ఏప్రిల్ 01 మంగళవారం ఉగాది రాశిఫలాలు

మేష రాశి

ఈ రోజు కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుంది.  సమాజంలో సరైన గౌరవం లభిస్తుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం మెరుగుపుతుంది. వైవాహిక జీవితంలో ఉండే సమస్యలు తొలగిపోతాయి

వృషభ రాశి

ఈ రోజు మీకు పని ఒత్తిడి  పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. మీ విజయాలను పదే పదే ప్రస్తావించి గొప్పలు చెప్పుకోవడం ఆపేయండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. మీరు మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు.

మిథున రాశి

ఈ రోజు స్నేహితులు, సహోద్యోగులకు సహాయం చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులపై పని ఒత్తిడి తగ్గుతుంది.  కొత్త కార్యాచరణ ప్రణాళికలను ప్రారంభించడంలో మీరు విజయం సాధిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం. 

కర్కాటక రాశి

ఈ రోజు మీరు చాలా శక్తివంతులుగా భావిస్తారు. రాజకీయ చర్చలో పాల్గొనవచ్చు. మీ దినచర్యను క్రమశిక్షణతో ఉంచండి. ప్రేమికులకు అనవసర వాగ్దానాలు చేయవద్దు. మీ బాధ్యతల గురించి  ఆందోళన చెందుతారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త

సింహ రాశి

ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఉన్నత విద్యలో ఉండేవారికి సమస్యలు ఉంటాయి. ఆర్థిక నష్టానికి అవకాశం ఉంది. చట్టపరమైన విషయాలు చిక్కుకుపోతాయి.  చిన్న విషయాల గురించి ఇంట్లో ఒత్తిడి ఉంటుంది. తల్లి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంటుంది

కన్యా రాశి

ఈ రోజు దగ్గరివారి సలహాలను విస్మరించొద్దు..పాటించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి రావొచ్చు.  అనవసరమైన చర్చల నుంచి దూరం పాటించండి.  మీ స్వభావంలో వినయాన్ని ఉంచడం అవసరం. వైవాహిక జీవితంలో కమ్యూనికేషన్ బ్రేక్ చేయొద్దు.

తులా రాశి

ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పురోగతి ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వైవాహిక జీవితం  శృంగారభరితంగా ఉంటుంది. మీకు చాలా కాలంగా వెంటాడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వశ్చిక రాశి

ఈ రాశివారికి ఈ రోజు అధిక రక్తపోటు సమస్యలు ఉండవచ్చు. మీరు అన్ని పనులను సమయానికి చేసేలా ప్లాన్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బు చేతికందుతుంది. ప్రేమ వ్యవహారాలలో తీవ్రత పెరుగుతుంది. మీ కార్యాచరణ ప్రభావితమవుతుంది. ఆవేశంలో నిర్ణయం తీసుకోవద్దు. 

ధనుస్సు  రాశి

ఈ రోజు పెట్టుబడి సమయంలో జాగ్రత్తగా ఉండండి. తీవ్రమైన ఆలోచనలు ప్రభావం మీపై ఉంటుంది. కార్యాలయంలో చికాకు ఉంటుంది.  మీ ప్రవర్తనను పిల్లల పట్ల మంచిగా ఉంచండి. కొత్త ప్రేమ వ్యవహారాలతో సమస్య ఉంటుంది. దినచర్యలో ఊహించని మార్పులుంటాయి. 

మకర రాశి

మీలో లోపాలను సరిచేసుకునేందుకు ప్రయత్నించండి. వైరల్ ఫీవర్ సమస్య ఉండొచ్చు. క్లారిటీ లేకుండా ఎవరికీ వాగ్ధానాలు చేయొద్దు. మహిళలు వంటగదిలో పరికరాలను జాగ్రత్తగా వినియోగించాలి. ఆలోచన లేకుండా వాగ్ధానం చేయొద్దు.

కుంభ రాశి

ఈ రోజు మీరు కృషికి అర్ధవంతమైన ఫలితాలను పొందుతారు. ఉన్నతాధికారుల సలహాలు మీకు ఉపయోగపడతాయి. మీ మాటలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. జీవిత భాగస్వామితో బంధం బలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలొస్తాయి

మీన రాశి

ఈ రోజు మీకు శుభప్రదమైనది. మీ పనుల కోసం ఇతరులపై ఆధారపడొద్దు. మీ సామర్థ్యం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. స్నేహితులు, సన్నిహితులతో మంచి సంబంధాలు మెంటైన్ చేయండి. ప్రేమికులు పెద్దల ఆశీర్వాదం పొందుతారు. 

శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో  మీ నక్షత్రం ప్రకారం కందాయ ఫలాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి 

గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి,  పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.