Ugadi Rasi Phalalu 2025 Business Astrology : శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహ సంచారం ఏ రాశిలో ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాత్రం అద్భుతంగా ఉంది. కొన్ని రాశులకు చెందిన భాగస్వామ్య వ్యాపారుల మధ్య వివాద సూచనలున్నాయి...

మేష రాశి

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మేష రాశి వ్యాపారులు లాభపడతారు. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి  కలిసొస్తుంది. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రంగా ఉంటుంది కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారు అధిక లాభాలు పొందుతారు.  నిర్మాణ రంగం, కాంట్రాక్టు పనులు చేసేవారికీ లాభమే.  షేర్ మార్కెట్, బంగారం , వెండి వ్యాపారులకు స్వల్ప నష్టాలుంటాయి. 

వృషభ రాశి

వృషభ రాశివారికి ఈ ఏడాది అన్ని రంగాల్లోనూ అభివృద్ధే కనిపిస్తోంది. అడుగుపెడితే సక్సెస్ అవడ పక్కా. కొత్తగా వ్యాపారం చేసేవారికీ కలిసొస్తుంది. గృహనిర్మాణ రంగంలో ఉండేవారు విశేషంగా వృద్ధి చెందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు, వ్యాపారాన్ని విస్తరిస్తారు. షేర్ మార్కెట్లో ఉండేవారు లాభపడతారు.

మిథున రాశి

మిథున రాశి వ్యాపారులకు ఈ ఏడాది విశేష యోగకాలం. ఏ వ్యాపారంలో అయినా లాభాలే లాభాలు. ముఖ్యంగా నిర్మాణ రంగం, కాంట్రాక్టు వ్యాపారులకు అధిక లాభాలుంటాయి. బంగారం, వెండి వ్యాపారులకు కలిసొస్తుంది.

కర్కాటక రాశి కర్కాటక రాశి వ్యాపారులకు  తెలుగు సంవత్సరాది అనుకూలంగా ఉంటుంది. ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. కార్పొరేట్ సంస్థలు నిర్వహించేవారికి ఫలవంతంగా ఉంటుంది. భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో ఉండేవారికి కలిసొస్తుంది. 

సింహ రాశి సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. గురు, శని ప్రభావంతో కొన్ని వ్యాపారాల్లో నష్టాలు తప్పవు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి వివాదాలు తప్పవు. చిన్న వ్యాపారులకు పర్వాలేదు కానీ పెద్ద వ్యాపారులు నష్టపోతారు. నిర్మాణరంగం, వడ్డీ వ్యాపారం చేసేవారికి లాభం ఉంటుంది 

కన్యా రాశి

శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఈ రాశి వ్యాపారులకు అత్యంత అనుకూలం.  పెట్టిన పెట్టుబడులకు మీరు అనుకున్న లాభం పొందుతారు.  భాగస్వామ్య వ్యాపారం చేసేవారి మధ్య అభిప్రాయ బేధాలు వస్తాయి. ఫైనాన్స్ వ్యాపారంలో విశేష లాభం ఉంటుంది. పరిశ్రమలు, నిర్మాణ రంగంలో ఉండేవారికి లాభం

తులా రాశి

తులా రాశికి చెందిన ఫైనాన్స్ వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. నిర్మాణ రంగం, రియల్ ఎస్టేట్ , కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేవారు అధిక ఫలాలు పొందుతారు. 

వృశ్చిక రాశి

 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వృశ్చిక రాశి వ్యాపారులకు అద్భుతంగా కలిసొస్తుంది. నూతన వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటే అడుగు ముందుకు పడుతుంది. అన్ని రంగాల్లో ఉండే వ్యాపారులు లాభపడతారు. నిర్మాణ రంగం, కాంట్రాక్ట్ వ్యాపారం చేసేవారికి లాభాలుంటాయి. 

ధనస్సు రాశి

ధనస్సు రాశి వ్యాపారులకు  శ్రీ విశ్వావసు నామ సంవత్సరం  లాభదాయకంగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేవారికి వసూళ్లు పెరుగుతాయి.  నిర్మాణ రంగంలో ఉండేవారికి విశేష లాభం. షేర్ మార్కెట్లో పెట్టుబడులు సాధారణ ఫలితాలనిస్తాయి.

మకర రాశి

మకర రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి ఇదే మంచి సమయం. నిత్యం అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. రియల్ ఎస్టేట్, కాంట్రాక్ట్, మిల్లులు, నిర్మాణ రంగంలో ఉండే వ్యాపారులు లాభపడతారు

కుంభ రాశి

ఈ ఏడాది కుంభ రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ప్రణాళిక ప్రకారం పనులు చేస్తారు. నూతన పెట్టుబడులు పెడతారు వాటివల్ల లాభపడతారు. ఈ రాశి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అనుకూల సమయం. జాయింట్ వ్యాపారాలు చేసేవారి మధ్య మంచి అవగాహన ఉంటుంది  మీన రాశి

మీన రాశికి చెందిన హోల్ సేల్ అండ్ రీటైల్ వ్యాపారులకు మంచి లాభాలుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలసిరావు. నిర్మాణ రంగంలో ఉండేవారికి మంచి ఫలితాలున్నాయి

ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి