులకు బదిలీ తప్పదు. అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. శత్రువులు యాక్టివ్ గా ఉంటారు. అయితే ఎన్ని సమస్యలున్నా ధైర్యంగా ఎదుర్కొంటారు.
Also Read: పేరు మార్చుకుంటే అదృష్టం కలిసొస్తుందా.. ఇందులో నిజమెంత!
కుంభ రాశి (Aquarius August Monthly Horoscope 2024)
ఈ నెలలో మీకు గ్రహాలు అనుకూలించవు. అనుకున్న పనులేవీ పూర్తికావు. అనుకోని సమస్యలు ఎదుర్కొంటారు. అపనిందలు, అవమానాలు తప్పవు. దూరప్రాంత ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆర్థిక సమస్యలుంటాయి. సమయానికి డబ్బు చేతికందదు.
మీన రాశి (Pisces August Monthly Horoscope 2024)
ఆగష్టు నెలలో మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొత్తగా ప్రారంభించిన కొన్ని పనుల్లో జయం..మరికొన్ని పనుల్లో అపజయం ఉంటుంది. ఆరంభంలో సమస్యలు ఎదురైనాకానీ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. ఆదాయాన్ని మించిన ఖర్చులుంటాయి కానీ సమయానికి డబ్బు చేతికందుతుంది. శుభకార్యాలు నిర్వహణకు ప్రణాళికలు వేస్తారు. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు...
Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.