Shani Dev: ప్రస్తుతం శని గ్రహం మీనంలో సంచరిస్తోంది. ఫలితంగా కుంభం, మీనం, మేష రాశులవారికి ఏల్నాటి శని నడుస్తోంది. సింహ రాశివారికి అష్టమ శని, ధనస్సు రాశివారికి అర్దాష్టమ శని నడుస్తోంది. అయితే శని గ్రహం 2026 జూలై 27న వక్రగతిలో ఉంటుంది. ఇది డిసెంబర్ 11 వరకు తన వక్రగతి గమనాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో నాలుగు రాశులవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే..జ్యోతిష్య శాస్త్రంలో శని వక్రగమనాన్ని అత్యంత ముఖ్యమైనద దశగా పరిగణిస్తారు. ఈ సమయంలో ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతారు. శని వక్రంలో సంచరిస్తుప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులవారు...
మంగళవారం ఈ పనులు చేస్తే.. వివాహం, ఉద్యోగానికి ఉండే అడ్డంకులు తొలగిపోతాయి!
మీన రాశి
శని వక్రగమనం ఆత్మపరిశీలన, సమతుల్యతకు సమయాన్ని తీసుకొస్తుంది. ఈ సమయంలో ప్రణాళికలు ఊహించిన దానికంటే ముందుకు సాగడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు, కానీ ఈ సమయం తొందరపడకుండా వ్యూహంలో మార్పును సూచిస్తుంది. ఏల్నాటి శని దశ కెరీర్ , పనిలో కొన్ని మందకొడితనాలను , అదనపు బాధ్యతలను తీసుకురావచ్చు. ధనుస్సు రాశి
ఈ రాశివారికి అర్ధాష్టమ శని నడుస్తోంది.. అంటే మీనంలో శని ఉండడంతో మీ రాశి నుంచి నాలుగో స్థానంలో సంచరిస్తోంది. ఇక శని వక్రగతి ఆర్థిక విషయాలలో మీ జాగ్రత్తను, వివేకాన్ని పరీక్షించవచ్చు. ఈ ప్రభావం కారణంగా, పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు, రుణాలు తీసుకునేటప్పుడు లేదా ప్రమాదకరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంయమనం పాటించడం ఉత్తమం. ఖర్చులను నియంత్రించడం భవిష్యత్తు కోసం క్రమపద్ధతిలో ప్రణాళిక వేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కారులో దేవుడి బొమ్మ పెట్టొచ్చా? ఏ దేవుడి విగ్రహం ఉంచాలి? ప్రయాణంలో రక్షణకు వాస్తు చిట్కాలు!
మేష రాశి
మేష రాశి వారికి ఎల్నాటి శని దశ నడుస్తోంది. మీ రాశి నుంచి 12వ స్థానంలో శనిసంచారం జరుగుతోంది. ప్రస్తుతం ఈ శని కూడా వక్రంలో సంచరిస్తుండడంతో.. ఈ సమయం అవకాశాలతో పాటు బాధ్యతలను కూడా తీసుకురావచ్చు. ఆర్థికంగా, ఖర్చుల ఒత్తిడి పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్‌లను నిర్ణయాలను సమతుల్యం చేసుకోవడం కీలకం. అదే సమయంలో, వృత్తిపరంగా, కొత్త ఉద్యోగం, కొత్త పాత్ర లేదా వృత్తిపరమైన మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సింహ రాశి
ఈ రాశివారికి వారికి, శని వక్రగమనం బాధ్యతలను, సహనాన్ని పరీక్షించగలదు. శని ప్రభావం వల్ల పనిలో, వ్యక్తిగత జీవితంలో అంచనాలు భారీగా ఏర్పరుచుకుని ఒత్తిడికి గురికావొచ్చు. పెద్ద నిర్ణయాలు తొందరపడి తీసుకోవడం కన్నా ఆలోచనలు స్పష్టంగా ఉంచుకోవడం ముఖ్యం.
బాధలో, కష్టంలో ఉన్నప్పుడు 'భగవద్గీత' ఎందుకు చదవమంటారు!
ఈ శ్లోకాన్ని ప్రతిరోజూ లేదా శనివారం ఉదయాన్నే స్మరించండి
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజంఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.
ఏ రోజు తలస్నానం చేయకూడదు? జుట్టుకు సంబంధించిన ముఖ్యమైన జ్యోతిష్య నియమాలు, నమ్మకాలు తెలుసుకోండి !
