Venus Transit In Taurus 2025: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు ఓ రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించిన ప్రతిసారీ ఆ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. గ్రహసంచారం సమయంలోనూ, వేరే గ్రహాలతో సంయోగం సమయంలోనూ కొన్ని యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా శుక్రుడు సంచారం జ్యోతిష్యశాస్త్రంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే నెలలో మేషంలో ప్రవేశించాడు..జూన్ 29న వృషభ రాశిలోకి అడుగుపెట్టి జూలై 26 వరకూ ఇదే రాశిలో ఉంటాడు. శుక్రుడు శుభస్థానంలో ఉంటే ఆర్థికంగా లాభపడతారు. వృషభ రాశిలో శుక్రుడి సంచారం కొన్ని రాశులవారికి లాభాన్నిస్తుంది.  మిథున రాశి

వృషభ రాశిలో శుక్రుడి సంచాం మిథునం నుంచి 11వ స్థానంలో జరుగుతోంది. ఈ రాశి నుంచి కుజుడు మూడో స్థానంలో ఉన్నాు. ఈ సమయంలో మిథున రాశివారికి ఆర్థికంగా లాభం ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఏ పని ప్రారంభించినా మంచి ఫలితం సాధిస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన సొమ్ము మీ చేతికందుతుంది. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. వ్యాపారంలో లాభాలుంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీకు మంచి జరిగే సమయం ఇది.

కర్కాటక రాశి

మీ రాశి నుంచి శుక్రుడు పదో స్థానంలో సంచరిస్తున్నాడు. వృషభ రాశిలో శుక్రుడి సంచారం సమయంలో కర్కాటక రాశివారికి రాజయోగం ఏర్పడుతుంది. మీ రాశి నుంచి కుజుడు రెండో స్థానంలో ఉండడం, శుక్రుడు పదో స్థానంలో సంచారం వల్ల మీకు ధనయోగం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఈ సమయంలో ఇల్లు  లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ పని చేసినా కలిసొస్తుంది.

కన్యా రాశి

మీ రాశి నుంచి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించడం వల్ల ప్రేమ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అవివాహితులకు వివాహం నిశ్చయం అవుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెండింగ్ లో ఉన్న డబ్బు చేతికందుతుంది. ఏ పని ప్రారంభించినా సక్సెస్ అవుతుంది. వివాదాలు సమసిపోయి సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి

వృషభంలో శుక్రుడి సంచారం అంటే మీ రాశి నుంచి ఏడో స్థానంలో ఉంది. ఈ సమయంలో ఆర్థికంగా మీరు ఊహించని లాభం పొందుతారు. శత్రువులను తెలివిగా ఎదుర్కొంటారు. జీవితంలో సానుకూలమైన ఫలితాలు సాధిస్తారు. కుజుడు మీ రాశి నుంచి పదో స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోగలరు. మీరున్న ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. నూతన పెట్టుబడులు పెట్టేందుకు ఈ సమయం మంచిది.

మకర రాశి

వృషభంలో శుక్రుడి సంచారం అంటే మీ రాశినుంచి ఐదో స్థానంలో ఉంటుంది. ఈ సమయం మొత్తం మీకు ఉత్సాహంగా గడుస్తుంది. ఇప్పటివరకూ వెంటాడిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగంలో స్థిరపడతారు. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. పెట్టుబడులు కలిసొస్తాయి

శుక్రుడుహిమకుంద మృణాళాభం | దైత్యానాం పరమం గురుంసర్వ శాస్త్ర ప్రవక్తారం | భార్గవం ప్రణమామ్యహం ||

గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.