మీకు తెలుసా ఏ రాశి వారు ఏ పండు తినాలో ? అవునండి మీరు చదివింది కరెక్టే మీ రాశిని బట్టి మీరు తీసుకునే పండు ఉంటుందని జ్యోతిష నిపుణులు అంటున్నారు. అదేంటో చూడండి.


మేషం - అరటి


రాశి చక్రంలో మొదటి రాశి మేషం. ఈ రాశి వారు మంచి ట్రెండ్ సెట్టర్లుగా ఉంటారు. ఇతరులకు మార్గదర్శనం చేస్తుంటారు. ఇది అగ్ని తత్వ రాశి కావడం మూలంగా వీరిలో ఇలాంటి ఫైర్ ఉంటుందేమో. ఒక సారి పరుగు అందుకుంటే ఇక వీరిని ఆపే వారే ఉండరు. ఇలా మీరు చురుకుగా ఉండేందుకు మీకు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా కలిగి, చిన్నగా ప్యాక్ చెయ్యడానికి వీలుగా ఉండే పండు కావాలి. కాబట్టి వీరు అరటి పండు తీసుకోవడం మంచిది. ఇవి మిమ్మల్ని కచ్చితంగా ఆరోగ్యంగా చురుకుగా ఉంచుతాయి.


వృషభం - పీచ్


వీరు చాలా సెన్సిబుల్, స్వీట్ పర్సనాలిటి కలిగిన వారు. మంచి జరగాలంటే అనుకూల సమయం రావాలని వీరికి బాగా తెలుసు. ఇది భూతత్వ రాశి. అందువల్ల వీరు ఓపికకు ప్రతీకలు. అచీ తూచి అడుగేస్తుంటారు. వీరి లాగే పండేందుకు ఎక్కువ సమయం తీసుకునే మొండి ఘటం వంటి పండు పీచ్ . తక్కువ కాలం నిల్వ ఉండే ఈ పండును కొంత మంది దూరం పెడుతుంటారు. కానీ వృషభం వారికి అందరికంటే బాగా తెలుసు ఏసమయంలో ఏది మంచిదో అందుకే వీరికి పీచ్ పండు మంచి మేలు చేసే పండు


మిథునం - బ్లూబెర్రీ


మిథునం రాశివారి తరహాలోనే కొద్దిగా తియ్యగా, కొద్దిగా ఆకర్శణీయంగా, నిండా రుచితో ఉండే పండు బ్లూబెర్రి. మిథున రాశి వారు బహుముఖ ప్రజ్ఙ కలిగిన వారు. ఎంత మందిలో ఉన్నా, ఎంత మంది స్నేహితుల మధ్య ఉన్నప్పటికీ ఆయా సందర్బాలను అనుసరించి నడుచుకొని అందరినీ మెప్పించడం వీరి ప్రత్యేకత. బ్లూబెర్రి కూడా వీరిలాగే సలాడ్ లలో బాగా బ్లెండ్ అవుతుంది. బట్టరీ మఫెన్సలలో మరింత రుచిగా ఉంటుంది. మిథునం వారికి బ్లూబెర్రి మంచి పండు.


కర్కాటకం -చెర్రీ


కర్కాటక రాశి వారిని మంచిన కరుణ కలిగిన వారు భూమండలం మీద మరొకరు ఉండరు. మంచి సెన్స్ ఆప్ హ్యూమర్ వీరి సొంతం. ఎవరికైనా సరైన సలహా ఇవ్వడంలో వీరికి వీరే సాటి. కానీ చాలా తక్కువ మందిని తమ క్లోజ్ సర్కిల్ లోకి రానిస్తారు. చాలా తక్కువ మందికే వీరి లోపలి తత్వం అర్థం చేసుకునే అవకాశం దొరకుతుంది. అచ్చం చెర్రి పండు కూడా అలాంటిదే. ఇవి సంవత్సరంలో చాలా కొద్ది కాలం పాటు మాత్రమే దొరకుతాయి. కానీ వీటి రుచి మాత్రం అమోఘం.


