Weekly Horoscope 29 May to 04 June: మే 29 సోమవారం నుంచి జూన్ 4 ఆదివారం వరకూ మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...


మేష రాశి


ఈ వారం శుభకరంగా ఉంటుంది. విజయం ప్రాప్తి. ఈ వారం మీరు మీ శ్రమ,అదృష్టంతో పురోగతిని సాధించడంలో పూర్తిగా విజయవంతమవుతారు. ఈ వారం ప్రథమార్ధం కంటే ద్వితీయార్ధం కలిసి వస్తుంది.  మీకు అన్నీ విధాలా అనుకూలమైన సమయం.  ఈ సమయంలో వృత్తి-వ్యాపారంలో ముందుకు సాగడానికి కొత్త అవకాశాలు  వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పనిని ప్రణాళికాబద్ధంగా చేస్తే ఊహించని విజయాన్ని  పొందవచ్చు. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి ఆశించిన ప్రయోజనం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు కొత్త పరిచయాలు, లాభాలను పెంచుతాయి. కుటుంబ సభ్యులతో ప్రేమ, సామరస్యం నెలకొంటాయి. వారం ద్వితీయార్ధంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. కుటుంబంతో  కలిసి ఆధ్యాత్మిక  కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవివాహితుల వివాహ ప్రయత్నాలు కలిసివస్తాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రతిరోజూ శివుడిని ఆరాధించండి మరియు పక్షులకు ధాన్యం, నీటిని ఇవ్వండి.


వృషభ రాశి


ఈ రాశివారికి వారం ప్రారంభం చాలా బాగుంటుంది, కానీ ద్వితీయార్ధంలో జాగ్రత్త అవసరం. వారం ప్రారంభంలో మీరు తీసుకునే నిర్ణయానికి తోబుట్టువులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. కొత్త భూములు, వాహనాలు, భవనాల క్రయవిక్రయాలకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పూర్వీకుల ఆస్తి వలన ప్రయోజనం.మీరు చాలా కాలంగా ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. వ్యాపారస్తులకు ఆర్ధిక ఇబ్బందులు. విద్యుత్-ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. తల్లిదండ్రుల పట్ల ఆప్యాయంగా  మెలగండి. ప్రేమ వ్యవహారం విషయంలో ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఈ సమయంలో మీ సామాజిక ప్రతిష్ఠను తగ్గించే ఏ పనిని తొందరపడి, నిర్లక్ష్యంగా చేయవద్దు. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించండి, విష్ణు సహస్రనామాన్ని పఠించండి.


మిథున రాశి


మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు, మార్కెట్లో ఒడిదుడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో మీ వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీరు పనికి సంబంధించి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.  వారం ద్వితీయార్ధంలో మీ కుటుంబానికి సంబంధించిన ఏదైనా సమస్యను పరిష్కరించడానికి  అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో మీ అభిప్రాయాలను ఎవరిపైనా రుద్దకుండా అందరి సలహాలు, భావాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవడం సముచితం. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారం లేదా కెరీర్ కోసం ప్రయత్నిస్తుంటే,  దానిలో విజయం సాధించడానికి మరికొంత కాలం వేచి ఉండాలి. ప్రేమ లో అపార్థాలు ఏర్పడనివ్వవద్దు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది, అయినప్పటికీ మీరు మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవలసి ఉంటుంది. తులసి సేవలో గడపండి.  శ్రీ గణేశుడిని ఆరాధించండి.


కర్కాటక రాశి


మీ తెలివితేటలును, నైపుణ్యాలను అందరూ ప్రశంసిస్తారు. స్నేహితుల వలన ప్రత్యేక ఆనందం పొందే అవకాశం ఉంటుంది. ఈ వారం బాస్ ఉద్యోగస్తుల పట్ల పూర్తి సానుకూలంగా ఉంటారు. పనిప్రాంతంలో కొన్ని ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు. భూమి, భవనం, వాహనం క్రయవిక్రయాలకు వారం ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. మీరు చాలా కాలంగా ఇల్లు లేదా వాహనం కొనాలని ఆలోచిస్తుంటే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. తల్లిదండ్రుల నుంచి వీలైనంత  మద్దతు లభిస్తుంది. వారం చివరిలో  పిల్లలకు సంబందించిన శుభవార్తలను వింటారు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్నవారికి వారం ద్వితీయార్ధంలో ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడతారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలు నెరవేరుతాయి. ప్రేమ వ్యవహారాల  ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీకు మీ భాగస్వామికి మధ్య పరస్పర ఆనందం, సహకారం ఉంటుంది.  మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది. స్ఫటిక శివలింగాన్ని పూజించండి మరియు ప్రతిరోజూ శివ చాలీసా పఠించండి.



