Weekly Horoscope 21 To 27 July 2025 - వారఫలం జూలై 21 నుంచి 27
జూలై 21 నుంచి 27 జూలై 2025.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జూలై నెలలో నాలుగో వారం పెద్ద గ్రహాల మార్పులు జరుగుతాయి. అలాగే, ఈ వారంలో శ్రావణ మాసం కూడా ప్రారంభమవుతుంది. ఈ వారం మీరాశికి ఎలా ఉంటుంది? మీ వ్యాపారం, కెరీర్, ఆరోగ్యం ప్రేమ జీవితం ఈ సమయంలో ఎలా ఉంటుంది? మేషం నుంచి కన్యా రాశి వరకు వారపు రాశిఫలాలు తెలుసుకోండి.
మేష రాశి (Aries Weekly Horoscope)
మేష రాశి వారికి ఈ వారం బాగుంటుంది. ఈ వారంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే వారం చివరిలో మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. అలాగే కొన్ని విషయాలు మీకు వ్యతిరేకంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. మీ కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. స్నేహితులతో సమావేశాలు జరుగుతాయి.
వృషభ రాశి (Taurus Weekly Horoscope)
జూలై 21 నుంచి 27 వరకూ ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపారం కూడా విస్తరిస్తుంది. ఈ సమయంలో మీరు కొత్త పనులను కూడా ప్రారంభించవచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది
మిథున రాశి (Gemini Weekly Horoscope)
మిథున రాశి వారికి కొత్త వారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మీ ఇంటి వాతావరణం చాలా సంతోషంగా ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి మీరు చాలా ఆసక్తిగా ఉంటారు. ఈ సమయంలో విష్ణు మంత్రాన్ని జపించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది.
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
కర్కాటక రాశి వారికి కొత్త వారం కొంత సవాలుగా ఉంటుంది. ఈ సమయంలో మీరు చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడవచ్చు. నిర్లక్ష్యం చేయవద్దు వైద్యం చేయించుకోండి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోకండి. ఆత్మవిశ్వాసం కోల్పోకండి. మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోవడానికి ప్రయత్నించండి. ఖర్చుల విషయంలో ఆచితూచి అడుగేయండి
సింహ రాశి (Leo Weekly Horoscope)
సింహ రాశి వారికి జూలై నెల నాలుగో వారం అదృష్టాన్నిస్తుంది. ఈ సమయంలో మీకు పురోగతికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి. మీరు కొత్త పనులను ప్రారంభించవచ్చు. అలాగే తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితుల నుంచి సహకారం అందుతుంది.
కన్యా రాశి (Virgo Weekly Horoscope)
కన్యా రాశి వారికి కొత్త వారం బాగుంటుంది. ఈ వారంలో వ్యాపారంలో మంచి పురోగతిని చూస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. మీరు భౌతిక సుఖాలు పొందగలుగుతారు. ఈ వారంలో మీరు మీ పెండింగ్ పనులను పూర్తి చేయగలుగుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. పని విషయంలో ఒత్తిడి తీసుకోవద్దు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.