Trigrahi Yog in Aries 2023
జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాశిచక్ర మార్పును ఎంత ముఖ్యమైనదిగా భావిస్తారో..అదే విధంగా ఒకే రాశిచక్రంలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాల కలయికను కూడా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. ఒకే రాశిలో మూడు గ్రహాలు ఉన్నప్పుడు దాన్ని త్రిగ్రాహి యోగం అంటారు. మేషరాశిలో మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రంలో బుధుడికి రాకుమారుడి హోదా ఉంది. బుధుడు తెలివితేటలు, వాక్కు, వ్యాపారం, తర్కానికి సంబంధించిన గ్రహంగా భావిస్తారు. బుధుడు 2023 ఏప్రిల్ 1న మేష రాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే రాహువు, శుక్రుడు మేషరాశిలో ఉన్నారు. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడింది...కొందరికి అనుకూల ప్రభావం కాగా మరికొందరికి ప్రతికూల ప్రభావం ఉంది. ముఖ్యంగా ఈ మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి
Also Read: ఈ రాశులవారు ఈ వారం ఏ విషయంలోనూ తొందరపడొద్దు, ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్త!
వృషభ రాశి
వృషభ రాశి వారికి త్రిగ్రాహి యోగం మంచిదని చెప్పలేం. ఈ సమయంలో దుబారా ఖర్చులు పెరుగుతాయి. మీరు కొన్ని పనులకు అవసరం లేకపోయినా అదనపు డబ్బు ఖర్చు చేయవలసి ఉంటుంది. మేషరాశిలో త్రిగ్రాహి యోగం కారణంగా వృషభరాశికి చెందిన భాగస్వామ్య వ్యాపారులకు మంచిది కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండకపోతే మోసపోయే అవకాశం ఉంది. అనవసర చర్చలు తలెత్తుతాయి..ఎలాంటి కారణం లేకుండా ఇతరుల వ్యవహారాల్లోకి తలదూర్చవద్దు. వ్యాపారులు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది
కన్యా రాశి
కన్యారాశి వారికి...త్రిగ్రహ యోగ కలయిక అష్టమం స్థానంలో జరుగుతోంది. ఈ సమయంలో మీరు చాలా సవాళ్లు ఎదుర్కోవలసి ఉంటుంది. మానసిక సమస్యలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సీనియర్ అధికారులతో వాదన ఉండవచ్చు...ఈ విషయంలో మీరు సంయమనం పాటించడం మంచిది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి
Also Read: ఈ వారం ఈ రాశులవారికి అదృష్టం కలిసొస్తుంది, ఆశించిన పురోగతి సాధిస్తారు
వృశ్చిక రాశి
వృశ్చిక రాశివారికి ఆరవ స్థానంలో త్రిగ్రాహి యోగం ఏర్పడింది. దీని వల్ల మీకు ఇప్పటికే ఉన్న సమస్యలు మరింత పెరుగుతాయి. ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆర్థిక విషయాలలో ఒడిదొడుకులను ఎదుర్కోవలసి ఉంటుంది. కోర్టులో వివాదం పెండింగ్లో ఉంటే మీరు నిరాశ పడతారు. మీకు చిన్న చిన్న ప్రమాదాలు జరిగేఅవకాశం ఉంది.. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దు...అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది.
నోట్: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.