Saturn Transit in Shatabhisha Nakshatra 2024: గ్రహాలన్నింటిలోనూ నెమ్మదిగా సంచరిస్తాడు శని... అందుకే మందరుడు అని అంటారు. ఒక్క రాశిలో రెండున్నరేళ్లపాటు సంచరించే శని ఆ రాశిలో ఉన్న నక్షత్రాల్లోకి పరివర్తనం చెందుతాడు.. కుంభ రాశిలో ధనిష్ట 3,4 పాదాలు...శతభిషం నాలుగు పాదాలు, పూర్వాభాద్ర  1,2,3 పాదాలు ఉన్నాయి. రెండున్నరేళ్లపాటూ శని ఈ మూడు నక్షత్రాల్లోనే సంచరిస్తాడు. ప్రస్తుంత పూర్వాభాద్రలో ఉన్న శని భగవానుడు అక్టోబరులో శతభిషంలో అడుగుపెడతాడు. ఈ ప్రభావంతో కొన్ని రాశులవారికి మంచి జరిగితే మరికొన్ని రాశులవారి ఆరోగ్యం, ఆదాయంపై ప్రభావం చూపిస్తుంది...ఈ 3 నెలలు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది...ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకోండి..


Also Read:  నక్షత్రం మారుతున్న శని..అక్టోబరు నుంచి మూడు నెలల పాటూ ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమే!


మిథున రాశి (Gemini)


మిథున రాశివారికి ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా 15 ఏళ్లుగా శని వెంటాడుతూనే ఉంది. ఈ ఏడాది కొంతవరకూ మెరుగైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వెల్లడించారు. అయితే అక్టోబరులో శని శతభిషం నక్షత్రంలోకి ప్రవేశించడంతో మూడు నెలల పాటూ కష్టాలు తప్పవు. ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. ఆందోళన పెరుగుతుంది. ఈ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. ఈ సమయంలో మీరు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి.


సింహ రాశి   (Leo)


శతభిషం నక్షత్రంలో శని సంచారం సింహ రాశివారికి చుక్కలు చూపిస్తుంది. ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఆందోళన, మానసిక ఒత్తిడి అధికమవుతుంది. కెరీర్ పరంగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటే ఆచితూచి అడుగేయాల్సిన సమయం ఇది. అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ ప్రతివిషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. 


Also Read: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


తులా రాశి (Libra )


శని ప్రభావం తులా రాశివారిపై ఉంటుంది. మూడు నెలల కాలంలో ఆరోగ్యం , ఆదాయం , కెరీర్, వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రతి విషయంలోనూ ఏదో ఒక ఆందోళన వెంటాడుతుంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవ్దదు. నూతన పెట్టుబడులు పెట్టాలి అనుకున్నా, కొత్త ప్రణాళికలు అమలు చేయాలి అనుకున్నా నిపుణల సలహాలు తీసుకోవడం అత్యుత్తమం.  
 
మీన రాశి (Pisces )


2024 ఆరంభం నుంచి మీన రాశివారికి అద్భుతంగా ఉంది..అన్నింటా కలిసొచ్చింది..కానీ ఏడాది చివర మూడు నెలలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. రాజకీయ రంగంలో ఉండేవారికి, విద్యార్థులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.  


సాధారణంగా శని ప్రభావం మీ రాశిపై ఎంతవరకూ ఉంటుంది అనేది..మీ జాతకంలో ఉండే ఇతర గ్రహాలపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యశాస్త్ర నిపుణులు. శుక్రుడు, గురుడు శుభస్థానంలో ఉన్నప్పుడు శని ప్రభావం మీపై అంతగా ఉండదు...


Note: ఓ రాశిలోని ఫలితాలు మొత్తం ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు..మీ జాతకంలో గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


Also Read: మీ సమస్య ఆధారంగా వారంలో ఏ రోజు ఏ దేవుడిని ఎలా పూజించాలి..దానివల్ల వచ్చే ఫలితమేంటి!