Venus Transits Gemini 2024: నెల రోజులకోసారి రాశి పరివర్తనం చెందే శుక్రుడు..ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. త్వరలో మిథున రాశిలో ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు రాశి మారడం వల్ల ఆ ప్రభావం మొత్తం 12 రాశులపైనా ఉంటుంది. కొన్నిరాశులవారికి అదృష్టం కలిసొస్తుంది. మరికొందరికి కష్టాలు తప్పవు. జూన్ 12న బుధరాశిలోకి ప్రవేశించే శుక్రుడు జూలై 6 వరకూ మిథునంలోనే ఉంటాడు.  జీవితంలో సంపద, శ్రేయస్సు, ఆనందం,  అందం, ప్రేమ -వైవాహిక జీవితంలో సంతోషాన్ని సూచిస్తాడు.   మిథునంలో శుక్రుడి సంచారంతో ముఖ్యంగా  ఈ 3 రాశులవారి అదృష్టం ప్రకాశిస్తుంది. 


Also Read: ఈ రాశులవారికి ఆర్థిక సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది - 2024 మే 29 రాశిఫలాలు!


మిథున రాశి (Gemini) (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)


శుక్రుడి సంచారం మిథున రాశివారికి మంచి ప్రయోజనం అందిస్తుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులకు మంచి అవకాశం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రాశి  నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. 


సింహ రాశి (Leo)  (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం)


సింహ రాశి వారికి శుక్రుని సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. సంతోషం పెరుగుతుంది. ఇంటి వాతావారణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమికులకు మంచి సమయం. ఆదాయం పెంచుకునేందుకు కొత్త వనరులు ఏర్పడతాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. సృజనాత్మక రంగంలో ఉండేవారు మంచి ఫలితాలు పొందుతారు


Also Read: అత్యంత ఆకర్షణీయమైన రాశుల్లో మీ రాశి ర్యాంక్ ఎంతో తెలుసా!


కన్యా రాశి (Virgo) (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పాదాలు)


మిథున రాశిలో శుక్రుడి రాశి పరివర్తనం కన్యా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. చిన్న చిన్న సమస్యలున్నా జీవత భాగస్వామితో కూర్చుని మాట్లాడడం ద్వారా పరిష్కారం అవుతాయి.  అనుకోని  ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కెరీర్లో మంచి ఫలితాలు సాధిస్తారు. వృత్తిపరంగా ఆర్థిక లాభాలు పొందుతారు . ఉద్యోగుల ప్రతిష్టను దెబ్బతీసేందుకు శత్రువులు ప్రయత్నిస్తారు ...మీరు అప్రమత్తంగా ఉండాలి


ఆర్థికంగా ఓ అడుగు ముందుకు పడాలనే ఆలోచన అందరకీ ఉంటుంది..కానీ అందుకు కష్టపడాలి..గ్రహబలం కలసిరావాలి. ముఖ్యంగా ఆర్థికంగా బలపడాలంటే శుక్రుడి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకే జాతకంలో శుక్రుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. రాశి పరివర్తనం చెందుతున్న శుక్రుడి ప్రభావం మిథునం, సింహం, కన్యా రాశివారికి అద్భుతమైన ఆర్థిక ఫలితాలను ఇస్తుండగా... మిగిలిన రాశులవారికి సాధారణ ఫలితాలుంటాయి.  


Also Read: 2025 మే వరకూ మీన రాశిలోనే రాహువు - ఈ రాశులవారికి ప్రతిరోజూ పండుగే!


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.