సింహం - వెలగపండు


సింహ రాశి వారు ధైర్యంగా బతకాలనుకుంటారు. ఎలాంటి రిగ్రెట్స్ కి తావులేని జీవితాన్ని ఆశిస్తారు. కాబట్టి రుచితో ప్యాషన్ తో నిండి ఉన్న ప్యాషన్ ఫ్రూట్ వీరికి సరైన పండు. చూడడానికి కాస్త పొగరుగా కనిపించినప్పటికీ వీరితో ఉండేవారికి మధురభావనను మిగల్చగలరు. ప్యాషన్ ప్రూట్ కూడా వీరిలాగే బయట గట్టిగా ఉన్నప్పటికి లోపలి గుజ్జుతో తియ్యగా ఉంటుంది. వీరి జీవితంలో ఉన్నవారికి కచ్చితంగా వీరిలోని మాధుర్యం అర్థమయ్యే తీరుతుంది.


కన్య - ఆపిల్


కన్యా రాశి వారు పరిస్థితులను ఉన్నవి ఉన్నట్టుగా అంగీకరించే మనుషులు. క్రిస్పీగా, రిఫ్రేషింగ్ గా ఉండే ఆపిల్స్ మాదిరిగానే. కొంత మందికి వీరు బోరింగ్ గా అనిపించవచ్చు గాక. కానీ ఆపిల్ లాగనే వీరు కంటికి ఇంపుగా కనిపించే మనుషులు. కన్యా రాశి వారి లాగే ఆపిల్ చాలా సులభంగా రోజు వారీ ఆహారంలో కలిసిపోతుంది. అంతే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది. ఎన్నో రకాల్లో లభిస్తుంది కూడా. ఆపిల్ కన్య వారికి బాగా నప్పే పండు ఆపిల్.


తుల – స్ట్రాబెర్రీ


తులా రాశి వీనస్ ఆధీనంలో నడిచే రాశి. ఈ రాశి వారికి ప్రేమకు, ప్యాషన్, అందానికి ప్రతీకలుగా కనిపించే స్ట్రాబెర్రీ మంచి పండు. ఏ మూడ్ లో ఉన్నా కూడా ఈ ఎర్రని పండ్లు మీ మూడ్ ను బాగు చేస్తాయనడంలో సందేహం అవసరం లేదు. స్మూదీ లో బ్లెండ్ చేసినా, చాక్లెట్ లో డిఫ్ చేసినా ఎలా తీసుకున్నా మంచిదే. జీవితాన్ని వైవిద్య భరితం చేసుకోవాలని అనుకునే తులా రాశి వారికి స్ట్రాబెర్రి సరైన పండు.


వృశ్చికం – దానిమ్మ


వృశ్చిక రాశి వారు వారి గురించి ఇతరులు ఏమనుకుంటున్నారనే దాని గురించి అసలు పట్టించుకునే మనుషులే కాదు. మనకుండేది మనకుంటుంది అని నమ్మే మనుషులు వీరు. దూరం నుంచి చూసే వారికి వీరు కాస్త పొగరుగాను, నమ్మతగని వ్యక్తులుగాను అనిపించినప్పటికీ దగ్గరి వారికి మాత్రం వీరిలోని మంచితనం బాగా తెలుస్తుంది. అచ్చం దానిమ్మలోని పొరల మధ్య దాగున్న గింజల్లోని తియ్యదనం లాగే వీరిలోని మంచితనం కూడా అంత త్వరగా బయటకు కనిపించదు. అందువల్ల వీరు కూడా దానిమ్మను తినడానికి ఇష్టపడతారు. రూబి రెడ్ కలర్ లో ఉండే ఈ పండు వృశ్చిక రాశి వారి మార్మిక మనస్తత్వానికి బాగా సూటవుతుంది.


