Solar Eclipse 2025: ఈ సంవత్సరం మార్చి నెలలో మొదటి సూర్యగ్రహణం ఏర్పడింది, ఇది భారతదేశంలో కనిపించలేదు, అదే విధంగా సెప్టెంబర్ 21న ఏర్పడనున్న రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. అందుకే ఎలాంటి గ్రహణ నియమాలు , సూతకాలం పాటించాల్సిన అవసరం లేదు. ఆలయాలు కూడా మూసివేయాల్సిన అవసరం లేదు. 

Continues below advertisement

గ్రహణం మనకు కనిపించినా.. కనిపించకపోయినా..సోషల్ మీడియా వేదికగా హడావుడి పెరగడంతో గ్రహణ నియమాలు పాటించాలా అనే సందేహం తలెత్తుతోంది. గ్రహణం నీడ మనకు లేనప్పుడు నియమాలు పాటించాల్సిన అవసరం లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు గతంలో పలుమార్లు స్పష్టంగా చెప్పారు. అందుకే సెప్టెంబర్ 21 అమావాస్య రోజు ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు..నియమాలు పాటించాల్సిన అవసరం లేదు.

అయితే హిందూ శాస్త్రాల్లో గ్రహణ సమయాన్ని అశుభంగా భావిస్తారు, ఇది వ్యక్తి జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. ప్రస్తుత కాలంలో భారతదేశం సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రకృతి వైపరీత్యాలు, ద్రవ్యోల్బణం, హింస , యుద్ధం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్న సూర్యగ్రహణం ప్రభావం వీటిపై ఉంటుందా? ప్రపంచస్థాయిలో ఏం జరగబోతోంది? సూర్యగ్రహణం ప్రభావం వల్ల బాబా వాంగ భవిష్యవాణి నిజమవుతుందా? సూర్యగ్రహణం 2025 తేదీ  సమయం

Continues below advertisement

2025 సంవత్సరంలో  చివరి సూర్యగ్రహణం పితృ పక్షం ముగింపు అయిన సెప్టెంబర్ 21న ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం పాక్షికంగా (Partial Solar Eclipse) ఉంటుంది. భారతీయ కాలమానం ప్రకారం, ఈ సూర్యగ్రహణం రాత్రి 10 గంటల 59 నిమిషాల నుంచి అర్ధరాత్రి దాదాపు 3 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ముఖ్యమైన సమయం రాత్రి 1 గంట 11 నిమిషాలకు ఉంటుంది. గ్రహణ  యొక్క మొత్తం వ్యవధి  4 గంటల 24 నిమిషాలు ఉంటుంది.

ఈ సూర్యగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది?

సెప్టెంబర్ 21, 2025న ఏర్పడే సూర్యగ్రహణం  85 శాతం భాగం రాస్ సముద్రం, అంటార్కిటికాలో కనిపిస్తుంది. దీనితో పాటు, ఇది న్యూజిలాండ్, అంటార్కిటికా , పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో కనిపిస్తుంది. భారతదేశంలో ఈ గ్రహణం కనిపించదు.

సూర్యగ్రహణం 2025 ప్రతికూల ప్రభావాలు 
మతపరమైన నమ్మకాల ప్రకారం, గ్రహణ సమయంలో పూజలు చేయడం నిషేధం. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం కూడా నిషేధమే 
ఈ సమయంలో గర్భిణీ స్త్రీలను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు 
గ్రహణ సమయంలో మానసిక ఒత్తిడి, భయం , కుటుంబ కలహాల ప్రమాదం పెరుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు శక్తికి చిహ్నం. సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు ఆత్మవిశ్వాసం లోపిస్తుందని చెబుతారు  
ప్రకృతిపై గ్రహణ ప్రభావం గురించి చెప్పుకుంటే వాతావరణంలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది.

బాబా వాంగ  భవిష్యవాణిలు 2025

  • బాబా వాంగ తన భవిష్యవాణిలలో 2025 సంవత్సరాన్ని చాలా బాధాకరమైన సంవత్సరంగా పేర్కొన్నారు.
  • వ్యాధులు మరియు మహమ్మారి గురించి కూడా ప్రస్తావించారు
  • బాబా వాంగ యొక్క భవిష్యవాణిలలో సామాజిక అస్థిరత , సంఘర్షణకు సంకేతాల గురించి చెప్పారు
  •  2025లో యుద్ధం , ఆర్థిక సంక్షోభం గురించి కూడా మాట్లాడారు.
  • ఈ ఏడాది ప్రకృతి వైపరీత్యాలు తీవ్రత గురింతి భవిష్యవాణిలో ప్రస్తావించారు

గ్రహణం - బాబా వాంగ  భవిష్యవాణికి ఏదైనా సంబంధం ఉందా?

సూర్యగ్రహణం ప్రభావం , బాబా వాంగ భవిష్యవాణిల మధ్య ప్రత్యక్ష లేదా ప్రామాణికమైన సంబంధం లేదు. కానీ రెండింటినీ భయం, సంక్షోభం,   ప్రతికూల మార్పులతో ముడిపెట్టి చూస్తారు. శాస్త్రీయ కోణంలో చూస్తే  సూర్యగ్రహణం ఒక ఖగోళ సంఘటన, అయితే బాబా వాంగ భవిష్యవాణిలకు ఎటువంటి ప్రామాణికమైన మూలం లేదు.

గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. ABP దేశం ఎలాంటి నమ్మకాన్ని లేదా సమాచారాన్ని ధృవీకరించడంలేదు.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.