సింహ రాశి


సింహరాశివారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శిరో సమస్యలు తలెత్తుతాయి.. దీనివలన మానసిక ఆందోళన, చికాకులు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు అనుకున్న విజయాలు సాధించలేరు. వ్యాపారంలో నిమగ్నమై ఉంటే డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద ఆర్థిక విషయాలలో చాలా ఆలోచనాత్మక నిర్ణయం తీసుకోండి..తొందరపడి తీసుకున్న నిర్ణయానికి మీరు పశ్చాత్తాపపడవలసి ఉంటుంది. వారం ద్వితీయార్థంలో కుటుంబ సభ్యులతో ఏదో విషయంలో గొడవలు జరిగే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, మీరు సంయమనం పాటించండి. ఏదైనా సమస్యను వివాదానికి బదులుగా చర్చల ద్వారా పరిష్కరించుకోండి.  మీ భావాలను ఇతరులపై బలవంతంగా రుద్దవద్దు. ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోండి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యనైనా నిర్లక్ష్యం చేయవద్దు. ప్రతిరోజూ శ్రీ విష్ణువును ఆరాధించండి , నారాయణ కవచం పఠించండి. 


కన్యా రాశి


ఈ రాశివారికి ఈ వారం కాస్త ఒడిదొడుకులు ఉంటాయి. వారం ప్రారంభంలో మీ పని సాధారణ వేగంతో సాగుతుంది కానీ వారం మధ్యలో మీరు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ వారం బంధువుల నుంచి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. ఉద్యోగస్తులు  ఆలోచించి నిర్ణయం తీసుకోండి . మీరు కూడా ఈ వారం ఎవరి ప్రలోభాలకు లొంగకండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈ యాత్ర వల్ల ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం తక్కువే అయినప్పటికీ వృత్తి, వ్యాపారాలను పెంచుకోవడానికి ధైర్యం, సహనం పాటించండి. సోమరితనాన్ని నివారించండి. ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేయండి. జీవిత భాగస్వామి కష్టకాలంలో సహాయకారిగా ఉంటారు. ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి. 


Also Read: మీ అరచేతిలో పంచభూతాలున్నాయని మీకు తెలుసా!


తులా రాశి 


తులా రాశి వారికి ఈ వారం సంతోషం, శ్రేయస్సు ఉంటుంది. వారం ప్రారంభం నుంచి వృత్తి వ్యాపారానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. చాలా కాలంగా బదిలీ లేదా ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఈ వారం మీ ఈ కోరిక నెరవేరుతుంది. వారం ప్రారంభంలో సౌకర్యాలకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. వ్యాపారంలో అనుకోని లాభాలు మీ ఆనందాన్ని పెంచుతాయి. ఆదాయ మార్గాలు పెరగడంతో పాటూ మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. వారం ద్వితీయార్థంలో స్నేహితుల సహాయంతో ఒక పెద్ద పనిని పూర్తి చేయగలుగుతారు. మీ జీవిత భాగస్వామి సాధించిన ఏదైనా పెద్ద విజయం మీ కుటుంబం ఆనందానికి కారణం అవుతుంది. ప్రేమ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రతిరోజూ  శివలింగాన్ని ఆరాధించండి


వృశ్చిక రాశి 


వృశ్చిక రాశి వారికి ఈ వారం శుభదాయకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో భూమి, భవన క్రయవిక్రయాల వల్ల ప్రయోజనం పొందుతారు. ఈ సమయంలో కుటుంబంలో ప్రియమైన వ్యక్తి గొప్ప విజయం కారణంగా ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. కోర్టులో కేసు నడుస్తుంటే ప్రత్యర్థులు తామే రాజీకి దిగవచ్చు. అధికార-ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో పురోగతి ఉంటుంది. ఈ వారం మీరు మీ తెలివితేటలు, కృషి కారణంగా మీ వృత్తి-వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లగలుగుతారు. మీరు మీరు పనిచేసే రంగంలో పెద్ద బాధ్యతను పొందవచ్చు. వారం ద్వితీయార్ధంలో,  ఓ పనిపై లేదా పర్యాటకం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వృశ్చిక రాశి జాతకులు ఈ వారం తమ ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబానికి సంబంధించిన ఏ విషయంలోనైనా తొందరపడి లేదా ఒత్తిడితో నిర్ణయాలు తీసుకోవద్దు. ఏ నిర్ణయం తీసుకున్నా తల్లిదండ్రుల సహకారం, మద్దతు ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సమన్వయం ఉంటుంది. హనుమాన్ చాలీశా పఠించండి. 