ధనుస్సు – ద్రాక్ష


దనస్సు రాశి వారిని అంత త్వరగా అంచనా వేయడం సాధ్య పడదు. వారి జీవన విధానం, ఆలోచనా ధోరణి చాలా అంచనాలకు అందడం కష్టం. అలాంటి వీరికి బాగా సుటయ్యే పండు ద్రాక్ష. వీరి విషయంలో రెండు ఎదురు లేని నిజాలుంటాయి. అవేమిటంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారు. వీరికి చాలా సులభంగా తినగలిగే పండు కావాలి. అది సులభంగా దొరకాలి. మీరు పర్పుల్ ద్రాక్ష ఇష్టపడతారో లేక తెల్లని ద్రాక్ష ఇష్టపడతారో అనే సందేహం వద్దేవద్దు ద్రాక్ష అయితే చాలు మీకు నచ్చుతుంది.


మకర – ఆరెంజ్


మొత్తం రాశి చక్రంలోనే అత్యంత శక్తి వంతమైన బాస్ ఎవరంటే అది మకర రాశి వారే. వీరు తాము నడిచే దారిని తామే నిర్ణయించుకుని దానికి కచ్చితంగా కట్టుబడి ఉంటారు. వీరు చాలా బిజీ గా ఉండడం వల్ల పనులను వరుసక్రమంలో చేసుకుంటూ పోతుంటారు. వీరికి కావల్సిన శక్తిని అందించేందుకు ఆరెంజ్ వీరికి సరైన పండు. అంతే కాదు రోజు వారీ విటమిన్ సి కూడా అందుతుంది. అందువల్ల వీరి బీజీ షెడ్యూల్ అనారోగ్యం వల్ల చెదిరేది ఏమీ ఉండదు. మీరు పనిలో ఉన్నా లేక మీరు వెకేషన్ కు వెళ్లాలనుకున్నా తప్పనిసరిగా వెంట కొన్ని ఆరెంజెస్ పెట్టుకోవడం మంచిది.


కుంభం – ప్లమ్


కఠిన పరిస్థితులను సైతం తట్టుకొని విజయాలు సాధించే సామర్థ్యం కలిగిన వారు కుంభరాశి వారు. వీరిలో ప్లమ్ లాగే కమ్మదనంతో పాటు ఒక నిరాడంబరత ఉంటుంది. ఇధి చల్లని చలి కాలంలో వచ్చే పండు. రుచి కూడా వైవిధ్య భరితం. కుంభ రాశి వారి పుట్టిన రోజులు కూడా చలికాలంలోనే ఉంటాయి. ఈ రాశి శని గ్రహం అధీనంలో ఉంటుంది. కోరుకున్న లక్ష్యాలు చేరుకోవడానికి వీరు మరింత ఎక్కువ ఓపికతో దీర్ఘకాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్లమ్ కూడా రోజులు గడిచే కొద్ది కమ్మదనాన్ని సంతరించుకుంటుంది. కుంభరాశి వారికి ఈ పండుకు చాలా లక్షణాల్లో పోలిక ఉంటుంది. కనుక ఇది వీరికి సరైన పండు.


మీనం – నిమ్మ


మొత్తం రాశి చక్రంలో అత్యంత సృజనాత్మకత కలిగి, స్వేచ్ఛగా ఆలోచించే వ్యక్తులు. వీరి ఆలోచనా విధానం, జీవిన సరళి వారి పరిసరాలు, వెంట ఉండే మనుషులను బట్టి చాలా ప్రభావితం అవుతాయి అచ్చం నిమ్మ కాయ లాగే. సరైన పరిసరాల్లో ఉన్నపుడు వీరిలోని తియ్యదనం, కమ్మదనం బయటపడతాయి. వీరు నచ్చక పెదవి విరిచే వారు ఎంత మంది ఉంటారో నచ్చి వీరిని కోరుకునే వారు కూడా ఉంటారు. వీరికి అనుకూలమైన పరిస్థితులు ఎదురైనపుడు వీరిలోని అన్ని సుగుణాలు బయటపెట్టడానికి ఎంత మాత్రం సందేహించరు. కనుక వీరికి చాలా నప్పే పండు నిమ్మ పండు.