Baba Vanga Predictions: బాబా వాంగ అంధురాలైన భవిష్యత్ వక్త, ఆమె తన కచ్చితమైన జోస్యాల కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఆమెను బాల్కన్ నాస్ట్రడామస్ అని కూడా పిలుస్తారు. ఈ దివంగత భవిష్యత్ వక్త 1911లో స్ట్రూమికా నగరంలో వెంగెలియా పాండేవ డిమిట్రోవాగా జన్మించారు. 

బాబా వాంగ 2004లో ఇండోనేషియాలో సంభవించిన సునామీ, సోవియట్ యూనియన్ పతనం, ప్రిన్సెస్ డయానా మరణం , 9/11 ఉగ్రవాద దాడులను ముందే ఊహించి జోస్యం చెప్పిన ఘనత ఆమెకు దక్కుతుంది.

సాధారణంగా బాబా వాంగ  జోస్యాలు 85 శాతం ఖచ్చితమైనవని చెబుతారు. ఆమె మరణానికి ముందు 5079 వరకు జోస్యాలు చెప్పింది. ఇందులో ప్రపంచం అంతం కూడా ఉంది. కానీ భవిష్యత్ వక్త బాబా వాంగా జీవితం ఎలా ఉండేదో తెలుసా?

ది మిర్రర్ న్యూస్ నివేదిక ప్రకారం, బాబా వాంగా తల్లి చిన్నతనంలోనే మరణించారు.  ఆమె తండ్రి మొదటి ప్రపంచ యుద్ధంలో బల్గేరియన్ సైన్యం తరపున యుద్ధంలో పాల్గొన్నారు. 12 సంవత్సరాల వయస్సులో ఒక సుడిగాలి ఆమె కళ్ళను పోగొట్టిందని చెబుతారు. కానీ ఈ సంఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చిందని చెబుతారు. 

మానసిక సామర్థ్యాలను ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించారు 

బాబా వాంగకు 1940ల వరకు తనలో ఉండే సామర్థ్యం గురించి తెలియదు.  ఆమె ఈ సామర్థ్యాన్ని రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో తప్పిపోయిన సైనికులను కనుగొనడంలో ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించారు. యుద్ధం తరువాత ఆమె గురించి ప్రతిచోటా చర్చ జరిగింది. 

బాబా వాంగపై సంవత్సరాల తరబడి అధ్యయనం చేసిన విద్యావేత్త విక్టోరియా విటానోవా ప్రకారం, ప్రజలు ఆమె సలహా కోసం దేశం మరియు విదేశాల నుంచి వచ్చేవారు. 1960ల నాటికి బాబా వాంగా ఇంటి ముందు భారీ క్యూలైన్లు ఉండేవట. 

బాబా వాంగ 1996లో 84 సంవత్సరాల వయస్సులో మరణించారు. తన జోస్యాలలో, ఆమె మానవులు, గ్రహాంతరవాసుల కలయిక గురించి మాట్లాడింది. ఆమె గురించి వ్రాతపూర్వక పత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆమె తనతో ఎలాంటి డైరీ లేదా పెన్ను ఉంచుకోలేదని చెబుతారు. 

2025 కోసం బాబా వాంగ  ఏం చెప్పారంటే.. యూరప్‌లో రెండు దేశాల మధ్య కొత్త యుద్ధం మొదలై, జనాభాపై తీవ్ర ప్రభావం చూపుతుంది  ఒక పెద్ద క్రీడా సంఘటన సమయంలో భూమిపై ఏలియన్స్ సంపర్కం ఏర్పడుతుందని ఆమె ఊహించి చెప్పారు 2025లో శాస్త్రవేత్తలు మనస్సు ద్వారా సంభాషణ సాధ్యమయ్యే విధంగా బ్రెయిన్‌వేవ్‌లను ఉపయోగించే పద్ధతిని కనుగొంటారని ఆమె ఊహించారు మానవ అవయవాలను ప్రయోగశాలలో తయారు చేసే సాంకేతికత 2025లో పరిపూర్ణం అవుతుందని, దీనివల్ల ట్రాన్స్‌ప్లాంట్ కోసం వేచి ఉండే సమయం తగ్గి, జీవితకాలం పెరుగుతుంది

ఆగస్ట్ 2025లో భూమి , ఆకాశం నుంచి ఒకేసారి డబుల్ ఫైర్ ఉద్భవిస్తుందని ఆమె ఊహించినట్లు ఉంది 2025లో భూకంపాలు, వరదలు,  ఇతర సహజ విపత్తులు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతాయని చెప్పారామె

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే.  ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.