ధనస్సు రాశి


ఈ వారం ధనస్సు రాశివారు లాభపడతారు. జీవితంలో ముందుకు సాగేందుకు మార్గం కనిపిస్తుంది. సోమరితనం వీడండి. పనులను వాయిదా వేసే ధోరణి మీకు హానికరం అని గుర్తుంచుకోండి. ఈ వారం, మీరు మీ మాటలు మరియు ప్రవర్తనను నియంత్రించడంలో విజయవంతమైతే మీ పని సకాలంలో పూర్తవుతుంది . అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి. మీరు భూమిని కొనడం , అమ్మడం చేయాలనుకుంటే వారం ద్వితీయార్ధం మీకు అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.  యువతలో ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. వారం చివరిలో, పర్యాటక లేదా మతపరమైన ప్రదేశానికి పర్యటన అకస్మాత్తుగా ప్లాన్ చేసుకుంటారు.  ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.  శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.


Also Read: ఈ రాశులవారు నిజంచెప్పరు-అబద్ధమాడరు, మీరున్నారా ఇందులో!
మకర రాశి


మకర రాశి జాతకులకు ఈ వారం సాధారణం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా  ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ పనిని నిర్వహించడానికి ఎక్కువ హైరానా పడతారు. మీరు విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేస్తుంటే లేదా విదేశాల్లో కెరీర్ వృద్ధి చేసుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం.  ఈ వారం ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగులు తమ పనితీరుతో కార్యాలయంలో గౌరవం పొందుతారు. ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడానికి మీ స్నేహితుల నుంచి మీకు ప్రత్యేక మద్దతు లభిస్తుంది. పరీక్ష-పోటీకి సన్నద్ధమవుతున్న విద్యార్థుల కృషి విజయవంతమవుతుంది.  వారం ద్వితీయార్థంలో సామాజిక, ధార్మిక, శుభకార్యాల్లో పాల్గొనడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ప్రేమ జీవితం పరంగా ఈ వారం అనుకూలంగా ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. శివారాధన మీకు మంచి చేస్తుంది. 


కుంభ రాశి


కుంభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి , వ్యాపారం గురించి చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి, లేకపోతే మీరు భారీ నష్టాలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఆర్థికంగా ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉంటాయి. ఇంటి మరమ్మతులు లేదా వస్తు సౌకర్యాల కొనుగోలు కోసం మీరు ఎక్కువ డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు కూడా ఏర్పడినా అంతకు మించి ఖర్చు ఉంటుంది. వారం మధ్యలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. వారం ద్వితీయార్థంలో మీ మనస్సు ధార్మిక పనుల్లో ఎక్కువగా నిమగ్నమవుతుంది. మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని వివాహంగా మార్చడానికి ప్రయత్నిస్తుంటే కుటుంబం నుంచి అంగీకారం ఉంటుంది.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.రోజూ శివ చాలీశా పఠించండి. 


మీన రాశి


ఈ వారం మీకు శుభం జరుగుతుంది. మీ ఆలోచనలు సకాలంలో కార్యరూపం దాల్చుతాయి. నూతన ఉత్సాహం, శక్తి ఉంటుంది.  మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారం ప్రారంభంలో ప్రభావవంతమైన వ్యక్తిని కలవడం వల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయంతో, మీరు మీ పెద్ద లక్ష్యాలను పూర్తి చేయగలరు. కుటుంబంలో అవివాహిత సభ్యురాలి వివాహం నిశ్చయమైనప్పుడు ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. తోబుట్టువుల నుంచి మద్దతు లభిస్తుంది. వారం ద్వితీయార్ధంలో మీరు భౌతిక ఆనంద వనరుల వస్తువుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు  ఖర్చు చేస్తారు. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మామూలుగా ఉండబోతోంది. సీజనల్ అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.  శ్రీ మహావిష్ణువును పూజించండి